Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏ సీఎంకన్నా యోగి 17 వేల రెట్లు బెటర్… ఎవడు ఒప్పుకోకపోయినా సరే…

May 20, 2026 by M S R

.

ఇన్నేళ్లూ ఎవరికితోచిన లెక్కలు వాళ్లు చెప్పుకున్నారు… యూపీలో ఎన్ని ఎన్‌కౌంటర్లు జరిగాయి అని… ప్రభుత్వమే ఇప్పుడు అధికారికంగా చెబుతోంది… యోగీ ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక యూపీ మాఫియా, క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపాడు… రోజుకు అయిదు ఎన్‌కౌంటర్లు… 9 ఏళ్లలో 17 వేలు దాటిన ఎన్‌కౌంటర్లు… నిజానికి ఇది చిన్న విషయం కాదు…

అదీ ఇండియా వంటి యాంటీ- ప్రభుత్వ అరాచకం బలంగా ఉన్న స్థితిలో… ఒక ముఖ్యమంత్రి… ధైర్యంగా ఇన్ని వేల ఎన్‌కౌంటర్లు..? నిజంగా సంభ్రమాశ్చర్యమే… దీంతో మొత్తం రాష్ట్రం చక్కబడిందా..? లేదు… అందరికీ తెలుసు… యాదవ – ముస్లిం మాఫియా కాంబో యూపీని ప్రపంచంలోకెల్లా ఓ నరకంగా మార్చాయని…

Ads

జస్ట్, యాంటీ- బీజేపీ కళ్లతో చూసే వాళ్లకు అర్థం కాదు… తెలంగాణకు సంబంధించి కేటీయార్‌కు అత్యంత ఆప్తుడు ఈ నరక రాజ్య అధినేత అఖిలేష్… ఇన్నివేల ఎన్‌కౌంటర్లు జరిగినా సరే, మొత్తం అదుపులోకి వచ్చిందనే పరిస్థితి రాలేదు… అంటే అఖిలేష్ అనే లీడర్ పాలన ఆ రేంజులో సాగింది అన్నమాట… అటు బెంగాల్‌లో మమత, ఇటు యూపీలో అఖిలేష్… పక్కా నొటోరియస్ జాతి వ్యతిరేక పాలన…

యూపీ

లాలూ, ములాయం, మమత… ఆయా రాష్ట్రాలను అధోగతి పట్టించిన లీడర్లు… ఈ మాట అనడానికి సందేహాలు అక్కర్లేదు… నిజానికి ఈ స్థాయిలో ఎన్‌కౌంటర్లు జరిగిన ప్రదేశం ఏమైనా ఉందా రీసెంట్ ఇయర్స్‌లో… లేదు… ఒక్క ఎన్‌కౌంటర్‌కే నానా అవస్థలు, న్యాయపరమైన చిక్కులు, బాధ్యులైన పోలీసులకు సర్వీస్ ఇక్కట్లు గట్రా ఉండే కాలమిది…

అలాంటిది ఏకంగా 17 వేలకు పైగా ఎన్‌కౌంటర్లు… అంటే రోజుకు ఐదు… 289 మంది మరణించారు… 11,834 మంది గాయపడ్డారు… 34,253 మంది అరెస్టులు…. తమంతట తాము వచ్చి ప్రాణభయంతో లొంగిపోయిన మంద సంఖ్య అదనం… అఫ్‌కోర్స్, పోలీసులు కూడా కొందరు మరణించారు… అంటే ఇన్ని వేల మంది నేరగాళ్లు యూపీని పాలించారు అన్నమాట…

ఒకరకంగా మెచ్చుకోవచ్చు యోగిని… ఓ యుద్ధం ప్రకటించాడు… మోడీలు, ఆర్ఎస్ఎస్ మోహన భగవతులు సపోర్టు చేసినా చేయకపోయినా డోన్ట్ కేర్ అన్నాడు… రియల్ రాజ సన్యాసి తను.., అధికారం లేకపోతే సింపుల్‌గా తన ఆశ్రమానికి లేదా హిమాలయాలకు వెళ్లిపోతాడు… ఈ దూకుడు, ఈ ధర్మదీక్ష సోకాల్డ్ ప్రాంతీయ, కుటుంబ, వ్యక్తి కేంద్రిత, అవినీతి, అక్రమ పార్టీలకు చేతకాదు… కాదు… కలలో కూడా..!

అందరూ పోలీసులను అనేక విషయాల్లో తిడుతుంటారు ప్రతి రాష్ట్రంలోనూ… అఫ్‌కోర్స్, అవినీతి, అక్రమాలు, అధర్మం, పెత్తనం, దాష్టీకం విషయాల్లో పోలీసులు మినహాయింపు ఏమీ కారు… ఎక్కువే… కానీ సరైన పాలకుడు ఉంటే… ధర్మం దిశలో అదే పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పటానికి యూపీయే సరైన ఉదాహరణ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏ సీఎంకన్నా యోగి 17 వేల రెట్లు బెటర్… ఎవడు ఒప్పుకోకపోయినా సరే…
  • Chicken Neck …! ఇక 4 దేశాల సరిహద్దుల్లో ఇండియా రక్షణ దుర్గం..!!
  • Vaibhav ..! ఐపీఎల్ ఫార్మాట్‌కు తన ఒరిజినల్ ఆటతీరే సూటబుల్..!
  • కొత్త క్రికెట్ టీమ్స్… ప్రధానంగా బ్యాటర్లతో కూర్పు…
  • తండ్రి హంతకుడికి తమిళ సీఎం నివాళిని రాహుల్ ఎలా స్వీకరించాలి..?!
  • Damayanthi Sen … సాహసి… నిజం పట్ల నిబద్ధత… మళ్లీ ఓ కీలక పోస్టు..!!
  • ఈ కేసు భారత న్యాయ చరిత్రలో అరుదైన రాజ్యాంగ సంక్షోభమా?
  • ‘అమ్మా’… నీకు వందనం… మా పిల్లల, మా తల్లుల ప్రాణదీపం నువ్వు…
  • “శాంతము లేక సౌఖ్యము లేదు” … “తన కోపమే తన శతృవు” …
  • Saving Syndrome..! ఇదొక జబ్బు… పొదుపు చేసీ, చేసీ… ఆరిపోవడం…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions