Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Raja Shivaji … చిన్న ఇండస్ట్రీ నుంచి పెద్ద హిట్… విశేషాలివిగో…

May 20, 2026 by M S R

.

రాజా శివాజీ..! ఈ మరాఠీ సినిమా ఇప్పుడు సినిమా సర్కిళ్లలో విశేషంగా చర్చల్లోకొచ్చింది… 100 కోట్ల వసూళ్లు దాటిన తొలి మరాఠీ సినిమా… కొన్ని విశేషాలు చెప్పుకోవాలి… ఈ సినిమాలో హీరో పాత్ర వేసింది రితేష్ దేశ్‌ముఖ్… సహరచయిత, సహనిర్మాత కూడా… మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు… తెలుగులో కొన్ని సినిమాలు చేసి పాపులరైన నటి జెనీలియా గుర్తుంది కదా… (బొమ్మరిల్లు హాసిని)… ఆమె భర్త రితేష్…

మరాఠీలో నాలుగైదు సినిమాలు నిర్మించారు వీళ్లు… నిజానికి మరాఠీ ఇండస్ట్రీ చాలా చిన్నది… రీచ్ తక్కువ… వ్యాపార పరిమాణమూ తక్కువే… కానీ ఈ సినిమాను 75 కోట్లతో నిర్మించారు… మరాఠీలో ఇదే అత్యధిక నిర్మాణ న్యయం… మరాఠీ- హిందీలలో రిలీజ్ చేశారు… శివాజీ ఛత్రపతి గాకముందు కథ ఇది…

Ads

హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో పోలిస్తే 75 కోట్లు తక్కువ బడ్జెట్ కావచ్చుగాక… కానీ ఇందులో అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, విద్యాబాలన్, జెనీలియా, భాగ్యశ్రీ, బొమన్ ఇరానీ, మహేష్ మంజ్రేకర్  తదితరులు నటించడంలో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది… వరల్డ్ వైడ్ 117 కోట్లు సాధించింది, ఇంకా నడుస్తోంది కూడా…

ఇండియన్ సినిమా అనగానే గుర్తొచ్చే పేరు దాదా సాహెబ్ ఫాల్కే కదా… తొలి ఫీచర్ ఫిలిమ్ నిర్మాత తనే… మరాఠీ మూలాలే… కానీ మరాఠీ సినిమా మాత్రం పెద్దగా ఎదగలేదు… ఇండియన్ సినిమా అంటే మనకు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలే గుర్తొస్తుంటాయి కానీ… బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ వంటి భాషల్లోనూ సినిమాలు వస్తుంటాయి…

బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లాగా మరాఠీవుడ్ ఏమీ లేదు… మరాఠీ సినిమా లేదా ఎం-టౌన్ అని పిలుస్తారు అంతే…

రితేష్ జంట దగ్గరకొద్దాం… తను హిందూ… భార్య జెనీలియా క్రిస్టియన్… ఇద్దరూ కలిసి సినిమాలు చేస్తూ ప్రేమలో పడి 2012లో రెండు మత పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు… ఈమధ్య ఏదో కన్నడ- తెలుగు ద్విభాషా చిత్రం చేసినట్టు గుర్తు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Raja Shivaji … చిన్న ఇండస్ట్రీ నుంచి పెద్ద హిట్… విశేషాలివిగో…
  • మీడియా ర్యాంకులకూ, జర్నలిస్టు అజ్ఙాన ప్రవర్తనకూ లింకేమిటబ్బా..!!
  • అదే నాగబాబు… అదే హైపర్ ఆది… అవే పాత టీమ్స్… మళ్లీ జనసేన షో…?
  • ఏ సీఎంకన్నా యోగి 17 వేల రెట్లు బెటర్… ఎవడు ఒప్పుకోకపోయినా సరే…
  • Chicken Neck …! ఇక 4 దేశాల సరిహద్దుల్లో ఇండియా రక్షణ దుర్గం..!!
  • Vaibhav ..! ఐపీఎల్ ఫార్మాట్‌కు తన ఒరిజినల్ ఆటతీరే సూటబుల్..!
  • కొత్త క్రికెట్ టీమ్స్… ప్రధానంగా బ్యాటర్లతో కూర్పు…
  • తండ్రి హంతకుడికి తమిళ సీఎం నివాళిని రాహుల్ ఎలా స్వీకరించాలి..?!
  • Damayanthi Sen … సాహసి… నిజం పట్ల నిబద్ధత… మళ్లీ ఓ కీలక పోస్టు..!!
  • ఈ కేసు భారత న్యాయ చరిత్రలో అరుదైన రాజ్యాంగ సంక్షోభమా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions