.
అవును, ఇదీ ఓ పరమానందయ్య శిష్యుల కథే… మన ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని మెలొనీ … వెరసి మెలొడీ కథ కాబట్టి… పార్లే కంపెనీకి చెందిన మెలొడి చాక్లెట్ పౌచ్‌ను మోడీ మెలొనీకి ప్రేమగా బహూకరించాడు కాబట్టి… ఒక మనవరాలికి ఒక తాత గారు అభిమానంతో చాక్లెట్లు, టాఫీలు ఇచ్చినట్టుగా వీడియోలు వైరల్ అయ్యాయి కాబట్టి… ఈ దెబ్బకు పార్లే షేర్లు అమాంతం 5 శాతం పెరిగి, అప్పర్ సర్క్యూట్ తాకి హల్‌చల్ క్రియేట్ చేసింది కాబట్టి…
మెలొనితో మోడీ దిగిన వీడియోలు, ఫోటోలు నిన్న సోషల్ మీడియాను ఓ ఊపే ఊపేశాయి… అప్పట్లో లక్షద్వీప్ బీచ్‌లో మోడీ కుర్చీ వేసుకుని, కూర్చుని… మాల్దీవుల అహాన్ని దెబ్బ తీసినట్టుగానే… మోడీ ప్రదర్శించిన ఈ పార్లె టాఫీ బహూకరణ వెనుక ఇంకేదో మర్మం ఉంటుందని ఊహాగానాల దాకా వెళ్లిపోయారు… ఈ ప్రచారం పెరిగి, ఇక పార్లె కంపెనీకి ఉజ్వల భవిష్యత్తు అనుకుని స్టాక్ మూర్ఖులు వెంటనే పార్లె అని కనిపించిన షేర్లను కొనడానికి ఎగబడ్డారు… తప్పులో కాలేశారు…
Ads

అప్పటిదాకా 5 రూపాయల ధరతో కొట్టుమిట్టాడుతున్న పార్లె దీంతో గంటారెండు గంటల్లోనే 5.25 రూపాయలకు పెరిగింది… ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… వీళ్లంతా కొన్న పార్లే ఇండస్ట్రీస్ (Parle Industries) కూ సదరు పార్లె చాక్లెట్ల ‘పార్లే ప్రొడక్ట్స్’ (Parle Products) కూ ఏమాత్రం సంబంధం లేదు…
అవును, మెలొడీ చాక్లెట్‌ను (అలాగే పార్లే-జి, మొనాకో, క్రాక్‌జాక్, మ్యాంగో బైట్, పాపిన్స్ వంటి వాటిని) తయారు చేసే ఫుడ్ కంపెనీ, ఈ ‘పార్లే ఇండస్ట్రీస్’ ఒకటి కాదు… ‘పార్లే ప్రొడక్ట్స్’ అనేది ఒక ప్రైవేట్ ఫుడ్ సంస్థ, ఇది అసలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాలేదు… 100 శాతం ప్రైవేటు కంపెనీ… ఇక ఇప్పుడు జనం ఎగబడి కొన్న ‘పార్లే ఇండస్ట్రీస్’ అనేది ఒక మౌలిక సదుపాయాలు, వ్యర్థాల నిర్వహణ (waste-management) సంస్థ— దీని ఏడాది షేరు ధర ₹4.11 నుండి ₹17.44 మధ్య గడియారంలో లోలకంలా ఊగిసలాడుతోంది…

దాని మార్కెట్ క్యాప్ 24 కోట్లు… దీన్ని మామూలు రోజుల్లో ఎవడూ దేకడు… కానీ పార్లె అనే పేరు చూడగానే ఇన్వెస్టర్లు గుడ్డెద్దు చేలో పడ్డట్లు పొలోమంటూ అడ్డదిడ్డంగా పెట్టుబడులు పెట్టేసారు— తాము పెట్టుబడి పెట్టాలనుకున్న, స్టాక్ మార్కెట్లోనే లేని ఆ అద్భుతమైన FMCG కంపెనీకి బదులు, దానితో ఏమాత్రం సంబంధం లేని ఒక అస్థిరమైన ఇన్‌ఫ్రా కంపెనీకి పెద్ద ఊపునిచ్చారు… ఇది మెలొడి కాదు… కామెడీ..!!
The core differences between the two entities outline the breakdown of their distinct operations:
| Attribute | Parle Products | Parle Industries |
| Core Business | Fast-Moving Consumer Goods (FMCG) — Biscuits, snacks, and confectionery. | Infrastructure, Real Estate Development, and Paper Waste Recycling. |
| Famous Brands | Parle-G, Melody, Monaco, Hide & Seek, KrackJack, Mango Bite. | None in the consumer space (deals in B2B recycling and real estate). |
| Stock Market Status | Unlisted. It is a privately held company owned by the Chauhan family. You cannot buy its shares on the stock exchange. | Listed on the BSE (Bombay Stock Exchange). It is a small-cap, publicly traded penny stock. |
| History & Ownership | Founded in 1929 by the Chauhan family. It remains one of India’s largest private food companies. | Originally a small subsidiary of Parle-Bisleri decades ago, but completely severed ties around 2000. It is now publicly owned with zero connection to the original food brand. |
Share this Article