.
ప్రస్తుతం ఏపీ పాలన, కీలక నిర్ణయాలు చంద్రబాబు చేతుల్లో లేవనీ, వారసుడి చెప్పుచేతల్లోకి వెళ్లాయని అందరూ అనుకుంటున్నదే … చాలా పాలనపరమైన విషయాలు డిప్యూటీ సీఎం, కమ్ బీజేపీ-టీడీపీ సంధానకర్త పవన్ కల్యాణ్‌కు నచ్చకపోయినా తప్పనిసరై భరిస్తున్నాడనే ప్రచారం ఉండనే ఉంది… ఏపీలో పెట్టుబడులు పేరిట అనుచిత, అడ్డగోలు ప్రోత్సాహకాల తంతు ఒకటి విమర్శల్లో ఉందనీ తెలుసు…
కానీ ఒకటి పవన్ కల్యాణ్‌లో కోపాన్ని అదుపు తప్పేలా చేసిందనేది జమీన్ రైతు పత్రికలో సంపాదకుడు కమ్ ఓనర్ డోలేంద్ర రాసిన కథనం… అదిప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశం… అసలే పవన్ కల్యాణ్‌కు కాస్త ఆవేశం ఎక్కువ… కాకపోతే నిగ్రహంగా ఉంటున్నాడు ఈమధ్య… అలాంటిది తనే మండిపోయిన ఆ ఉదంతం ఏమిటి..?
Ads
కట్లు తెంచుకున్న పవన్ కల్యాణ్ కోపం: ఆ ‘1700 కోట్ల’ వెనుక అసలు కథ! …. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న తరుణంలో… సడన్‌గా జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఎందుకు అంతటి ఆగ్రహం వచ్చింది? ఎప్పుడూ సంయమనంతో కనిపిస్తున్న ఆయనలో కోపం ఒక్కసారిగా ఎందుకు కట్టలు తెంచుకుంది..? దీని వెనుక ఉన్న అసలు ‘నిధుల’ భాగోతం ఏంటి?
అసలు ఏం జరిగింది? … ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం “జల్ జీవన్ మిషన్” (ప్రతి ఇంటికీ మంచి నీరు) గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గడువు ముగిసిపోయే పరిస్థితికి వచ్చింది. అయితే, పవన్ కల్యాణ్ పట్టుబట్టి, స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధానిని, సంబంధిత మంత్రులను కలిసి ఈ పథకం గడువును పొడిగించారు. చాలా కష్టపడి కేంద్రం నుంచి 1700 కోట్ల రూపాయల నిధులను రాబట్టారు.
ఉద్దేశం ఏంటంటే… ఈ నిధులతో రాష్ట్రంలోని చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, పనులను వేగవంతం చేయాలని. కానీ, ఇక్కడే సీన్ రివర్స్ అయింది!
ట్విస్ట్ ఏంటంటే… పవన్ కల్యాణ్ అంత కష్టపడి తెచ్చిన 1700 కోట్ల రూపాయల నిధులను, ఆయనకు తెలియకుండానే కొందరు అధికారులు, పంచాయతీ రాజ్ శాఖలోని ఒక బడా కాంట్రాక్టర్ కుమ్మక్కై… మొత్తం మొత్తాన్ని ఆ ఒక్క బడా కాంట్రాక్టరుకే బదిలీ చేసేశారు!
పవన్ ఆగ్రహానికి కారణాలు & పరిణామాలు…. ధర్నాకు దిగిన చిన్న కాంట్రాక్టర్లు…: తమకు రావలసిన బిల్లులు రాకపోవడంతో చిన్న కాంట్రాక్టర్లంతా మంగళగిరిలోని జనసేన ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు.
-
నిఘ్రాహం కోల్పోయిన జనసేనాని…: క్షేత్రస్థాయిలో అసలు విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అవినీతి లేని పాలన అందించాలనుకుంటే, తన శాఖలోనే ఇలాంటి తప్పు జరగడాన్ని ఆయన సహించలేకపోయాడు…
-
సీనియర్ మంత్రి రంగప్రవేశం…: పవన్ కల్యాణ్ కోపం ఏ స్థాయికి చేరిందంటే… కూటమిలో వాతావరణమే వేడెక్కింది. దీంతో ఒక సీనియర్ మంత్రి స్వయంగా పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి, క్షమాపణలు కోరవలసి వచ్చింది. “ఇకముందు ఇలాంటి తప్పులు జరగవు” అని సదరు మంత్రి హామీ ఇవ్వడంతో పరిస్థితి శాంతించింది…
- (ఎవరు ఆ సీనియర్ మంత్రి, తనెందుకు తప్పుకి క్షమాపణ కోరాడు, ఇదొక మిస్టరీ)
ఈ కథనంలో జర్నలిస్ట్ పవన్ కల్యాణ్ అంతర్గత సమావేశంలో వాడిన కొన్ని వ్యాఖ్యలను నిశితంగా విశ్లేషించాడు…
-
“ఆత్మగౌరవం” అనే అస్త్రం…: కూటమి మర్యాదగా సాగాలనే ఉద్దేశంతోనే తాను నిగ్రహం పాటిస్తున్నానని, కానీ జనసేన కార్యకర్తల ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే ఊరుకునేది లేదని పవన్ స్పష్టం చేశాడు… అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడనని చెప్పడం వెనుక పెద్ద సంకేతమే ఉంది…
-
తమిళనాడు రాజకీయాల ప్రస్తావన…: తమిళనాడులో నటుడు విజయ్ సాధించిన విజయం తర్వాత, తనపై కూడా పొలిటికల్ ఒత్తిడి పెరుగుతోందని పవన్ అనడం వెనుక… కూటమిలో జనసేన ప్రాధాన్యతను తగ్గించి చూడొద్దనే హెచ్చరిక దాగి ఉందని జమీన్ రైతు జర్నలిస్ట్ అభిప్రాయపడ్డాడు…
మొత్తానికి ఈ సీనియర్ జర్నలిస్ట్ రాసిన కథనం ప్రకారం… కూటమి ప్రభుత్వంలో అంతా ‘ఆల్ ఈజ్ వెల్’ గా సాగుతున్నట్లు కనిపిస్తున్నా, లోపల నిధుల పంపిణీ, అధికారుల పాత పద్ధతులపై పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌గా ఉన్నాడు…. లోలోపల ఏదో భారీ తేడా కొడుతోంది..!!
Share this Article