Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం కేటీయార్..! వారసపోరులో దూసుకుపోతున్న హరీష్ రావు..!!

May 23, 2026 by M S R

.

బీఆర్ఎస్ పార్టీ పగ్గాల్ని హరీష్ రావు తనకు వారసపోటీదారుగా ఉన్న కేటీయార్ చేతుల్లో నుంచి, బాస్ కేసీయార్ నుంచి లాగేసుకున్నట్టేనా..? నిన్న అమెరికాలో తన వ్యాఖ్యలు, ప్రకటనలు చూస్తే ఇదే డౌట్ వస్తుంది ఎవరికైనా..! ఒకింత ఆశ్చర్యం కూడా..!

పాపం కేటీయార్… ఇంకా ఇంకా బండి భగీరథ దగ్గరే ఆగిపోయాడు… చట్టపరంగా నేరం కూడా కనిపించే ఓ ప్రైవేటు ప్రేమ పంచాయితీ అది… బండి మీద ఎప్పటి నుంచో ద్వేషం కదా… మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో బండి సంజయ్‌ను వేటాడుతోంది… ఇక వేరే సమస్యలే లేనట్టు… ఇంకా దాన్నే పట్టుకుని వేలాడుతున్నాడు కేటీయార్…

Ads

నిజానికి ఇందులో రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి చాన్సే లేదు… చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది, అరెస్టు చేసింది, జైలులో పారేసింది… ఎవరూ ఎవరినీ కాపాడింది లేదు… కానీ హరీష్ రావు ఈ నిరర్థక పంచాయితీల్లో వేలు పెట్టకుండా… అమెరికాలో ఏదో గెట్‌టుగెదర్‌లో ఓ కీలక ప్రకటన చేశాడు…

‘‘మేం అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం…’’ ఇదీ తన విధాన ప్రకటన… ఐతే ఈ ప్రకటన చేయడానికి హరీష్ రావు ఎవరు..? తను పార్టీ అధ్యక్షుడు కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, చేస్తే గీస్తే నెత్తుటి వారసుడు కేటీయార్ చేయాలి ఇలాంటి ప్రకటనలు… తను కూడా ఇలాంటి విధాన ప్రకటనలు చేయడం లేదు… ఆమధ్య కేసీయారే స్వయంగా ‘హైడ్రాను రద్దు చేస్తాం, చెరువులో పడేస్తాం’ అన్నాడు…

అభివృద్ధి నిరోధక ప్రకటనల్ని చేయాలంటే… దాన్ని పార్టీ విధానంగా ప్రకటించాలంటే… పార్టీ అధ్యక్షుడో, లేదా కార్యనిర్వాహక అధ్యక్షుడో చేయాలి… కానీ హరీష్ రావు చేస్తున్నాడు… తానే పార్టీ బాస్ అన్నట్టుగా..! ఇదీ ఆశ్చర్యం…

ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో దాాదాపు 3000- 3500 జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వబోతోంది… గతంలో ఇదే కేసీయార్, ఇదే కేటీయార్ ద్రోహం చేశారు జర్నలిస్టులకు… ఇప్పుడు న్యాయం జరుగుతుందీ అని ఆశపడుతుంటే, రేవంత్ న్యాయం చేస్తున్నాడు అనుకుంటే… వెంటనే హరీష్ రావు కొత్త ద్రోహానికి పునాది వేస్తున్నాడు అని జర్నలిస్టులు మండిపడుతున్నారు…

సరే, ఫార్మా సిటీ రూల్స్ ఏమిటి, రేవంత్ చర్య కరెక్టా, కాదా, జర్నలిస్టులపై బీఆర్ఎస్‌కు ఎందుకింత పగ..? ఈ ప్రశ్నలను పక్కన పెడితే… ఫ్యూచర్ సిటీని ‘డెవలప్‌మెంట్’ కోణంలో చూడాలనే సోయి ఎందుకు లేకుండా పోయింది హరీష్ రావుకు..? విశ్వనగరం అని పదేళ్ల పాలనకాలంలో ఊదరగొట్టారు కదా… దానికి ఎక్స్‌టెన్షన్ ఈ ఫ్యూచర్ సిటీ… అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫ్యూచర్ సిటీ ఓ అల్టిమేట్ డెస్టినేషన్ సిటీ అవుతుంది…

మరెందుకు రద్దు చేయడం..? అదీ హరీష్ రావు వంటి నేతలు ప్రకటించడం ఏమిటి..? కేసీయార్ ఈరోజుకూ నిద్ర లేవలేదా..? జీవన్ రెడ్డి సభ తరువాత మళ్లీ మగత నిద్రలోకి జారిపోయాడా..? తను కదా ఇలాంటి పార్టీ విధాన ప్రకటనలు చేయాల్సింది… మరో విషయం…

హరీష్ రావు అమెరికా వెళ్లింది ప్యూర్ ఫ్యామిలీ వ్యవహారం… కొడుకు గ్రాడ్యుయేషన్ డే కోసం కావచ్చు… భార్యాపిల్లలతో వెళ్లాడు… అక్కడి ప్రవాసులు కలుస్తారు, రాజకీయాలూ చర్చకు వస్తాయి సహజం… కానీ వీలైనంతవరకూ వివాదాస్పద వ్యాఖ్యలకు విదేశాలకు వెళ్లినప్పుడు తావివ్వకూడదు… ఫ్యూచర్ సిటీ రద్దు ప్రకటనతో అక్కడి ప్రవాసులకు వచ్చేదేముంది..? సందర్భమేముంది అక్కడ..?  కానీ తెల్లారిలేస్తే తప్పకుండా మీడియాలో కనిపించాల్సిందే అనే ఆతృత అనుకోని నష్టాల్ని కలిగిస్తుంది…

ఇంకా నయం… రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ విగ్రహం పెడతాను అంటే కూలగొడతాం, శివుడి విగ్రహం పెడితే అదీ కూలగొడతాం, గోదావరి నీళ్లు మూసీలోకి రాకుండా అడ్డుకట్టలు కట్టేస్తాం అని ప్రకటనలు జారీ చేయలేదు… సంతోషం, ఏమో రేప్పొద్దున అవీ చెప్పినా ఆశ్చర్యం లేదు…

హరీష్ ప్రకటనను పింక్ మీడియా కూడా బాగానే పబ్లిష్ చేసింది… అంటే పార్టీ అధికారికంగా ఆ ప్రకటనను ఎండార్స్ చేసినట్టే భావించాలా…? కేసీయార్ అంత స్వేచ్ఛను, అధికారాన్ని ఇచ్చినట్టేనా..? ఆ బండి భగీరథుడిని వదిలేసి… కేటీయార్ తన వెనుక ఏం జరుగుతున్నదో చూసుకుంటే బెటర్ కాాదా… ఎలాగూ ఓ పోటీదారు కవితను వెళ్లగొట్టారు..? మరి తరువాత..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భానుమతికి ఇలాంటి పాత్రలు పడాలి… ‘పెద్దరికం’తో రెచ్చిపోదా మరి…
  • పాపం కేటీయార్..! వారసపోరులో దూసుకుపోతున్న హరీష్ రావు..!!
  • Don … అనేక అరిష్టాలను దాటుకుని… ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్…
  • పత్రికా స్వేచ్ఛలో No-1 అట… మీడియా విలువల్లో మాత్రం జీరో…
  • కోహ్లీ…! అన్ని జట్ల అభిమానులకూ ఆరాధ్యుడివే… నువ్వు తోపున్నర…!!
  • ఏపీ పాలనలో ఏదో భారీ తేడా కొడుతోంది… పవన్‌ కస్సుమనేలా…
  • రాజదీప్ సర్దేశాయ్ ఓ బొద్దింక… మరోసారి నిరూపించుకున్నాడు…
  • మోదీ శకం ఇక ముగిసినట్టేనా..? మరో కొత్త నాయకుడు అవసరమా..?
  • రాయి అంటే భౌతికంగా రాయి కాదు… అహల్య అసలు కథ వేరు…
  • ఇప్పటి మగాళ్లు ఎంత మొరటుగా కనిపిస్తే అంత ట్రెండీ మరి..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions