.
ఎగ్జాక్ట్‌లీ… రాజస్థాన్ రాయల్స్ లక్కీ… తురుపు ముక్క వైభవ్ అడ్డగోలుగా ఆడి ఔటయినా సరే… అర్చర్ బౌలింగ్ నైపుణ్యం పుణ్యమాని, కెప్టెన్ సమయానుకూల నిర్ణయాల పుణ్యమాని… నిన్న ముంబైని గెలిచింది, అదీ తమ ముంబై సొంత ఫీల్డు మీద… బలంగా కనిపించే బ్యాటింగ్ లైనప్ మీద… దాంతో ఇక ఏ లెక్కలూ, ఏ ఎక్కాలూ, ఏ సమీకరణాలూ లేకుండా నేరుగా ప్లేఆఫ్‌కు వెళ్లిపోయారు ఆర్ఆర్…
తొలి 7 మ్యాచుల్లో ఓటమి లేకుండా గెలిచిన పంజాబ్ తరువాత తడబడింది… ప్రధానంగా బౌలింగ్ వైఫల్యాలు… అర్షదీప్ అయితే వరస్ట్ రికార్డులు లిఖించుకున్నాడు పరుగులు ఇవ్వడంలో… వరుసగా ఆరు మ్యాచులు ఓడి, సంక్లిష్టమైన సమీకరణాల్లో చిక్కింది… చివరికి తప్పుకుంది… 16 సీజన్లలో లీగ్ దశలోనే వైదొలగగా, 2008లో సెమీస్, 2014, 2025 లో రన్నరప్… ఈసారైనా కప్పు కొట్టాలనుకునే కల ఇంకా కలగానే మిగిలిపోయింది…
Ads
వైభవ్ సూర్యవంశీకి మరో మ్యాచ్ చాన్స్…. క్రిస్ గేల్ 59 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేయడానికి… కానీ అందరూ పదే పదే తన మెదడులో ఎక్కిస్తున్నట్టున్నారు… స్లో స్లో అని… రాత్రి మ్యాచులో కూడా మెల్లిగా ఆడాడు, తన యూనిక్ స్టయిల్ వదిలేశాడు… చివరకు ఔటయ్యాడు…
సరే, ఎలాగోలా మిగతా బ్యాటర్లు 200 దాటించారు, తరువాత అర్చర్ ముంబై వెన్నెముక విరగ్గొట్టాడు… అత్యంత అవమానకరంగా ముంబై ఇంటికి వెళ్లిపోయింది… చివరకు చివరి మ్యాచ్ కూడా గెలవలేనంత అనామకంగా… సరే, దరిద్రంగా…
కెప్టెన్ ఎవరో తెలియదు, వస్తున్నారు, పోతున్నారు, ఎవరికీ బాధ్యత లేదు.., రోహిత్, ఎస్‌కేవై, హార్డిక్, బుమ్రా, తిలక్ వర్మ… వాట్ నాట్… అందరూ అతిరథులే… చివరకు పరాభవాలే… మొదట్లో కలకత్తా సరిగ్గా ఆడలేదు, తరువాత పుంజుకుంది… ఆర్ఆర్ గనుక ప్లేఆఫ్‌కు వెళ్లకపోతే తను కూడా ప్లేఆఫ్ బెర్త్ కోసం పంజాబ్‌తో పోటీపడేది… అదీ మిస్సయిపోయింది… ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్‌కు ఏ విలువా లేకుండా పోయింది…
సో, ఇక హైదరాబాద్ ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాలి… ఎప్పటిలాగే వైభవ్ క్లిక్కయితే హైదరాబాద్‌కు చుక్కలే… అఫ్‌కోర్స్, అదంత వీజీ మాత్రం కాదు… మొదట్లో నాసిరకం ఆటతీరు చూపించిన హైదరాబాద్ ఇప్పుడు బలంగా కనిపిస్తోంది… రాజస్థాన్‌కేమో లక్ కలిసొస్తోంది…
కానీ ఏమాటకామాట… ఇది ఐపీఎల్… ఎవరు చాంపియన్ కావాలనేది చాలా సమీకరణాల్లో ఇమిడి ఉంటుంది… బెట్టింగులు, ఫిక్సింగుల ఆరోపణలు ఎలా ఉన్నా… ఓ మంచి క్యాచ్, ఓ మంచి రనవుట్, ఓ మంచి బోల్డ్, ఓ మంచి ఇన్నింగ్స్ కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలదు…
సో, గుజరాత్ గెలవడం కోసమే ఫైనల్ వేదికను కూడా గుజరాత్‌కు మార్చారనీ, గుజరాత్ అందుకే హఠాత్తుగా పికప్ అయ్యిందనే విమర్శల్ని పక్కన పెడితే… డిఫెండింగ్ చాంపియన్ బెంగుళూరు బలంగా ఆడుతోంది… దూకుడుగా ఆడుతోంది… గుజరాత్ సరేసరి… హైదరాబాద్‌కు బలముంది, రాజస్థాన్‌కు అదృష్టముంది…
మొత్తానికి ఐపీఎల్ 2026 సీజన్ రక్తికడుతోంది… పాత సమీకరణాలన్నీ ఉల్టా కొట్టి చివరకు హైదరాబాద్ ఓనరమ్మ ఆ కప్పును గెలిచి, తన నయా ఇళయరాజా అనిరుధ్‌కు అంకితం ఇస్తుందా..? లెటజ్ వెయిట్..!! ఒరేయ్, బుడ్డోడా నువ్వయితే గేల్ సిక్సర్ల రికార్డు బద్దలు కొట్టేసి, వీలయితే అత్యధిక పరుగుల క్యాప్ తీసుకోవోయ్..!!!
మే 26… తొలి క్వాలిఫయర్… బెంగుళూరు- గుజరాత్
మే 27… ఎలిమినేటర్… హైదరాబాద్- రాజస్థాన్
మే 29… క్వాలిఫయర్ -2 … తొలి క్వాలిఫయర్‌లో ఓడిన టీమ్- ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు
మే 31 … ఫైనల్…
Share this Article