Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పట్టాల్ని కోసేయండి, ఆఫీసుల్ని కాలబెట్టండి…! ఇదేనా BRS రాజకీయం..!

May 27, 2026 by M S R

.

బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ‘రైలు పట్టాల్ని కోసేయండి, ఆఫీసుల్ని కాలబెట్టండి, మిలిటెంట్ పోకడలకు వెళ్దాం’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చిన వీడియో, వార్తలు వైరల్ అవుతున్నాయి… పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎటు వైపు వెళ్తోంది..? రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకుపోతోంది..?

ఎందుకు కాలబెట్టాలె, ఎందుకు కోసేయాలె… ప్రభుత్వం మీదకు వ్యతిరేకంగా రైతులు వీథుల్లోకి రావడం లేదట… అందుకని విధ్వంసం సృష్టించాలట… బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం లేదు, బీఆర్ఎస్ పట్ల సానుకూలత పెరగడం లేదు, అదీ అసలు ఫ్రస్ట్రేషన్… బాల్క సుమన్ వ్యాఖ్యల్ని కేసీయార్ ఎలాగూ ఖండించడు గానీ, కేటీయార్, హరీష్ రావు ఎలా వెనకేసుకొస్తారో చూడాలిక…

Ads

నిజానికి కొన్నాళ్లుగా రైతుల పేర్లతో బీఆర్ఎస్ కార్యకర్తలే రోడ్లపైకి వస్తూ… ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అనే చిత్రాన్ని మీడియాలో ఫోకస్ చేయడానికి తన్లాడుతోంది… నిజానికి ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదా..? బీఆర్ఎస్ నిర్వాకాలు కూడా ఇప్పటికీ రైతును నష్టపరుస్తున్నాయా..? ఓసారి పరిశీలిద్దాం… నిన్నటికి రాష్ట్రవ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేశారు…

ప్రస్తుత రబీ మార్కెటింగ్ సీజన్‌లో ఇప్పటికే 14.80 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) ధాన్యం కొనుగోలు పూర్తయింది… ఇప్పటివరకు 1.84 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి, రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 2,001 కోట్ల చెల్లింపులు చేశారు…

ఐతే సమస్యలు లేవా..? ఉన్నాయి, ఉంటాయి… తాలు, తరుగు, తేమ ఎప్పుడూ సమస్యలే… ఎఫ్‌సీఐ నాణ్యత ప్రమాణాల దగ్గర రాజీపడదు… నూకల శాతం ఎక్కువున్నా అంగీకరించదు… బెంగాల్ ఎన్నికలకు వెళ్లారు  వలస హమాలీలు… అన్నింటికీ మించి మిల్లర్ల దొంగాటలు మరీ ప్రధానం… కేసీయార్ హయాంలో కస్టమ్ మిల్లింగు పేరిట మిల్లర్లకు లక్షల టన్నుల ధాన్యం ఇస్తే, దాన్ని అమ్మేసుకుని, ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా వేల కోట్లను మింగారు… అది అతి పెద్ద స్కామ్…

ఈ ప్రభుత్వం వచ్చాక కేసులు పెడుతున్నా సరే, ఒక్క మిల్లర్‌నూ శిక్షించలేకపోయింది, రికవరీ చేయలేకపోతోంది… మిల్లర్లు మొరాయిస్తున్నారు… మరోవైపు సన్నాలను రేషన్‌కు సర్దుబాటు చేస్తారు, మరి దొడ్డురకాల బియ్యం..? కేంద్రం ఆశించినంతగా తీసుకోవడం లేదు… గతంలో కేసీయార్ కూడా కేంద్రాన్ని నిందిస్తూ, ధాన్యం కొనుగోళ్ల వైఫల్యాన్ని బీజేపీ మెడకు చుట్టడానికే ప్రయత్నించాడు… ఓ కేంద్ర మంత్రి దగ్గరకు వెళ్తే, మీ నూకలు మీరే బుక్కండి అని వెక్కిరించాడు వంటి వ్యాఖ్యలతో…!

నిజమే, మద్దతు ధర ప్రకటించడమే కాదు, కొనుగోలు చేయడం కూడా కేంద్రం బాధ్యతే… దాని సమస్యలు దానికున్నయ్, గోదాముల్లో నిల్వలున్నాయి, ఇంకా ఇంకా కొనుగోలు చేసే స్థితి లేదు… సో, ఈ స్థితిలో విదేశాలకు బియ్యం అమ్మకం వంటి మార్గాలపై రాష్ట్రం కాన్సంట్రేట్ చేయాల్సిందే…

ఈ స్థితిలో కూడా మక్కల కొనుగోలు స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం… సో, ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా వైఫల్యం లేదు… పైగా మద్దతు ధరకు బోనస్ కూడా కలిపి ఇచ్చి కొంటుంటే, రైతులు వీథుల్లోకి ఎందుకొస్తారు..? ఎటొచ్చీ, రైతుల్ని ఉసిగొల్పి పబ్బం గడుపుకోవాలి బీఆర్ఎస్ ప్రయత్నించడమే పెద్ద సమస్య..!!

https://www.facebook.com/reel/1595462278928660


*కలిసి రండి నాతో, మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతా’ అన్నాడు కదా మోడీ మొన్నామధ్య రేవంత్ రెడ్డితో… ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మోడీ ఏమాత్రం సహకరిస్తాడో ఇక చూడాల్సి ఉంది..,!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీకు తెలుసా..? షిర్డి సాయి ముస్లిం కాదట- పక్కా బ్రాహ్మణుడట..!!
  • పట్టాల్ని కోసేయండి, ఆఫీసుల్ని కాలబెట్టండి…! ఇదేనా BRS రాజకీయం..!
  • IPL … పేలవమైన ఆటతీరుతో గుజరాత్ ‘హిట్ వికెట్’..!
  • దారి తప్పొద్దు… బాధితుడికి అండగా ఉండటమే అసలైన ‘ధర్మం’..!
  • నిజమే, ఆమె నవ్వింది… కానీ ఆ నవ్వు నాణేనికి మరోకోణం ఇదుగో…
  • Obsession … ఏమిటీ సెన్సేషన్..? అసలు ఏముంది ఈ మూవీలో..!!
  • రేవంత్‌రెడ్డి భలే పట్టేశాడు ఆ ఫైల్ మర్మాన్ని..! తిప్పికొట్టేశాడు..!!
  • తెలుగునాట జర్నలిజం స్వేచ్ఛ, నిష్పాక్షికత… ఓ పే-ద్ధ భ్రమ..!!
  • నేల విడిచి సాము..! పెద్ద హీరోకూ, చిన్న హీరోకూ నడుమ అదే తేడా..!
  • …. రవితేజను వాణివిశ్వనాథ్ ఈడ్చి చెంపలు వాయగొట్టింది..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions