.
నిన్న ఓ వీడియో బిట్ అందరినీ ఆకర్షించింది… పుష్కరకాలంగా ఒక్క సినిమా కూడా సక్సెస్ గాకుండా, ఓ చిన్న విజయం కోసం చకోరపక్షిలా నిరీక్షిస్తూ… ఇక నిన్నటి లెనిన్ సినిమా గనుక ఫెయిలైతే ఇక తన కెరీర్ క్లోజ్ అనుకుని తీవ్ర ఒత్తిడిలో ఉన్న అఖిల్ అక్కినేని, లెనిన్ సినిమాకు కొంత పాజిటివ్ టాక్ రావడంతో ఇక ఆ ఉద్వేగాన్ని పట్టలేకపోయాడు…
తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట తండ్రి నాగార్జున కాళ్లు మొక్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు… అర్థం చేసుకున్నాడు నాగార్జున… గట్టిగా హత్తుకున్నాడు చాలాసేపు… తండ్రి భరోసా అది… తనకూ ఇన్నాళ్లు ఓ బాధ ఉండేది అఖిల్ కెరీర్ గాడిన పడటం లేదని… తనకూ ఈ సినిమా ఓ రిలీఫ్…
Ads
https://www.facebook.com/reel/4466199306934795

దీనికి సమాంతరంగా నిన్న మీడియాలో, సోషల్ మీడియాలో మరో అంశం ప్రధానంగా కనిపించింది… నాగ చైతన్య, సమంత విడిపోయి చాన్నాళ్లయింది… ఇద్దరూ మళ్లీ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు… ఎవరి బతుకులు వాళ్లవి… ఒకరికొకరు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు…
ఆమధ్య ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సమంత పేరును ప్రస్తావించి ఓ మంత్రి ఏదో మాట్లాడటం వివాదానికి దారితీయడం, నాగార్జున కేసు పెట్టడం తెలిసిందే కదా… అక్కినేని కుటుంబం కూడా సమంత విషయంలో సైలెన్స్ మెయింటెయిన్ చేస్తోంది… కానీ ఇప్పుడు విశేషం ఏమిటంటే..?

సమంత సినిమా మా ఇంటి బంగారం హిట్ కావాలంటూ అఖిల్ శుభాకాంక్షలు చెప్పాడు… ఇంట్రస్టింగ్… నాగార్జున కుటుంబంలో అన్నాదమ్ముల మధ్య పడటం లేదాని సందేహాలు మొదలయ్యాయి… ఇప్పుడు సమంత కూడా లెనిన్ సినిమాకు మంచి టాక్ వస్తోంది అంటూ శుభాకాంక్షలు చెప్పింది… ఇప్పుడిక చర్చ…
అసలు నాగ చైతన్య తన సోదరుడి సినిమా పట్ల శుభాకాంక్షలు చెప్పకపోవడం ఏమిటి..? సమంత చెప్పడం ఏమిటి..? అంతకు ముందు అఖిల్ సమంత సినిమాకు శుభాకాంక్షలు చెప్పడం ఏమిటి..? బిగ్‌బాస్ కుటుంబంలో ఏవో పొరపొచ్చాలు వచ్చినట్టున్నాయి, ఏమిటవి? ఎందుకు? ఇదీ చర్చ ఇండస్ట్రీ సర్కిళ్లలో!
Share this Article