Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దొందూ దొందే… నాగేశ్వర్- పవన్ కల్యాణ్… తెలంగాణకు అక్కర్లేని కేరక్టర్లు…

May 31, 2026 by M S R

.

జనసేన- టీడీపీ కూటమి వర్సెస్ నాగేశ్వర్….. చివరకు అది ప్రాంతవాదాన్ని, కులవాదాన్ని ఆశ్రయించి, ఎటెటో మలుపులు తిరుగుతూ… ఓ పెంట యవ్వారం అయిపోతోంది… తాజాగా ఓ వైశ్యుడు ఎవరో వైశ్య నాగేశ్వర్‌ను వేధిస్తున్నందుకు నిరసనగా 2029లో 16 లక్షల మంది వైశ్యులు టీడీపీ కూటమికి వోట్లు వేయరు అని ఏదో సోషల్ మీడియా కార్డు పోస్టు చేశాడు… నవ్వొచ్చింది…

ఆయన ఏ ప్రాంత వైశ్యుడో తెలియదు, ఈ 16 లక్షల మంది వైశ్యులు ఎక్కడ కూటమికి వోటు వేయరో క్లారిటీ లేదు… నాగేశ్వర్ ఎప్పుడు వైశ్య కులోద్ధారకుడు ఎప్పుడయ్యాడో తెలియదు… అవునూ, తెలంగాణలో టీడీపీ- జనసేన కూటమి పోటీ చేస్తుందా..? బీజేపీతో కలిసి వస్తే, పక్కా తెలంగాణ వ్యతిరేకి పవన్ కల్యాణ్‌ను నెత్తిన మోయడానికి తెలంగాణ జనం సిద్ధంగా ఉన్నారా..? అంత చేవచచ్చి ఉన్నదా తెలంగాణ ప్రజానీకం..?

Ads

నాగేశ్వర్

ఓ మిత్రుడు చెబుతున్నాడు… ‘‘సర్, నాగేశ్వర్, పవన్ కల్యాణ్ దొందూ దొందే… పక్కా తెలంగాణ వ్యతిరేకులు… తెలంగాణ ఏర్పడ్డాక 11 రోజులు నిద్రాహారాలు మాని దుఖించిన పవన్ కల్యాణ్ చివరకు కోస్తాలో కొబ్బరి చెట్లు ఎండిపోయినా దానికి తెలంగాణ దిష్టి అనే తిక్క వ్యాఖ్యలు చేశాడు… ప్రతి నెత్తుటి చుక్కలో తెలంగాణ వ్యతిరేకత తనకు…

నాగేశ్వర్ సీపీఎం మనిషి… ఆ పార్టీ పక్కా తెలంగాణ వ్యతిరేకి… ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది కూడా… నాగేశ్వర్ ఎప్పుడూ ఓ తెలంగాణ వాడిగా, ఓ వైశ్యుడిగా ఐడెంటిఫై కాలేదు… తెలంగాణకు గానీ, వైశ్య కులానికి గానీ చేసిందేమీ లేదు… జీరో… ఆ తన్నుకుంటున్న ఇద్దరూ తెలంగాణ వ్యతిరేకులే…’’

తను ఓ ఉదాహరణ చెప్పాడు… ‘‘2019 ఎన్నికల్లో ఇదే లెఫ్ట్ పార్టీలు జనసేనతో కలిసి ప్రయాణించాయి… ఇదే తెలకపల్లి రవి, ఇదే నాగేశ్వర్ అనే ఎర్ర మేధావులు జనసేన ప్రభంజనం అని ఇంటర్వ్యూల్లో తెగమోశారు… చివరకు ఏమైంది..? పవన్ కల్యాణ్ చాంచల్యం అర్థమైంది… లెఫ్ట్ తెల్ల మొహం వేసింది’’ ఎవరో ఒకరికి తోకగా పనిచేయడం తప్ప లెఫ్ట్‌కు సొంత అస్థిత్వం ఏముంది ఇప్పుడు..?

ఎస్, జర్నలిస్టు అనే కోణం వచ్చినప్పుడు… నా మద్దతు నాగేశ్వర్‌కే… తను ఎవరికి పేటీఎం కార్యకర్త అయినా సరే… సాక్షి తనను ఎంత వెనకేసుకొస్తున్నా సరే… తను తన వ్యాఖ్యానాలకు, విశ్లేషణలకు సోర్స్ చెప్పాల్సిన పని లేదు… తన అవగాహన, తన అంచనా మేరకు ఏదో చెప్పాడు… అలాగని తీవ్ర అసహనంతో ఉడికిపోతూ తన మెడ మీద కత్తులు, కేసులు వేలాడదీయడం కూటమి ప్రభుత్వ అరాచకం… కలానికి ప్రమాదకరం కూడా… ఐనా సొంత పైత్యాలు ప్రదర్శించని ఏపీ కలాన్ని ఒక్కటి చూపించండి ఈరోజున..!! చివరకు మెయిన్ స్ట్రీమ్ అనబడే సాక్షి, జ్యోతి, ఈనాడు, సంబంధితపార్టీ రంగుల చానెళ్లు సహా..!!

ఎటొచ్చీ, తెలంగాణలో పుట్టాడు కాబట్టి తెలంగాణ నాగేశ్వర్‌ను ఆ కారణంచేత ఓన్ చేసుకుని, తన వెనుక నిలబడాల్సిన పనిలేదు… పుట్టుక వేరు- వివాదం వేరు… తెలంగాణలో పుట్టినంత మాత్రాన ఎవరినైనా తెలంగాణ సమాజం నెత్తిన పెట్టుకోవాలి, చివరకు తనకు వ్యతిరేకి అయినా సరే..!? సరే, వైశ్యకులం ఏమాత్రం పట్టించుకోనవసరం లేని కేరక్టర్… కానీ సమయానికి తనకు కులం కావాలి, ప్రాంతం కావాలి…

తనే సారీ చెప్పాడు, మళ్లీ తనే గోకుతుంటాడు, గొప్ప పోరాటయోధుడిగా, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోను, కేసులు పెట్టండి అంటూ…! సారీ చెప్పావు అంటేనే తప్పు చేసినట్టు లెక్క, అంగీకరించినట్టు లెక్క… మరి పదే పదే ఎందుకు గోకుతున్నట్టు..? జనసేన విజ్ఞత, ఆ పార్టీ కేరక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసు, మరి నీ విజ్ఞత, వివేచన, విచక్షణ జ్ఞానం ఏమైంది ప్రొఫెసర్..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Cricketer Shami – యూపీ రాజకీయాల్లో స్టార్ పేసర్ షమి !!
  • ఓ ఆరోగ్యకరమైన చర్చ – ఏకశిల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు !?
  • రాహుల్… నీకూ తల్లి ఉంది… కనీసం నీ డర్టీ టీమ్‌ను మార్చుకో…
  • Immortal – సరుకులన్నీ బాగానే ఉన్నయ్ … వంట కుదరలేదు, అంతే…
  • రోజులు మారాయ్ ! నువ్వెంత తోపు స్టార్ అయితేనేం- స్టోరీ ఏమిటో చెప్పు !
  • అమ్మగారు ఐరాస మెట్లు ఎక్కుతున్నారు – రచ్చ ముఖ్యం !!
  • ప్రొఫెనలిజం – ఎవరు నిజమైన దొంగలు ? ఓ బ్యాంకు చోరీ కథ !!
  • Only SunDay- Not FunDay… పరమ పేలవంగా నాగార్జున వీకెండ్ షో !
  • మైండ్ బ్లాకయ్యేలా… జన్వాడ భూముల ‘మోడస్ ఆపరెండి’…
  • పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions