Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Sayaji Shinde … వెండి తెరపై విలన్ కావచ్చు… రియల్ లైఫ్‌లో ‘సూపర్ హీరో’…

June 1, 2026 by M S R

.

Priyadarshini Krishna …. తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి, చిన్నగా మొదలుపెట్టిన పనిని ఒక ఉద్యమంగా వెల్లువగా మార్చేసిన నటుడు శ్యాజీ షిండే….
తమ సొంత ఊరిలో చెట్లు కరువై నీడలేక, నీరులేక, వానలేక, కరువు సంభవించి జనాలు ఇబ్బందిపడటం చూసి శ్యాజీ షిండే తల్లి అతని నుండి ఒక వాగ్దానం తీసుకుంది…
ఊరిలో కనీసం ప్రజల సౌకర్యార్థం వృక్షాలను పెంచాలి అని కోరింది …
కానీ ఆమె అంతలోని శివైక్యం చెందింది …

తల్లికి ఇచ్చిన ఆన ప్రకారం శ్యాజీ షిండే మెల్ల మెల్లగా మహావృక్ష జాతులను నాటి, సంరక్షించడం మొదలెట్టాడు…. ఇది రోజురోజుకి ‘వటుడింతై’ అన్నట్లుగా పది నుండి వెయ్యి … వెయ్యి నుండి పదివేలు తర్వాత అలా అలా ఆ చెట్ల సంఖ్య ఆరున్నర లక్షలకు చేరింది ….

Ads

ఇదంతా మహారాష్ట్రలోని 29 వివిధ లొకేషన్లలో ఉద్యమంగా సాగిపోయింది. ఇలాంటి మహత్తర కార్యాన్ని చెయ్యడానికి శ్యాజీ షిండే ఒక NGO ని 2016 లో స్థాపించాడు … శ్యాయాద్రి దేవరాయ అనే పేరుతో ఎండనకా వాన అనక ఇప్పటివరకు చేసుకుంటూ నాటుకుంటూ సాగిపోతున్నాడు….

చెట్లకు అనాధాశ్రమం: ఈ 2026 లో మాత్రం శ్యాజీ షిండే వార్తల్లోకి ఎక్కడమే కాకుండా వైరల్ కూడా అయ్యాడు…
మహారాష్టలోని సతారా జిల్లాలోని అంబేవాడ గ్రామానికి ఆనుకుని కొత్తగా జాతీయ రహదారి వెయ్యడం ప్రారంభించారు… దానికి గాను రైతుల నుండి దారికి కావలసిన జాగాని కూడా సమకూర్చుకుంది ప్రభుత్వం …
ఐతే …. దారికి అడ్డంగా వున్నాయంటూ వందల ఏళ్ళ వయస్సుగల చెట్లని నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్న సంగతి వలంటర్ల ద్వారా శ్యాజీ షిండే కి తెలిసింది ….

వెంటనే తన శక్తికి మించిన పని అయినా కూడా చెట్లను నరకడాన్ని అడ్డుకుని, చెట్లను కూకటివేర్లతో పెకిలించి వేరొక ప్రాంతంలో నాటి, వాటిని సంరక్షించి కొత్త చివుళ్లు వేయించేవరకు నిద్రపోలేదు…

అలా మర్రి, కానుగ, మద్ది, రావి వంటి వందల వట వృక్షాలను కాపాడి వాటికి కొత్త స్థావరాన్ని కల్పించాడు శ్యాజీ షిండే…. ఈ వృక్షాలకి GI tag ఇచ్చి ఒక QR code ని కూడా అమర్చారు… ఆ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ చెట్టు తాలుకా వివరాలు అన్ని ప్రజలకు తెలిసేలా రూపొందించింది శ్యాజీ షిండే కి చెందిన శ్యాయాద్రి దేవరాయ సంస్థ….

తల్లికి ఇచ్చిన మాటని జవదాటకుండా గొప్ప కొడుకు అనిపించుకోడమే కాదు … ప్రజలందరూ కొనియాడేలా ఆదర్శవంతుడు అయ్యాడు …. #SayajiShinde

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవును, ఇవిగో ఇవే… తెలంగాణ అస్థిత్వ పునఃప్రమాద సంకేతాలు..!!
  • Sayaji Shinde … వెండి తెరపై విలన్ కావచ్చు… రియల్ లైఫ్‌లో ‘సూపర్ హీరో’…
  • “నో ఫిక్సింగ్, నో దందా, నో గుజరాత్..! మళ్లీ ఆర్సీబీ… జయహో కోహ్లీ..!
  • ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!
  • మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…
  • Madhuvidhu … క్లీన్ ఫ్యామిలీ కామెడీ మూవీ..! మన జంధ్యాల గుర్తొస్తాడు..!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • ఆ బుడ్డోడు వైభవ్ మాత్రమే కాదు… ఈ గొప్పోడు కూడా గుర్తుకురావాలి…
  • దొందూ దొందే… నాగేశ్వర్- పవన్ కల్యాణ్… తెలంగాణకు అక్కర్లేని కేరక్టర్లు…
  • ఇక నీ కెరీర్ క్లోజ్ అన్నారందరూ… ఈమె అస్సలు లెక్కచేయలేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions