Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆల్ పార్టీ మీటింగు… నవ్వు పుట్టించే తెలంగాణ ప్రభుత్వ లేఖ…

June 2, 2026 by M S R

.

నిజమైన తెలంగాణవాదులు నవ్వుకునేలా ఉంది తెలంగాణ ప్రభుత్వం వ్యవహారం… తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కార్యాచరణ ఎలా ఉండాలో చర్చించడానికి ఈనెల 4న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం… దీనికి సంబంధించి అన్ని పార్టీలకూ అధికారికంగా ఓ లేఖ రాసింది…

సరే గానీ, అసలు ఉద్యమకారుడు అంటే ఎవరు..? దీనికి ముందుగా ఓ నిర్వచనం, ఓ ప్రాతిపదిక ఉందా..? ప్రభుత్వం ఏం చెబుతోంది..? అది కదా ఫస్ట్ తేల్చాల్సింది… కేసులకు గురై ఉండాలా..? ప్రోగ్రాముల్లో పాల్గొన్నట్టు పత్రిక వార్తలు, మీడియా క్లిప్పులు ఆధారంగా ఉండాలా..? పోలీస్ స్టేషన్లలో సతాయింపబడి ఉండాలా..? ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాలి..?

Ads

తెలంగాణ కోసం సకలజనుల సమ్మె జరిగింది… ఉద్యోగులతోపాటు తెలంగాణవ్యాప్తంగా అన్ని వృత్తులవాళ్లూ పాల్గొన్నారు, ఎలుగెత్తారు… అందరూ ఉద్యమకారులే కదా… మరి వీరిలో ఎవరిని, ఏ ప్రాతిపదికన, ఉద్యమకారుడు అని విడదీసి లెక్కిస్తారు, గుర్తిస్తారు..? సరే, ఏదో ప్రయాసపడుతున్నారులే అనుకుందాం… కానీ ఇదేమి లేఖ, ఇవేం పార్టీలు..?


ఉద్యమకారులు

అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యే అర్హత ఏమిటి ఒక పార్టీకి..? తెలంగాణలో గుర్తింపు పొంది ఉండటమా..? తెలంగాణలో రిజిష్టర్ అయి ఉండటమా..? ఏవైనా ఎన్నికల్లో పోటీపడి ఉండటమా..? ఏమైనా సాధించిన వోట్ల లెక్కలా..? ఏది అర్హత…? పోనీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీలా..?

(ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలను, జాతీయ పార్టీలను పిలిచారని అనుకుందాం… కనీసం కొన్ని పార్టీల రాష్ట్ర శాఖలున్నాయా ఇక్కడ..? అసలు టీడీపీ తెలంగాణ కార్యవర్గం అయినా ఉందా..? ఇక్కడ ఇష్యూ ఏమిటి, ఎవరిని పిలవాలనే సోయి ప్రధానం కదా, ఆ సోకాల్డ్ జాతీయ పార్టీలు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు మీద ఇచ్చే సలహాలు ఏముంటయ్..?)

ఇందులో ఆప్ ఉంది… అదెక్కడి పార్టీ..? తెలంగాణకు ఏం సంబంధం..? వైసీపీ ఉంది, తెలంగాణను వ్యతిరేకించి, ఇక్కడ దుకాణమే మూసేసుకున్న పార్టీ అది… సీపీఎం ఉందీ, అదీ తెలంగాణను ఖండితంగా వ్యతిరేకించిన పార్టీయే… బహుజన సమాజ్ పార్టీ, సరే, తెలంగాణ విభాగం ఇంకా ఉన్నట్టుంది…

ఈ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎక్కడిది..? ఎవరిది..? మజ్లిస్‌కూ తెలంగాణ పోరాటానికీ సంబంధం లేదు… వెటకారంగా చెప్పాలంటే… తెలంగాణను అత్యంత భారీ తీవ్రంగా ప్రేమించిన జనసేనకు ఆహ్వానం లేదేమిటి..? నిజానికి ప్రస్తావించాల్సింది మరో అంశం… తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా వ్యవహరించి, తెలంగాణ కోసమే పార్టీ పెట్టిన కోదండరాం పార్టీ పేరు ఏది ఇందులో..? ఉద్యమకారుల ఇష్యూపై గొంతెత్తుతున్న టీఆర్ఎస్ (కవిత పార్టీ)కి ఆహ్వానం ఏది..?

మున్సిపల్ ఎన్నికల్లో ఓ మున్సిపాలిటీని గెలుచుకున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరెందుకు లేదు ఇందులో… దాని ఎగ్జిస్టెన్స్ ఉంది కదా తెలంగాణలో… అంతేతప్ప వైసీపీ, ఆప్ తదితరాలు ఎక్కడున్నాయి..? మరి ఏ ప్రాతిపదిక ఈ పార్టీలకు ఆహ్వానాలు… తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు మీద వీళ్ల సూచనలకు ఉన్న విలువెంత..? రేవంత్ రెడ్డికి చెడ్డపేరు తీసుకొచ్చేవి ఇలాంటివే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆల్ పార్టీ మీటింగు… నవ్వు పుట్టించే తెలంగాణ ప్రభుత్వ లేఖ…
  • Annamalai Breaks Free of His Shackles… Trouble Ahead for Palaniswami
  • నందూస్ వరల్డ్..! ఈ ట్యూబర్ చీటరా..? అసలేం జరుగుతోంది..?!
  • బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…
  • రాత్రికిరాత్రి వైరల్ స్టార్… ఒక్క రాత్రికి నీ రేటెంత అనడిగేదాకా…
  • yudhvir ahlavath … హఠాత్తుగా సోషల్ మీడియాలో వైరల్… ఎందుకంటే…
  • రహేఁ నా రహేఁ హమ్…! ‘సుమనో’హర మధుర స్మృతి, ఒక మూగ వేదన..!
  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions