Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘తెలుగు మందు’ సీసా ‘అందుబాటు’ సైజుల్లో… ఖజానాకు మరింత కిక్కు…

June 4, 2026 by M S R

.

పాతికేళ్ల క్రితం ఓ తెలుగు సినిమా… అందులో సౌందర్య హీరోయిన్, జేడీ చక్రవర్తి హీరో.,. ఎవరో జేడీని ఓ వ్యాపార చిట్కా అడుగుతారు, మా టూత్ పేస్ట్ అమ్మకాలు పెరగాలి, ఏం చేయాలి అని… దానికి చక్రవర్తి ఇచ్చిన ఐడియా… “పేస్ట్ వచ్చే రంధ్రం (Nozzle) సైజును కొద్దిగా పెంచితే, తెలియకుండానే ఎక్కువ పేస్ట్ బయటకు వస్తుంది, త్వరగా అయిపోతుంది, త్వరగా కొత్తది కొంటారు!”

ఇప్పుడు మద్యం కంపెనీల వ్యాపారవ్యూహం కూడా ఇదే… కొన్ని వార్త సంస్థలు ‘మద్యం ప్రియులకు శుభవార్త’ అంటూ కంపెనీలు 150, 200 ఎంఎల్ సీసాలను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నాయి, పండుగ చేసుకొండి అన్నట్టుగా రాసిపారేశాయి… అది శుభవార్త ఏమిటో..? ప్రభుత్వాలు కూడా సై అంటున్నాయి ఈ కొత్త సీసాలకు… కారణం… ఈ కొత్త సైజుల వెనుక ఉన్న అసలు “కార్పొరేట్ మైండ్ గేమ్”…

Ads

సింపుల్… వినియోగం పెంచడం, తద్వారా ఖజానాకు మరింత రెవిన్యూ… ప్రజలు మరింత తాగడం… ఓ వ్యక్తికి క్వార్టర్ చాలు, మార్కెట్‌లో 200 ఎంఎల్ సీసా కనిపిస్తుంది… అంటే ఆమేరకు ధర ఎక్కువ, తాగుడు ఎక్కువ… ఫలితంగా అమ్మకాలు ఎక్కువ, సర్కారుకు ఆదాయం ఎక్కువ, అమ్మకాలు పెరిగి కంపెనీలకు లాభాలు ఎక్కువ…

నిజానికి ప్లాస్టిక్, గాజు సీసాల కంటే టెట్రా ప్యాక్‌ల (Tetra Packs) వల్ల కంపెనీలకు తయారీ, రవాణా ఖర్చులు చాలా తగ్గుతాయి. కర్నాటకలో చౌక రకం మద్యం (చీప్ లిక్కర్) దాదాపు 35% నుండి 44% వరకు ఈ టెట్రా ప్యాక్‌లలోనే అమ్ముడవుతోంది… ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా తమ ఎక్సైజ్ విధానాల్లో దీనికి మొగ్గు చూపాయి…

కానీ, దీనిపై సుప్రీంకోర్టు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రేకులు వేసింది. సుప్రీంకోర్టు దీనిని వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు…

1. “ఫ్రూట్ జ్యూస్” అనుకునే ప్రమాదం (Deceptive Packaging)… ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ ప్యాకెట్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. “ఇవి చూడటానికి ఆపిల్, మ్యాంగో ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్లలా ఉన్నాయి, కానీ లోపల వోడ్కా, విస్కీ ఉంటున్నాయి. ప్యాకింగ్ పై పండ్ల బొమ్మలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు (Very Deceptive)” అని కోర్టు మండిపడింది.

2. స్కూల్ బ్యాగుల్లో దాచుకునే వెసులుబాటు (Easy Concealment)… ఈ టెట్రా ప్యాక్‌లను జేబుల్లో లేదా స్కూల్ బ్యాగుల్లో చాలా ఈజీగా దాచుకోవచ్చు. దీనివల్ల మైనర్లు, పాఠశాల/ కళాశాల విద్యార్థులు సులువుగా వీటికి అలవాటు పడే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు కూడా జ్యూస్ ప్యాకెట్ అనుకుని కనిపెట్టలేరని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

3. బహిరంగ మద్యపానం, అక్రమ రవాణా (Smuggling)…. గాజు సీసాలైతే ఒకదానికొకటి తగిలి శబ్దం వస్తుంది, బరువుగా ఉంటాయి. అదే టెట్రా ప్యాక్ అయితే ఎలాంటి శబ్దం రాదు ఎక్కడికైనా నిశ్శబ్దంగా తీసుకుపోవచ్చు… ప్రయాణాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో ఎవరికీ అనుమానం రాకుండా తాగేయవచ్చని ఎన్జీవో సంస్థ ‘కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్’ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతూ, దేశవ్యాప్తంగా టెట్రా ప్యాక్ మద్యానికి వ్యతిరేకంగా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.

అందుకే కంపెనీలు టెట్రా ప్యాక్ రూపంలోకి వెళ్దామనుకున్నా కోర్టుల నిబంధనల వల్ల కుదరడం లేదు. దాంతో, “రూపం (టెట్రాప్యాక్) మార్చలేకపోయినా, కనీసం సైజులైనా (150ml, 200ml) మార్చి” వినియోగదారుల నుంచి మరిన్ని డబ్బులు రాబట్టేలా సేల్స్ పెంచుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

ప్రస్తుతం కొన్ని బ్రాండ్లు 90 ఎంఎల్ సీసాలు కూడా అమ్ముతున్నాయి… అంటే ఓ పెగ్గున్నర… ఇప్పుడు క్వార్టర్‌కు సరిపడా డబ్బు లేక 90 ఎంఎల్ కొనేవాడు, ఇప్పుడు టెంప్టయి, మరో పెగ్గు మాత్రమే కదా అదనం అనుకుని 150 ఎంఎల్ సీసా కొంటాడు…

2. ఎక్కువ లాభాల మార్జిన్ (Premium Pricing)… చిన్న సైజు బాటిళ్లపై కంపెనీలకు లాభాల మార్జిన్ ఎక్కువగా ఉంటుంది… 750 ml పెద్ద బాటిల్ కొంటే వచ్చే లీటరు ధర కంటే, చిన్న 150 ml లేదా 200 ml బాటిళ్ల రూపంలో కొంటే లీటరుకు పడే ధర ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది…

సినిమాలో కేవలం టూత్‌పేస్ట్ సేల్స్ పెంచడానికి ఆ ట్రిక్ వాడితే, ఇక్కడ మద్యం కంపెనీలు తమ టర్నోవర్, ప్రాఫిట్స్ పెంచుకోవడానికి ఈ సైకాలజీని వాడుతున్నాయి…

పేరుకు ‘అవే ధరలు వర్తిస్తాయి’ అంటారు… అంటే 180 ఎంఎల్ ధరకు 200 ఎంఎల్ ఇస్తారని కాదు… ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల లెక్కింపు విధానం (Pricing Policy / Formula) ఈ కొత్త సైజులకు కూడా వర్తిస్తుందని అర్థం… అంటే, మిగిలిన బాటిళ్ల ధరను ఏ పద్ధతిలో (దామాషా ప్రకారం) లెక్కిస్తారో, ఈ 150 ml, 200 ml బాటిళ్ల ధరలను కూడా అదే సూత్రం ప్రకారం లెక్కిస్తారు.

ఉదాహరణకు… ఒక సాధారణ (చీప్ లిక్కర్) బ్రాండ్ క్వార్టర్ (180 ml) ధర ₹120 అనుకుందాం. అప్పుడు మిల్లీలీటర్ల లెక్క ప్రకారం కొత్త సైజుల ధరలు ఈ విధంగా మారుతాయి… 90 ml (పావు క్వార్టర్) ధర ₹60 అవుతుంది.150 ml (కొత్త సైజు) ధర సుమారు ₹100 అవుతుంది.180 ml (క్వార్టర్)  ధర ₹120 ఉంటుంది. 200 ml (కొత్త సైజు) ధర సుమారు ₹133 అవుతుంది.. మార్కెట్లో వినియోగదారులకు ఎక్కువ ఆప్షన్లు (Choices) ఇవ్వడం ద్వారా విక్రయాలు పెరుగుతాయి.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మారని KTR దగ్గూదమ్మూ భావజాలం… 8 నుంచి బత్తిన చేపమందు…
  • శిష్యుడిని మింగిన గురువు అరుదైన కథ… ప్రతి పాటా ఓ స్వాతికిరణమే…
  • ‘తెలుగు మందు’ సీసా ‘అందుబాటు’ సైజుల్లో… ఖజానాకు మరింత కిక్కు…
  • పెద్ది… నటుడిగా రాంచరణ్‌‌కు పేరొస్తుంది… నిర్మాతకు డబ్బులొస్తాయి…
  • బెంగాల్ షిండే..! ఎవరు ఈ రితాబ్రత బెనర్జీ..? ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!
  • తులం బంగారమూ అమ్మలేదు… రిజర్వ్ బ్యాంకు స్పష్టీకరణ…
  • తప్పో ఒప్పో… మాస్టారిని ఆరాధించటం… చివర్లో ప్రేక్షకుల చేత కంట తడి…
  • ‘మావోడి ధర్మ నిర్మూలన వ్యాఖ్యల్ని క్షమించి, వాడిని కాపాడు తల్లీ…’
  • లక్ష కోట్ల బంగారం అమ్మేశాడా మోదీ..! బ్లూమ్‌బర్గ్ కథనం- వార్తలు…
  • కళ్లు పొడిచే LED కాంతి..! రాత్రి ప్రయాణం ప్రాణాంతకమేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions