Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకరకంగా నెహ్రూకన్నా మోడీయే డిస్టింక్షన్ పాస్… ఎందుకంటే..?

June 5, 2026 by M S R

.

అందరూ రాస్తున్నారు, మోడీ ఈ దేశ తొలి ప్రధాని నెహ్రూ రికార్డును బద్దలు కొట్టేయబోతున్నాడు, అది గ్రేట్ అని..! కానీ ఏమాటకామాట… నెహ్రూ ఉన్న కాలంతో పోలిస్తే మోడీ నిరంతర పదవీకాలం అత్యంత విశేషం… ఏ ప్రజాస్వామ్య దేశపు నాయకుడైనా కలలు గనే రికార్డు ఇది… నిజానికి మోదీ పదవీకాలాన్ని కాస్త డిఫరెంటుగా చూడాలి…

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 7న ప్రమాణ స్వీకారం చేసి, వరుసగా విజయాలు సాధిస్తూ 2014 మే 21 వరకు, అంటే 4610 రోజులు పదవిలో ఉన్నాడు… (దాదాపు 13 సంవత్సరాలు, ఏకధాటిగా)…

Ads

తరువాత భారత ప్రధానిగా 2014 మే 26న బాధ్యతలు చేపట్టాడు… నాటి నుంచి నేటి వరకు (2014 మే 26 నుండి 2026 జూన్ 5 వరకు) వరుసగా మూడు విడతలుగా ప్రధానిగా కొనసాగుతున్నాడు. అంటే మొత్తం రోజులు 4,394 రోజులు… 2026 జూన్ 10 నాటికి మోదీ ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని… తొలి సార్వత్రిక ఎన్నికల (1952) తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా (Continuously) ప్రధానిగా  నెహ్రూ రికార్డును (4,398 రోజులు) అధిగమించనున్నాడు… (ఇందిరాగాంధీ పదవీకాలం 4077 రోజులు)…

ఇక్కడ చెప్పుకోవల్సిన విశేషం ఏమిటంటే… మార్చి 22, 2026 నాటికి నరేంద్ర మోదీ సీఎంగా, పీఎంగా కలిపి మొత్తం 8,931 రోజులు పూర్తి చేసుకున్నాడు… (నేటిెకి 9004 రోజులు)… దీనితో భారతదేశ చరిత్రలోనే ఒక ఎన్నికైన ప్రభుత్వానికి అత్యంత సుదీర్ఘ కాలం అధిపతిగా (Head of Government) పనిచేసిన నాయకుడిగా సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ (8,930 రోజులు) రికార్డును మోదీ బద్దలు కొట్టాడు…

ఉక్కు మహిళ కాలం నాటి యుద్దాలు, అమెరికా వంటి దేశాల నుంచి ఒత్తిళ్లు, అణు సామర్థ్యం వంటి అనేక సవాళ్లలో గట్టిగా నిలబడింది… ఆమె అధ్యాయం వేరు… కానీ నెహ్రూతో మోడీని పోలిస్తే… నెహ్రూ కాలంలో దేశంలో బలమైన ప్రతిపక్షం లేదు, స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా గుర్తింపు… గాంధీ హత్య అనంతర సానుభూతి… నెహ్రూ పార్టీలో ఏది చెబితే అదే శాసనం… తనకు పెద్ద సవాళ్లు లేవు… దేశం కోసమే ఆలోచించి, పనిచేసిన మంచి దేశభక్త నిపుణులు, బ్యూరోక్రాట్ల టీమ్ అప్పట్లో… కానీ మోడీ..?

ప్రాంతవాదం, ఉగ్రవాదం, మతవాదం, కమ్యూనిజం, వేర్పాటువాదం, తీవ్రవాదం, కులవాదం… బయటి శత్రువులు, లోపల శత్రువులు… ఈ పరిస్థితిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూనే… ఓ సుస్థిర ప్రభుత్వాన్ని నడిపించడం… ఇందిర, నెహ్రూ తరువాత మోడీయే… ప్రపంచ స్థాయి ఆదరణలో ఇప్పుడు మోడీ దరిదాపుల్లోకి వచ్చేవాళ్లు లేరు… ఇది రియాలిటీ…

దేశంకన్నా రాజకీయాలు, అధికారాలే ముఖ్యమనుకునే కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అవినీతి పార్టీల చిక్కుల్ని అధిగమిస్తూ… ఇక్కడి దాకా రావడం గ్రేటే… ఒకప్పుడు 2 సీట్లకు పరిమితమై, పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా ఉన్న బీజేపీని వరుసగా మూడుసార్లు అధికారంలోకి తీసుకురావడంలో వాజపేయి, అడ్వానీ పాత్ర ఎంత ఉందో, మోడీకి అంతకుమించి స్థానం ఉంది…

తనకంటూ ఈ దేశ చరిత్రలో ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు… ఏ అవినీతి మరక లేకుండా… ఏ వ్యక్తిగత ప్రలోభాలు అంటనీయకుండా..!! తనను నానారకాలుగా తిట్టి, తరువాత తన దగ్గర సాగిలబడి శరణు వేడిన చాలా కుక్కమూతిపిందెల సాక్షిగా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సినిమాల్లో జియో అంబానీకి అదృష్టలక్ష్మి..! జ్యోతి దేశ్‌పాండే…!
  • పెద్ది..! ఇది మరో కోణం… డిఫరెంట్ రివ్యూ… దారితప్పిన దర్శకుడిపై…
  • ఒకరకంగా నెహ్రూకన్నా మోడీయే డిస్టింక్షన్ పాస్… ఎందుకంటే..?
  • ఈ అమర గాయకుడు సుస్వర దర్శకుడు కూడా..! ప్రతి పాటా ముత్యమే..!
  • కార్తీకదీపం కథ మళ్లీ మొదటికి..! సీఎం జోసెఫ్ విజయ్‌కు తొలి పరీక్ష..!!
  • ఆ గోల్డ్ కంపెనీ కథేంటి..? KTR తో ఒప్పందమేంటి..? ఏం జరుగుతోంది..?
  • సూర్య కుమార్ ఔట్..! క్రికెట్ అన్ని పాఠాలూ నేర్పించే ఓ గురువు..!!
  • నీ కుంకుమ ఎప్పుడూ పొద్దు కుంకదమ్మా… కానీ చనిపోయేది గంగాధరం కదా..?”
  • శ్రీయుత గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి…
  • అసలు సమస్యలు వేరు… అవి వదిలేసి బీజేపీ హైకమాండ్ తంటాలు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions