Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

I Love Hyderabad … ఇది ప్రేమించదగిన నగరం కాబట్టి…

June 6, 2026 by M S R

.

Raghu Nadh Reddy ఫేస్‌బుక్‌ పోస్టు ఇది, చాలామంది ఇష్టపడ్డారు… అది యథాతథంగా…

‘‘రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణా అంటే కాస్త అయిష్టత ఉండేది కానీ…. తర్వాత బెంగుళూరు, చెన్నై లో ఉన్నప్పుడు…. హైదరాబాద్ మీద మనసు పీకేది.. అక్కడ ఉండలేక మళ్ళీ హైదరాబాద్ పీక్కొచ్చేశా 2 సంవత్సరాలలో..

Ads

ఆంధ్రాలో దిక్కుమాలిన రాజకీయాలు చూశాక…. ఛీ, ఇక్కడెందుకు ఉండాలి అనిపిస్తుంది…
ఒకప్పుడు Hyd నుండి వస్తున్నప్పుడు.. ఆంధ్రా బోర్డర్ లో అడుగుపెట్టగానే మన అనిపించేది…
ఇప్పుడు ఆంధ్రా బార్డర్ దాటి.. తెలంగాణలో అడుగుపెట్టగానే మన అనిపిస్తుంది…

ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకవైపు శతాబ్దాల చరిత్ర… మరొక వైపు మెట్రో లైఫ్ స్టైల్ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌….
వీకెండ్ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే కొండలు ఉన్నాయ్…
ప్రకృతిలో రిలాక్స్ అవ్వాలనుకుంటే సరస్సులు, అడవులు ఉన్నాయ్…
ఫ్యామిలీతో గడపాలనుకుంటే రిసార్టులు ఉన్నాయ్…
ఫోటోగ్రఫీ ఇష్టమైతే రాతి నిర్మాణాలు, లేక్స్, పక్షుల అభయారణ్యాలు ఉన్నాయ్…
చరిత్ర ఇష్టమైతే కోటలు, పురాతన కట్టడాలు ఉన్నాయ్…

కారు స్టీరింగ్ ఎటు తిప్పినా గంటలో కొత్త ప్రదేశానికి, ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్తాం…
అంతెందుకు… ఆంధ్రాలో ప్రభుత్వం మారింది… ఉద్దరించేస్తారు.. అని సొల్లు చెప్పే వారు కూడా హైదరాబాద్ వదిలి.. ఇక్కడికి రాలేరు..

తెలంగాణలో ఆవేశం ఉంటుంది… ప్రేమ ఉంటుంది…
తెలంగాణ నేల స్వభావమే అలాంటిది. ఇక్కడి మనుషులు తమ అభిప్రాయాన్ని బలంగా చెబుతారు, అన్యాయం అనిపిస్తే గట్టిగా నిలబడతారు. ఆ ఆవేశం కోపం కాదు — ఆత్మగౌరవం…

హైదరాబాద్‌ ప్రతిరోజూ వేల మందిని కొత్త జీవితాల కోసం ఆహ్వానిస్తుంది… కొందరు పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తారు. మరికొందరు చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు చేస్తారు….
కానీ నగరం వారిని జీతం ఆధారంగా కొలవదు. ఇక్కడ ₹10 వేల జీతం తీసుకునే వ్యక్తికీ తన కలలు కనే అవకాశం ఉంటుంది; ₹10 లక్షల జీతం తీసుకునే వ్యక్తికీ అదే నగరంలో స్థానం ఉంటుంది…

చరిత్రలో గర్వం, సంస్కృతిలో గొప్పదనం, మనుషుల్లో ప్రేమ, భవిష్యత్తులో అపారమైన అవకాశాలు కలిసిన నేల ఇది..
శాశ్వత హైదరాబాద్ వాసిగా ఉండటానికి ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను…
నా వరకు హైదరాబాద్‌లో నివసించలేదు… హైదరాబాద్‌ను అనుభవించాను….ఆస్వాదించాను..
Long Live… Forever Love Telangana…



ఇక్కడే జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర అభిప్రాయమూ ఈ రీల్‌లో చూడండి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • I Love Hyderabad … ఇది ప్రేమించదగిన నగరం కాబట్టి…
  • మా వాణిశ్రీని చంపేస్తాడా..? అందుకే ఈ దర్శకుడి మీద నాకెప్పుడూ కోపమే..!
  • డెస్టినీ..! ఆ ఒక్కడూ మిగిలిపోయాడు… ఐనవారందరూ ‘బుగ్గి’..!
  • రేవంత్ ససేమిరా..! చంద్రబాబు ‘రూట్’ మార్చాడు – ఇక మహానదిపై కన్ను..!!
  • ఆదానీ చెప్పిందే శాసనం..! లేదంటే ఈడీ దాడులేనా..? వేదాంతపైనా..?!
  • ఇంట్రస్టింగ్..! సుప్రీంకోర్టు తీరుపైనే ఓ హైకోర్టు తీవ్ర అసంతృప్తి..!!
  • ‘లిఫ్టులతో డబ్బు ఎత్తిపోసుకుని- ప్రాజెక్టును పఢావు పెట్టేశాడు కేసీయార్’
  • అబద్ధాలు, జనం కళ్లకు గంతలు… మరీ హరీష్ ఇలా మారిపోయాడేంటి..?
  • పేరు లేని ఊరు… నేనూ చూశాను, ‘పెద్ది’లా ఓ ఫైటూ చేశాను…
  • అన్నా మలై..! తన కొత్త పొలిటికల్ జర్నీలో రజినీకాంత్ కూడా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions