.
రేవంత్ రెడ్డి కేసీయార్ అవినీతి యవ్వారాలపై మరో కీలకమైన చిట్టా విప్పాడు… కాళేశ్వరం కథ తెలిసిందే కదా, ఇటు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కూడా వదిలిపెట్టలేదని వివరాలు ఏకరువు పెట్టాడు… బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టుపై పాదయాత్రలు, ఆందోళనలకు సిద్ధమవుతున్న వేళ రేవంత్ రెడ్డి బయటపెట్టిన బాగోతాలు బీఆర్ఎస్ ముఖ్యుల గొంతుల్లో పచ్చి వెలక్కాయలే…
కాళేశ్వరంపై కాన్సంట్రేట్ చేసి, సొంత ‘జ్ఞానంతో’ కేసీయార్ ఏదేదో చేసి మొత్తానికి లక్ష కోట్లను గోదాట్లో పోశాడు, ఇప్పుడా బరాజులు పనికిరాకుండా పోయియి… మరోవైపు పెండింగ్ కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేయక, మన వాటాలకు నష్టం కలిగించాడు… మనం క్లెయిమ్ చేసుకోలేని దురవస్థ… అత్యంత విలువైన పదేళ్లను కేసీయార్ వేస్ట్ చేశాడు ఈ కోణంలో…
Ads
అంతేకాదు, కాస్తో కూస్తో పట్టించుకున్నాడులే అనిపించిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో డబ్బులొచ్చే లిఫ్టులు, పంపులు హడావుడిగా చేసేసి, రేవంత్ భాషలో చెప్పాలంటే, దోపిడీ చేసి, కనకవర్షం కురిపించుకుని, మిగతా ప్రాజెక్టును ఇక గాలికి వదిలేశాడు… ఈ నిర్వాకానికి తగినట్టు దానిపైనే గాయిగత్తర చేయాలని ప్లాన్ చేస్తోంది… తట్ట మట్టి ఎత్తలేదు, భూసేకరణ చేయలేదు అని హరీష్ విమర్శలు…
నిజానికి భూసేకరణ చేయకుండా ప్రాజెక్టును దురవస్థలోకి నెట్టిందే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా..! మాట్లాడితే మేం 90 శాతం పని పూర్తి చేశామంటాడు… నిజానికి 50 శాతం కూడా కాలేదు… 55 వేల కోట్ల ప్రాజెక్టులో 26 వేల కోట్లు ఖర్చు పెడితే 90 శాతం ఎలా పూర్తయినట్టు అనేది రేవంత్ ప్రశ్న… అసలు కీలకమైందే భూసేకరణ, అదే పెండింగ్‌లో పడిపోయింది…
పాలమూరు దిశను, దశను మార్చింది కేసీయార్ అన్నాడు నిన్న హరీష్ రావు ఎక్కడో… ఆయన అంత ఉద్దరిస్తే మరి పాలమూరు లింక్డ్ ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడ ఎందుకు పఢావు పడినట్టు..? మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి మీద కోపంతో తొక్కిపెట్టారు… అంతేకాదు, ఎస్‌ఎల్‌బీసీ, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి… ఇలా ప్రతి కృష్ణా ప్రాజెక్టును పండబెట్టారు… అవన్నీ పూర్తయి ఉంటే ఏకంగా 26 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చి ఉండేది… వివరించలేనంత అన్యాయం చేసేశారు దక్షిణ తెలంగాణకు…
స్వయంగా రెండురోజులపాటు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు స్థితిగతులు చూసిన రేవంత్ రెడ్డికి మండుకొచ్చింది… అందుకే కేసీయార్ మీద తీవ్ర ఆరోపణలకుతోడు పరుష వ్యాఖ్యలకూ దిగాడు… ‘‘కేసీయార్ అంటే నీళ్లు కాదు… కేసీయార్ అంటే సోడా, సోడా అంటే కేసీయార్… కేసీయార్ అంటే సారా, సారా అంటే కేసీయార్… అసలు కేసీయార్ ఒక రద్దయిన 1000 రూపాయల నోటు …’’
https://www.facebook.com/reel/27220132117615894
అవునూ, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు అక్రమాలు, అవినీతిని కూడా సీబీఐకి అప్పగించే ఆలోచన ఏమైనా ఉందా పాలక నాయకా..? సీరియస్ అలిగేషన్లే కదా..!!
Share this Article