Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏ మొహమాటాల్లేవ్… కొత్త T20 జట్టు ఎంపికపై డిఫరెంట్ రివ్యూ…

June 6, 2026 by M S R

.

ముఖేష్ అంబానీ ఐపీఎల్ 2026 టీమ్… రోహిత్ శర్మ, సూర్యకుమార యాదవ్, హార్డిక్ పాండ్యా, జస్పీత్ బుమ్రా తదితర అతిరథ మహారథులు… కానీ పేలవమైన ఆటతీరు… పరువు పోగొట్టుకుంది అంబానీ ముంబై టీమ్… ఏ మొహమాటాలు లేకుండా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కొత్త టీ20 జట్టు (ఐర్లండ్, ఇంగ్లండ్‌లతో ఆడబోయేది) లోకి సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, హార్డిక్ పాండ్యాలను సెలక్ట్ చేయలేదు… మంచి నిర్ణయం…

వరల్డ్ కప్ గెలిపిస్తేనేం… 36 ఏళ్ల సూర్య కుమార్ యాదవ్ కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడు, సేమ్, హార్డిక్ పాండ్యా… చివరకు బుమ్రా కూడా ఇజ్జత్ పోగొట్టుకున్నాడు వికెట్లు తీయడంలో, పొదుపులో… తనను కూడా ఎంపిక చేయలేదు, కాకపోతే ఆసియా క్రీడలకు వోకే అన్నట్టున్నారు…

Ads

ఎటొచ్చీ, తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు ఇప్పుడు… గుడ్, తనలో ఆ టెంపర్‌మెంట్ ఉంది, ఆటతీరు నిలకడగా ఉంది… తెలుగువాళ్లకూ గర్వకారణం… తనే కాదు, సిరాజ్, నితిష్ కుమార్ రెడ్డి కూడా జట్టులో ఉండటం తెలుగు క్రికెటర్లకు శుభం…



ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, శివమ్ దూబె, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ


అనుకున్నట్టుగానే సర్పంచ్ సాబ్ అలియాస్ శ్రేయాస్ అయ్యర్ కొత్త కెప్టెన్ అయ్యాడు… తను ప్రాతినిధ్యం వహించే జట్లను ఫైనల్స్ దాకా చేర్చడం, వీలయితే ఛాంపియన్ చేయడం, కెప్టెన్సీలో నైపుణ్యంతో తనకు కెప్టెన్సీ దక్కేలా చేసింది… మంచి ఎంపికే…

మంచి ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్లు కమ్ బ్యాటర్లు ఇషాన్, సంజూ శాంసన్‌కు చోటు కూడా సరైన ఎంపికెే… ఎటొచ్చీ ఇటీవల పేలవమైన పర్‌ఫామెన్స్ చూపిస్తున్న వైడ్ బాల్ సింగ్ అలియాస్ అర్షదీప్ సింగ్ ఎంపిక ఆశ్చర్యం… వరుణ్ చక్రవర్తి కూడా కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడు…

చివరగా… 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి (మొన్నటి ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్, సిక్సర్ల వీరుడు) ఇండియా అధికారిక జట్టులో స్థానం దొరికింది… మంచి అచీవ్‌మెంట్, దేశం అంతా కోరుకుంది తనను ఎంపిక చేయాలని… ఇక ఎలా వినియోగించుకుంటాడు ఈ అవకాశాన్ని అనేది తను తేల్చుకోవాలి..!! ఆల్ ది బెస్ట్ బుడ్డోడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలు తప్పు జాన్వీదే..! ఇదే ధోరణి ఉంటే కెరీర్‌ ప్రశ్నార్థకమే..!!
  • ఏ మొహమాటాల్లేవ్… కొత్త T20 జట్టు ఎంపికపై డిఫరెంట్ రివ్యూ…
  • వాళ్లు బాల్యాన్ని అనుభవించనివ్వండర్రా… రొంపిలోకి అప్పుడే ఎందుకు..?!
  • ‘ పెద్ది సినిమా చూడకపోతే చంపుతా ఒక్కొక్కడినీ’… ఓ మానసిక వైకల్యం..!!
  • I Love Hyderabad … ఇది ప్రేమించదగిన నగరం కాబట్టి…
  • మా వాణిశ్రీని చంపేస్తాడా..? అందుకే ఈ దర్శకుడి మీద నాకెప్పుడూ కోపమే..!
  • డెస్టినీ..! ఆ ఒక్కడూ మిగిలిపోయాడు… ఐనవారందరూ ‘బుగ్గి’..!
  • రేవంత్ ససేమిరా..! చంద్రబాబు ‘రూట్’ మార్చాడు – ఇక మహానదిపై కన్ను..!!
  • ఆదానీ చెప్పిందే శాసనం..! లేదంటే ఈడీ దాడులేనా..? వేదాంతపైనా..?!
  • ఇంట్రస్టింగ్..! సుప్రీంకోర్టు తీరుపైనే ఓ హైకోర్టు తీవ్ర అసంతృప్తి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions