Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు తప్పు జాన్వీదే..! ఇదే ధోరణి ఉంటే కెరీర్‌ ప్రశ్నార్థకమే..!!

June 6, 2026 by M S R

.

అచ్చంగా జాన్వీ తప్పే… పెద్ది సినిమాతో పరువు పోగొట్టుకుంది… ఈ ధోరణి ఇలాగే కొనసాగితే చాన్నాళ్లు ఆమె కెరీర్ కొనసాగకపోవచ్చు కూడా..! వారసత్వం అనేది ప్రవేశానికి ఉపయోగపడుతుంది… కానీ పాత్రలు, కథలు, బ్యానర్ల ఎంపికలో స్వీయ విచక్షణ, జాగ్రత్త అవసరం… అవి లేకపోతే అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటే బోల్తా కొట్టడం ఖాయం,

సినిమా ఇండస్ట్రీ చాలా క్రూయల్… ఎవరినైనా తొక్కేసుకుంటూ వెళ్తుంది… నా తల్లి అతిలోకసుందరి, నా తండ్రి పేరున్న నిర్మాత, నాకూ అందముంది వంటి సమర్థనలు చెల్లవు, అవి కొన్నాళ్లే… ఇండస్ట్రీ పదే పదే మెహర్బానీతో అవకాశాలు ఇస్తూ పోదు… నిజానికి పెద్ది సినిమాలో పాత్రను ఆమె ఎందుకు ఎంచుకుంది..? అదే హాశ్చర్యం… అసలు బోనీకపూర్ ఎందుకు వోకే అన్నాడు..?

Ads

భారీ బడ్జెట్ అనేనా..? పాన్ ఇండియా మూవీ అనేనా..? రాంచరణ్ పక్కన హీరోయిన్ చాన్స్ అనేనా..? ఏమిటి ప్రాతిపదిక..? బుచ్చిబాబుకు అంత పెద్ద స్టార్ దర్శకుడనే పేరేమీ లేదు… పైగా కథలో ఆమె పాత్రకు అస్సలు ప్రాధాన్యం లేదు… అసలు అది ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు… రోత సీన్లకు, ఎక్స్‌పోజింగుకు వాడుకున్నారు ఆమెను…

చివరకు ఇప్పుడు ఏం జరిగింది..? ముద్దు సీన్ ప్లస్ మరో రెండుమూడు వెగటు సీన్లను కూడా సోషల్ మీడియా విమర్శలకు జడిసి, సినిమా నుంచి తీసేస్తున్నట్టు దర్శకుడు ప్రకటించాడు… తనకు ఆ సీన్లు తీస్తున్నప్పుడు తెలియదా, అవి బ్యాడ్ టేస్టుతో ఉన్నాయని..! జరగాల్సిన డ్యామేజ్ జరిగాక ఇప్పుడు ఏం తీసినా, ఏం పెట్టినా దండుగే…

మిక్స్‌డ్ టాక్ వచ్చేసింది… తమిళ- మలయాళ- హిందీ వసూళ్లపై ఇక ఆశల్లేవు… పెద్ద సినిమాలు మార్కెట్‌లో లేవు గనుక తెలుగులో నాలుగు రోజులు నడవచ్చు… కానీ వసూళ్లు ఎక్కడివరకు వచ్చి ఆగిపోతాయో చూడాలిక… హీరో చకచకా పలు స్పోర్ట్స్‌లోకి స్విచ్ ఓవర్ అవుతున్న తీరు, సూపర్ హీరోగా చెలరేగే తీరు, మరీ ఒంటికాలితో ఉసేన్ బోల్ట్‌లాగా పరుగు తీయడం ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ కాలేదు…

సో, జాన్వీ ఎంత రాజీపడి, ఈ సినిమాను ఒప్పుకుంటేనేం…? డబ్బులొచ్చి ఉండవచ్చుగాక, కానీ బదనాం అయిపోయింది, కనీసం సినిమా సూపర్ హిట్ పేరు తెచ్చుకుంటే దానికైనా సంతోషపడేదేమో… సో, రెంటికీ చెడ్డ రేవడి… ఆ అసంతృప్తి ఏదో మనసులో ఉన్నట్టుంది, అందుకే ఏదో నెగెటివ్ రివ్యూకు కూడా లైక్ కొట్టింది..!!

బుచ్చిబాబుతో తదుపరి సినిమా తీసే హీరోలు ఎవరో గానీ జాగ్రత్త… ఈసారి ఏం కోసేస్తాడో తెలియదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలు తప్పు జాన్వీదే..! ఇదే ధోరణి ఉంటే కెరీర్‌ ప్రశ్నార్థకమే..!!
  • ఏ మొహమాటాల్లేవ్… కొత్త 20 జట్టు ఎంపికపై డిఫరెంట్ రివ్యూ…
  • వాళ్లు బాల్యాన్ని అనుభవించనివ్వండర్రా… రొంపిలోకి అప్పుడే ఎందుకు..?!
  • ‘ పెద్ది సినిమా చూడకపోతే చంపుతా ఒక్కొక్కడినీ’… ఓ మానసిక వైకల్యం..!!
  • I Love Hyderabad … ఇది ప్రేమించదగిన నగరం కాబట్టి…
  • మా వాణిశ్రీని చంపేస్తాడా..? అందుకే ఈ దర్శకుడి మీద నాకెప్పుడూ కోపమే..!
  • డెస్టినీ..! ఆ ఒక్కడూ మిగిలిపోయాడు… ఐనవారందరూ ‘బుగ్గి’..!
  • రేవంత్ ససేమిరా..! చంద్రబాబు ‘రూట్’ మార్చాడు – ఇక మహానదిపై కన్ను..!!
  • ఆదానీ చెప్పిందే శాసనం..! లేదంటే ఈడీ దాడులేనా..? వేదాంతపైనా..?!
  • ఇంట్రస్టింగ్..! సుప్రీంకోర్టు తీరుపైనే ఓ హైకోర్టు తీవ్ర అసంతృప్తి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions