Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దివాళా అంచున దేశం… ఆ దిక్కుతోచని సర్కారు ఏం చేసింది…

June 15, 2026 by M S R

.

సినిమా అంటే పాటలు, ఫైట్లు, హీరోయిజం, పంచ్ డైలాగులు వంటి నానా కమర్షియల్ చెత్తా ఉండాల్సిందే అనుకునేవారికి ఈ “గవర్నర్” పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ చరిత్రలో జరిగిన ఒక కీలక ఘట్టాన్ని తెరపై నిజాయితీగా చూడాలనుకునే ప్రేక్షకులకు మాత్రం ఇది ఆసక్తికరమైన అనుభవం.

1991 ఆర్థిక సంక్షోభం గురించి చాలామంది విన్నా… ఆ సమయంలో దేశం ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉందో, విదేశీ మారక నిల్వలు దాదాపు ఖాళీ అయినప్పుడు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో ఈ సినిమా చూపించే ప్రయత్నం చేస్తుంది. కమర్షియల్ హంగులు జోడించి కథను అతిగా డ్రామాటిక్ చేయాలనే ప్రయత్నం దర్శకురాలు చేయలేదు. అదే ఈ సినిమాకు ప్రధాన బలం.

Ads

రామన్ పాత్రలో మనోజ్ బాజ్‌పేయ్ మరోసారి తన స్థాయి నటన చూపించారు. దేశం మొత్తం ఆర్థిక అనిశ్చితిలో కూరుకుపోయినా, తన ముఖంలో ఆందోళనను దాచుకుంటూ సమస్యలకు పరిష్కారం వెతికే అధికారి పాత్రను చాలా హుందాగా పోషించారు. ఆయన నటన వల్లే డాక్యుమెంటరీ తరహాలో సాగే కొన్ని సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా మారాయి.

సినిమా నెమ్మదిగా సాగుతుంది. ప్రేక్షకులను అలరించడానికి ప్రత్యేకంగా రాసిన కామెడీ ట్రాక్‌లు, బలవంతపు ప్రేమకథలు, మాస్ ఎలిమెంట్లు ఇందులో కనిపించవు. కథకు ఎంత అవసరమో అంత మాత్రమే చూపించారు. అందుకే ఇది అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు. కానీ సీరియస్ సినిమాలను ఆస్వాదించే వారికి మాత్రం మంచి అనుభూతి ఇస్తుంది.

దేశం బంగారు నిల్వలను విదేశీ బ్యాంకులకు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజకీయ అస్థిరత, విదేశీ రుణాల ఒత్తిడి, మీడియా విమర్శల మధ్య అధికారులు ఎలా పనిచేశారు? వంటి అంశాలను సినిమా సులభంగా అర్థమయ్యే రీతిలో చెబుతుంది. ముఖ్యంగా నేటి యువతకు 1991 ఆర్థిక సంస్కరణల వెనుక ఉన్న పరిస్థితులను పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది.

అయితే సినిమా పూర్తిగా తటస్థంగా ఉందా అంటే చెప్పడం కష్టం. కొన్ని చోట్ల ప్రస్తుత రాజకీయాల నీడ కనిపించినా, కథ ప్రధానంగా ఆర్థిక సంక్షోభం చుట్టూనే తిరుగుతుంది. అందువల్ల ఆ అంశం పెద్దగా ఇబ్బంది పెట్టదు.

మొత్తంగా చూస్తే “గవర్నర్” ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. ఇది ఒక రాజకీయ-ఆర్థిక నాటకం. దేశ చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలాన్ని తెరపై చూడాలనుకునే వారికి, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఎంపిక.

లీగల్ ఇబ్బందులు రాకుండా… ఆర్బీఐ పేరును రాష్ట్రీయ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనీ, ప్రధాని పేరు శేఖర్ అనీ (చంద్రశేఖర్), ఆర్బీఐ చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారిగా రామన్ అనీ (వెంకటరామన్) ప్రస్తావిస్తారు… ఒకరకంగా అప్పటి ఆర్బీఐ చైర్మన్ వెంకటరామనన్ అనధికార బయోపిక్‌గా ఈ సినిమా కనిపిస్తుంది…

అమెరికా, ఇరాక్ యుద్దం ప్రభావం భారత్‌పై దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) సంస్థ నుంచి 2 బిలియన్ డాలర్ల అప్పుకు ప్రయత్నిస్తారు. ఇతర దేశాల నుంచి రుణాల సేకరణకు ప్రయత్నిస్తాడు రామన్. చివరకు భారత్ వద్ద ఉన్న బంగారు నిల్వలను స్విస్ బ్యాంక్, లండన్ బ్యాంక్‌కు గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు పెడుతారు.

1990 సంవత్సరంలో దేశం పరిస్థితి ఎలా ఉండేది? ఎలాంటి పరిస్థితిలో రామన్‌ను ఆర్బీఐ చైర్మన్‌గా నియమించారు? రామన్‌కు ఆర్బీఐలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? రామన్‌పై పెరిగిన రాజకీయ ఒత్తిడి ఏ రేంజ్‌లో ఉండేది? రాజీవ్ గాంధీ హత్య సంఘటన దేశాన్ని ఎలా కుదిపేసింది? ప్రధాని శేఖర్ రాజీనామా తర్వాత రామన్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? విదేశీ రుణాన్ని సేకరించడానికి రామన్ చేసిన ప్రయత్నాలు ఏమిటి? బంగారు నిల్వలను సీక్రెట్‌గా తాకట్టు పెట్టడానికి కారణం ఏమిటి? దేశం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సమయంలో మీడియా పాత్ర ఏమిటి?… ఇదే కథ…

ఈతరం యువతకు ఇవన్నీ తెలియాలి… ఒక దేశ ఆర్థికవ్యవస్థ దేని మీద ఆధారపడుతుంది, విదేశీమారకద్రవ్యం, వాటి నిల్వల అవసరం, సుస్థిర ప్రభుత్వం ఎందుకు కావాలి, ఆర్బీఐ డ్యూటీ ఏమిటి వంటి అనేక వివరాలపై ఓ అవగాహన వస్తుంది ఇలాంటి సినిమాలు చూస్తే… ఈమధ్య మోడీ బంగారం, విదేశీ పర్యటనలు, నూనెల వాడకం వంటి విషయాలపై పొదుపు పిలుపు ఇచ్చాడు కదా, ఎందుకో కూడా ఇలాంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది…

ప్రొడక్షన్ వాల్యూస్ అంతంత మాత్రంగానే ఉన్నా, పాత్రల్లో ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అలాంటి పాత్రలకు ఊరు పేరు లేని నటులను ఎంపిక చేయడం ద్వారా ఆ క్యారెక్టర్లు తేలిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. చరిత్రను ఆధారంగా చేసుకొని వచ్చే పొలిటికల్, ఫైనాన్షియల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దివాళా అంచున దేశం… ఆ దిక్కుతోచని సర్కారు ఏం చేసింది…
  • మన పెట్రో బిల్లును ఎథనాల్ తగ్గించగలదా..? ఏమేం ప్రయోజనాలు..?!
  • రాజా రమేష్… సినిమా కథగా ఓ నిజ జీవిత థ్రిల్లర్… కానీ..?
  • పునర్జన్మ… మీరు నమ్మరా… పోనీ, ఈ రియల్ స్టోరీ ఓసారి చదవండి…
  • ఆకలి కడుపులకు అన్నపూర్ణ..! నచ్చిన రేవంత్ మరో పథకం..!!
  • CM Ramesh … అద్భుత వశీకరణ శక్తిమంతుడు… జై పాతాళ భైరవీ…
  • NCPI … త్రిపురలోని ఓ విఫల పార్టీ హఠాత్తుగా జాతీయ తెరపై… ‘షా’లిటిక్స్..!!
  • ఎవరి ఊహకూ అందలేదు ..! బెంగాల్ రాజకీయాల్లో ‘మోటా భాయ్’ మాస్టర్ స్ట్రోక్ ..!!
  • యుద్ధం ఒక డ్రామా… ఒక వ్యాపారం… అసలు చేదు నిజాలు ఇవీ…!
  • Peddi Anantha Sriram … రాతలే కాదు, కూతలూ అలాగే ఉన్నయ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions