Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్రికెట్‌లో ట్రిపుల్ ధమాకా… అన్నీ టెన్ థౌజండ్ వాలా పేలుళ్లు…

June 18, 2026 by M S R

.

అందరూ రాశారు, ఇండియా క్రికెట్ ప్రేమికులకు ట్రిపుల్ ధమాకా అని… ఎందుకయ్యా అంటే, నిన్న మూడు మ్యాచులు ఒకేరోజు… 1) ఇండియా ఏ వర్సెస్ అఫ్ఘనిస్తాన్ ఏ వన్డే 2) ఇండియా వర్సెస్ అఫ్ఘనిస్థాన్ వన్డే 3) టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్… మధ్యాహ్నం 1.30 నుంచి మొదలుపెడితే రాత్రి పొద్దుపోయేదాకా క్రికెట్ ప్రేమికులు మార్చి మార్చి చానెళ్లు చూశారు… ఎంజాయ్ చేశారు…

నిజానికి చాలామందిలో ఓ అపోహ… అఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ అంత పేరున్న జట్లు కావు కదా, ఇవీ గెలుపులేనా అని… కాదు, ఏ రేంజులో మనం గెలిచాం అనేదే ముఖ్యం… పైగా పొట్టి క్రికెట్‌లో ఏ జట్టునూ తీసిపారేయలేం… ఈ మూడు మ్యాచుల్లోనూ ఇండియా సంబురపడే రీతిలో, భారీ తేడాలతో గెలిచింది… అదీ అసలు ట్రిపుల్ ధమాకా… అన్నీ టెన్ థౌజండ్ వాలా పేలుళ్లు…

Ads

అబ్బే, పేరున్న జట్ల మీద గెలిస్తే ఆ మజాయే వేరు అంటారా..? నిజమే, కానీ ఒకేరోజు మూడు భారీ గెలుపులను కూడా తేలికగా తీసిపారేయలేం కదా…



ఇండియా ఏ జట్టు వర్సెస్ అఫ్ఘనిస్తాన్ ఎ జట్టు నడుమ పోటీ… వైభవ్ ఓవర్ రేటెడ్ సూర్యవంశీ ఫెయిలైనా సరే, ఇండియా ఏకంగా 319 రన్స్ దంచిపారేసింది… ఏ జట్టు రికార్డుల్లో ఇదీ ఒకటి… ఈ పోటీలో ఏకంగా వంద పరుగులు తేడాతో అఫ్ఘనిస్థాన్ ఏ జట్టు మీద గెలిచింది ఇండియా… సూపర్బ్ గెలుపు…

కెప్టెన్ తిలక్ వర్మ, ప్రియాంక్, కుశాగ్ర హాఫ్ సెంచరీలు ఇండియా భారీ స్కోరుకు కారణం… తరువాత నిశాంత్ సింధు ఏకంగా నాలుగు వికెట్లు అదీ తక్కువ ఎకానమీతో పడగొట్టడంతో ఇండియా రికార్డు గెలుపు సొంతమైంది…



ఇక ఇండియా, అఫ్ఘనిస్థాన్ వన్డేకు వద్దాం… మళ్లీ రోహిత్ ఫెయిలైనా… కెెప్టెన్ గిల్ 154, ఇషాన్ కిషన్ 125 దంచడంతో ఇండియా ఏకంగా 402 రన్స్ చేసింది… ఇండియా వన్డే భారీ స్కోర్లలో ఇదీ ఒకటి… 400 దాటిన ఇండియా స్కోర్లలో ఇది ఏడో అత్యధిక స్కోర్… టాప్ 418 పరుగులు వెస్టిండీస్ మీద… (వన్డేల్లో ఒక బ్యాటర్ వ్యక్తిగతంగా చేసిన అత్యధిక స్కోర్లలో ఈ గిల్ 154 రన్స్ కూడా ఒకటి)…

తరువాత బ్యాటింగుకు దిగిన అఫ్ఘనిస్థాన్ కేవలం 232 పరుగులు చేసి, ఏకంగా 170 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది… ఇండియా రికార్డు గెలుపుల్లో ఇదీ ఒకటి…



తరువాత టీ20 వుమెన్ వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ జట్టుతో మ్యాచ్… ఇండియా వుమెన్ క్రికెటర్లు ఏకంగా 209 పరుగులు చేసింది… ఇది టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా హయ్యెస్ట్ స్కోర్… (గతంలో న్యూజీలాండ్ మీద 194 చేసింది)… ఇండియా బ్యాటింగులో షెఫాలీ కొన్ని మెరుపులు మెరిపించినా స్మృతి మంధాన 74 పరుగులు చేసి, ఈ రికార్డుకు ప్రధాన కారకురాలు… (స్మృతిని భారతీయ క్రికెట్ అభిమానులందరూ ఎందుకు ప్రేమిస్తారో అర్థమైంది కదా)…

తరువాత బ్యాటింగుకు దిగిన నెదర్లాండ్స్ 114  పరుగులు చేసి, 95  పరుగుల తేడాతో ఓడిపోయింది… ఇండియాకు మరో భారీ విజయం… (వుమెన్ వరల్డ్ కప్‌లో ఇండియాకు రికార్డు గెలుపు)… తెలుగు శ్రీచరణి నాలుగు వికెట్లు తీసుకుని ప్రత్యర్థి జట్టు వెన్నువిరిచింది… (ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు) టపటపా రెగ్యులర్  ఇంటర్వెల్స్‌లో నెదర్లాండ్స్ వికెట్లు పడిపోయి, ఇండియా విజయకేతనం ఎగరేసింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • క్రికెట్‌లో ట్రిపుల్ ధమాకా… అన్నీ టెన్ థౌజండ్ వాలా పేలుళ్లు…
  • సూసైడ్ ఫ్రూటింగ్! నేరేడుపళ్లు విరగకాస్తే సీరియస్ ఎల్‌నినో‌ ఖాయం!?
  • I Stand with Srinidhi Viplava Sri … ఎందుకంటే..?
  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions