.
ధర్మస్థల గుడిపై కుట్రలో ప్రకాష్ రాజ్ పాత్రపై, ప్రమేయంపై రోజురోజుకూ సందేహాలు బలపడుతున్నాయి… తన ప్రెస్‌మీట్ ధోరణి, తన మాటలు అలాగే ఉన్నాయి… నేను చెప్పింది రాసుకోవాలి తప్ప, ఏమీ అడగొద్దు అనే అహం ప్రదర్శించబోయి భంగపడ్డాడు ప్రకాష్ రాజ్… కన్నడ మీడియా కబడ్డీ ఆడుకుంది తనతో…
ధర్మస్థల క్షేత్రం, ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడేపై జరిగిన కుట్ర తెలిసిందే కదా… తమిళనాడు, కేరళల నుంచి భారీగా నిధులు ప్రవహించాయి… ఈ కుట్రలో ప్రధాన పాత్రధారిగా పైకి కనిపిస్తున్నది చిన్నయ్య అనే కేరక్టర్… కానీ తన వెనుక ఓ బలమైన హిందూవ్యతిరేక ముఠా ఉంది…
Ads
ఆ ముఠా ఎలా పనిచేసిందో రకరకాల కథనాలు వచ్చాయి… ప్రభుత్వం విధి లేక ఓ సిట్ వేసింది… తరువాత విచారణ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయింది… పాత సీఎం సిద్ధరామయ్య గుణం తెలిసిందే కదా… ఐతే ఆ కుట్రదారులతో నటుడు ప్రకాష్ రాజ్ సంబంధాలు ఇప్పుడు చర్చనీయాంశం…
‘నేనే వచ్చి తరువాత కలుస్తాను’ అని ప్రకాష్ రాజ్ చిన్నయ్యతో అన్నాడు… పోలీసుల చార్జ్‌షీటులో కూడా ఇదే పేర్కొన్నట్టు వార్తలొచ్చాయి… కుట్రతో ఏ సంబంధమూ లేకపోతే, వాళ్లను కలవాలని ఎందుకు అనుకున్నాడు..? తన ప్రమేయం లేకపోతే ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు..? చివరకు ప్రెస్మీట్లో కూడా ఈ కుట్రదారులతో తాను మాట్లాడాను అని అంగీకరించాడు…
నిజానికి తను పక్కా హిందూ వ్యతిరేకి… తన మాటల ధోరణితో పదే పదే స్పష్టమయ్యేది అదే… తన పాత్రపై మీడియాలో వార్తలు వస్తుండేసరికి ‘‘నేను షూటింగ్ కోసం దూరంగా ఉన్నాను, వచ్చి మాట్లాడతాను, వివరణ ఇస్తాను’’ అన్నాడు… టైమ్ టేకింగ్ టాక్టిస్…
కానీ బొద్దింకల (సీజేపీ) మీటింగుకు మాత్రం ఆగమేఘాల మీద పరుగెత్తుకొచ్చాడు… అప్పుడు షూటింగ్, దూరం గుర్తుకురాలేదు… ప్రతి విషయానికీ ట్వీట్లు కొట్టే ప్రకాష్ రాజ్ ఈ కుట్ర కేసులో వివరణకు మాత్రం మీడియా మీట్ కావల్సి వచ్చింది… సరే, ఏం చెబుతాడో విందామని చాలామంది రిపోర్టర్లు బెంగుళూరు ప్రెస్‌క్లబ్‌లో ఆ మీట్‌కు హాజరయ్యారు…
సాధారణంగా రాజకీయ, సామాజిక అంశాలపై Just Asking అంటూ ట్వీట్లు కొట్టే ప్రకాష్ రాజ్, ఈ వివాదంలో తన పాత్ర గురించి మీడియా కూడా అదే ధోరణిలో Just Asking you అంటూ సంధించిన పలు నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో విఫలమయ్యాడు… ముఖ్యంగా, ‘మాస్క్ మ్యాన్’ చిన్నయ్యతో ఉన్న సంబంధాలు, గతంలో ఇతర నిందితులతో కలిసి పంచుకున్న వేదికల గురించి మీడియా ఆధారాలతో ప్రశ్నించినప్పుడు తను ఫుల్లు డిఫెన్సులో పడిపోయాడు…
విలేకరులు నిధుల మూలాలు, కుట్ర వెనుక ఉన్న వ్యక్తుల గురించి లోతుగా ప్రశ్నించినప్పుడు, తను అసహనంతో”నేను వివరణ ఇవ్వడానికి వచ్చాను, తప్ప మీడియా విచారణ ఎదుర్కోవడానికి రాలేదు” అంటూ రుసరుసలాడాడు… చివరకు కుట్రదారు చిన్నయ్య (మాస్క్ మ్యాన్) తనకు ఫోన్ చేసినట్టు, సిట్ అధికారి మంచోడు, వెళ్లి కలిసి, నిజాలు చెప్పు, ఏమీ కాదు అని తనతో చెప్పినట్టు ప్రకాష్ రాజ్ అంగీకరించాడు… అంతేకాదు, సిట్ అధికారి ప్రణబ్ మహంతితో తాను కూడా మాట్లాడినట్టు చెప్పాడు…
సిట్ వేయగానే కుట్రదారులు ప్రకాష్ రాజ్‌తోనే ఎందుకు మాట్లాడారు..? కేసులు నమోదయ్యాక ప్రకాష్ రాజ్‌తో పదే పదే ఎందుకు కంటాక్టులోకి వచ్చారు..? తనెందుకు సిట్ అధికారితో మాట్లాడినట్టు..? కుట్రదారులకు భరోసా ఎందుకు ఇచ్చినట్టు..? మరి ముందుగా ఈ కుట్రతో నాకేమీ సంబంధం లేదు అని ఎందుకు బొంకినట్టు..?
పదే పదే ‘నేను ప్రశ్నిస్తున్నాను’ అని ట్వీట్లు కొట్టే ఈ ప్రమేయుడు మీడియా ప్రశ్నలు అడిగితే మాత్రం ఉడికిపోయాడు… నేను మీ మీడియా విచారణకు రాలేదంటాడు… మరి ఆ వివరణ ఏదో ట్వీట్ కొట్టలేకపోయావా..? ఓ ప్రైవేటు వీడియో నీ సోషల్ మీడియాలోనే పోస్ట్ చేసుకోలేకపోయావా అని కన్నడ మీడియా ధుమధుమలాడుతోంది… నువ్వు చెప్పింది రాసుకోవడానికా మేం వచ్చింది అని నేరుగానే అడిగేశారు…
దాంతో అర్థంతరంగానే ప్రెస్ మీట్ ముగించేసి వెళ్లిపోయాడు… కుచ్ కాలా హై… ధర్మస్థల కుట్రలో ప్రకాష్ రాజ్ పాత్ర ఉంది, అది ఎంత లోతుగా ఉందనేది సిట్ తేల్చాలి… కానీ ఈ విచారణ నడుస్తున్న తీరును బట్టి ఈ కేసు తెమిలేలా లేదు, ఎవరికీ నమ్మకాలు కూడా లేవు… కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంటే కథ వేరేగా ఉండేది…
తన తల్లి అంత్యక్రియల్ని క్రిస్టియన్ మతపద్ధతుల్లో జరిపించడం మీద కూడా విమర్శలు వచ్చినప్పుడు ఇలాగే మీడియా మీద రుసరుసలాడాడు… ఈ విమర్శలను ఉద్దేశించి, “ద్వేషాన్ని రెచ్చగొట్టే రాక్షసులారా (hate-mongering monsters), ఇది మీకు అర్థమవుతుందా?” అంటూ సోషల్ మీడియా వేదికగా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేయడం గుర్తుంది కదా..!!
- సిద్ధరామయ్య సీఎంగా ఉన్నన్నిరోజులు ఈ గుడి కుట్ర కేసు ఎటూ తెమలదని అందరికీ తెలుసు, కానీ డీకే శివకుమార్ సీఎం అయ్యాడు, తను విశ్వాసి, ఆధ్యాత్మికవాది… ప్రకాష్ రాజ్ యవ్వారమేమిటో తేలుస్తాడా..?!
Share this Article