Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొత్త స్కూల్ కిట్..! యాభై ఏళ్ల క్రితం కథ… నేటికి నేరవేరిన ఓ కల..!

June 19, 2026 by M S R

.

ముందుగా ఓ కథ చెప్పుకుందాం… చివరలో ముగింపు ఏమిటో, అదెంత విలువైందో మీకే అర్థమవుతుంది… సరే, కథలోకి వెళ్దాం పదండి…

చాలా ఏళ్ల క్రితం… దాదాపు యాభై ఏళ్ల క్రితం… పాలమూరు జిల్లాలోని ఓ పల్లె… స్కూళ్లు తెరిచే రోజు… ఆ పిల్లాడు సంతోషంగా ఉన్నాడు… బడికెళ్లే హుషారులో ఇల్లంతా సందడిగా తిరుగుతున్నాడు… దగ్గరలోనే బడి, వెళ్లి, క్లాసులైపోగానే, దోస్తులతో ఆటలు… అందుకే ఆనందం…

Ads

అంతేకాదు, అన్నీ కొత్తవి వస్తాయి, కొత్త యూనిఫాం, కొత్త బ్యాగు, కొత్త పుస్తకాల సెట్, కొత్త కంపాస్ బాక్స్… కానీ నాన్న అన్నాడు… కొత్త పుస్తకాలు ఎందుకురా, అన్న చదiవుకున్న పాత పుస్తకాలున్నాయి కదా, వాటికే కొత్త అట్టలు వేసుకో…

వద్దు నాన్నా, నాకన్నీ కొత్తవే కావాలి… పిల్లాడి మారాం… సరేలే, సరేలేరా, కొనిస్తాను అన్నాడు నాన్న… వచ్చేశాయి, వాటితోపాటు కొత్త వాటర్ బాటిల్, కొత్త టిఫిన్ బాక్స్, కొత్త ఫుట్ బాల్ (అప్పటి నుంచే తనకు ఫుట్ బాల్ ఆటంటే ప్రేమ)… అన్నీ అపురూపంగా తడిమి చూసుకున్నాడు…

స్కూల్ రీఓపెనింగ్… దోస్తులతో ఫుట్ బాల్ ఆడేయాలి… అదీ ఆతృత, ఆనందం, హడావుడి… మనసు పరుగులు పెడుతోంది… తన బెస్ట్ ఫ్రెండ్ రాజు, దిగాలుగా కనిపించాడు… ఏమైందిరా, అలా ఉన్నావు… రాజు మొహంలో కళ లేదు… కారణం..?

రాజుకు సరైన బ్యాగ్ లేదు, బాక్స్ లేదు, ఎవరినో అడుక్కుని తెచ్చుకున్న పాతబడిన, అక్కడక్కడా చిరిగిపోయిన పుస్తకాలు… రాజు నాన్నను అడిగినా తను కొనివ్వలేదు, కొనివ్వలేడు, ఈ తరగతికి ఇక ఇంతే… ఆ పాత ఏడుపే…

ఈ పిల్లాడికీ బాధనిపించింది… ఇద్దరమూ ఒకే ఏజ్, ఒకే క్లాస్… నాకు కొత్తవి, వాడికి పాతవి… నో, నో… మా నాన్నను అడుగుతా… ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు నాన్నను అడిగాడు…

  • నాన్నా, నాకు ఏమేం కొనిచ్చావో, అన్నీ రాజుకు కొనివ్వు నాన్నా ప్లీజ్… వాడికీ కొత్త బట్టలు, కొత్త బ్యాగ్, కొత్త పుస్తకాలు…

ఎవరికో మనమెందుకు కొనివ్వాలిరా, ఎందరికి కొనిస్తాం, నీకేమైనా పిచ్చి పట్టిందా..? కుదరదు…

ప్లీజ్ నాన్నా, రాజుకు కూడా ఇవి కొనివ్వకపోతే నేను బడికే పోను… మళ్లీ అదే మంకు, అదే మారం…

తనకు తెలుసు, కొడుకు పంతం, వదలడు… సర్లేరా, రాజుకు కొనిస్తాలే అన్నాడు… ఈ కుర్రాడి కళ్లలో వెలుగు…

అనుకున్నట్టుగానే మూడు రోజుల్లో కొత్త సెట్, కొత్త  బట్టలు, కొత్త బ్యాగ్ అన్నీ వచ్చాయి… రాజును పిలిచి ఇచ్చాడు ఆ తండ్రి, బాగా చదువుకొండి అన్నాడు ఆశీర్వదిస్తూ… అలాగే కొడుకుతో ఓ మాటన్నాడు…

ఒరేయ్, నీ దోస్త్ రాజు ఒక్కడే కాదు, లక్షల మంది రాజులున్నారు తెలంగాణలో… అందరూ పేదలే, అందరికీ కొత్త బ్యాగులు కావాలి, స్కూల్ తెరిచేనాటికి కొత్త పుస్తకాల సెట్ కావాలి, కొత్త యూనిఫామ్ కావాలి, మరెవరు కొనివ్వాలిరా..? వాళ్లు ఉదయం, మధ్యాహ్నం ఏమీ తినకుండానే బడికి వచ్చిపోతున్నారు, వాళ్లకు టిఫిన్లు, భోజనం మాటేమిటిరా..?

ఆ పిల్లాడు అన్నాడు… ‘‘నాన్నా, ఇది యాదికి ఉంచుకుంటాను, ఏదో ఒకరోజు వస్తుంది… ఆరోజు బడి తెరిచే టైమ్‌కు… కొత్త బ్యాగులు, కొత్త యూనిఫారాలు, కొత్త బాక్సులు అన్నీ ఇస్తాను… అంతేకాదు, ఏ ఆట ఆడాలన్నా సరే, అన్నీ ఇస్తాను… పొద్దున టిఫిన్ పెడతాను, మధ్యాహ్నం భోజనం కూడా పెడతాను’’ మాటవరుసకు అనలేదు, అది మైండ్‌లో ఫిక్సయిపోయిన ఓ సంకల్పం…



యాభై ఏళ్ల తరువాత… తెలంగాణ పబ్లిక్ స్కూల్… పిల్లలందరిలోనూ ఆనందం… ఆ పిల్లాడు ఆరోజు అనుకున్నది చేసి చూపించాడు… స్కూల్ బస్సు, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నభోజనం, స్వాగత కిట్లు, పుస్తకాలు, యూనిఫారాలు, వాట్ నాట్..? అవును, అప్పుడెప్పుడో ఆ పిల్లాడి మైండ్‌లో ఫిక్సయిపోయిన ఓ ఆలోచన ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది నిజంగానే..! నిజంగానే..!!

ఆ పిల్లాడు ఎవరో అర్థమైంది కదా… 

.

.

హేట్సాఫ్ రేవంత్…!!

.

స్కూల్ బ్యాగ్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త స్కూల్ కిట్..! యాభై ఏళ్ల క్రితం కథ… నేటికి నేరవేరిన ఓ కల..!
  • Ban on Cough Syrup – డాక్టర్ చీటి రాసిస్తే ఆ విషం తాగొచ్చా..?!
  • ‘మా ఇంటి బంగారం – సమంతకన్నా మంజూష ఎక్కువ మెరిసింది
  • అప్పట్లో ‘స్వాతి’ – తరువాత ‘మా నాన్నకు పెళ్లి’ – ఇప్పుడు ‘వంద దేవుళ్లు’
  • Iran War – కాగితాలపైనే శాంతి ఒప్పందాలు – తొలగని యుద్ధ మేఘాలు
  • యూట్యూబ్ స్టార్ నాగదుర్గ- మూవీల్లో క్లిక్కయితే మరో సాయిపల్లవి…
  • Ira Aery… ఓ ఫిమేల్ వైభవ్ ..! హఠాత్తుగా క్రికెట్ క్రష్ అయిపోయింది..!!
  • సింగిల్ మాల్ట్ Vs బ్లెండెడ్… స్కాచ్ రకాలపై అపోహలు- నిజాలు
  • సాక్షాత్తూ ప్రభుత్వం పేరుతోనే — బరితెగించిన స్కామ్ యాడ్స్
  • పెద్ది… నిర్మాత చేతులు కాలాయా..? ఏది నిజం..? ఏది అబద్ధం..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions