.
డిస్‌క్లెయిమర్ :: చట్టరీత్యా, ఆ అమ్మాయి వయస్సు రీత్యా ఖచ్చితంగా బండి భగీరథ్ పోక్సో కేసు నిందితుడే. కానీ చట్టప్రకారం బెయిల్ కోరుకునే హక్కు తనకుంది. తను ఎప్పటికైనా బండి సంజయ్‌కు తలనొప్పే. ఓ మామూలు కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి దాకా తన ప్రస్థానానికి తన కొడుకే మరక. తన ప్రత్యర్థులకు ఓ అవకాశం.
ఇక విషయానికి వద్దాం… భగీరథ్‌కు బెయిల్ కోర్టు నిర్ణయం. తండ్రిగా సంజయ్ తప్పకుండా కొడుకు బెయిల్ కోసం ప్రయత్నిస్తాడు, సహజం, తప్పులేదు. మరి బెయిల్ రావడం కూడా రేవంత్ మెడలో వేయడం ఏమిటి..? రేవంత్ హస్తముందని ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణ కోర్టు తీర్పును తప్పుపట్టడం కాదా. నిజంగా సీఎంకు భగీరథ్‌ను కాపాడే ఉద్దేశమే ఉంటే అన్ని సెక్షన్లు ఎందుకు నమోదు చేస్తారు పోలీసులు?
Ads
నో, నో, జైలులోనే పరీక్ష రాయించొచ్చు కదా, భగీరథ్ నేరచరిత్రను పీపీ ఎందుకు కోర్టుకు చెప్పలేదు? పోక్సో నిందితుడికి సర్కారు సాగిల… ఇలా సాగింది తన విమర్శ. పీపీలు ఏం చెప్పాలో, ఏం వాదించాలో, కోర్టు ఏం తీర్పు చెప్పాలో కూడా బీఆర్ఎస్ పార్టీయే నిర్దేశిస్తే ఎలా..?

ప్రతిరోజూ భగీరథ్ ఇష్యూయే. ఇదే ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ సమస్య అయినట్టు..! సర్, సమాజంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. బీజేపీలోని సంజయ్ ప్రత్యర్థి వర్గానికి, బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉపయోగపడేలా ఇలా ఒక కేసునే వేటాడటంలో మర్మం ఏమిటి..? ఈ కేసు మొదటి నుంచీ ప్రవీణ్ ఈ అంశం మీద మాత్రమే మాట్లాడుతున్నాడు. అదీ ఆశ్చర్యం… (నిజంగా స్పందించాల్సిన కేసులు, ఇష్యూస్ ఎన్ని లేవు? ఉదాహరణకు ఖమ్మం ఓ పసిదానిపై పైశాచిక అఘాయిత్యం)…
ఇక్కడ అనుకోకుండానే ఓ పోలిక. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేరీతిలో ఉండాలని లేదు, ఒకే బాటలో నడవాలని ఏమీ లేదు… కానీ పోలిక అనివార్యంగా వస్తుంది… బీ-ఆర్ఎస్ ప్రవీణ్, తమిళనాడులో అన్నామలై ఇద్దరూ ఐపీఎస్ వదులుకున్నారు, ఇద్దరూ రాజకీయాల కోసమే. సరే, ఎవరి పంథా వాళ్లది.
- (వరంగల్‌లో ఓఎస్డీగా ఉన్నప్పుడు ఓసారి ఏపీఏయూ అల్యూమినిగా పరిచయం చేసుకున్నట్టు గుర్తు ఈనాడు స్టాఫ్ రిపోర్టర్‌గా… RSP వెటర్నరీ మాస్టర్స్…) తరువాత కరీంనగర్ ఎస్పీగా జనశక్తి లొంగుబాట్ల నుంచి గురుకుల కార్యదర్శిగా పనితీరు దాకా తన వర్కింగ్ స్టయిల్‌లో సొసైటీ పట్ల కన్సర్న్ కనిపించేది. నచ్చేది. (తన నాస్తికత్వాన్ని పిల్లల మీద రుద్దడం అనే విమర్శ వేరు. దాన్ని తన వ్యక్తిగత అంశంగానే ఉంచుకోవాల్సింది).
తరువాత బీఎస్పీలో చేరిక, అదీ సమర్థనీయమే, అక్కడే ఉండాల్సింది. కాదని దొర గడీలోకి, అంటే కేసీయార్ పార్టీలో చేరిపోయాడు. (BSP నుంచి B-RSP) తను బీఎస్పీలో చేరడం కూడా కేసీయార్ ఆలోచించిన ఓట్ల చీలిక కోసం అనే అభిప్రాయం కూడా ఉంది. ఇక బీఆర్ఎస్‌లోకి చేరాక పూర్తిగా దొరతనానికి ఇంత బలమైన మద్దతు ఇవ్వడం, ఒకే కేసులో ఒకే నేతను వేటాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. (కేసీయార్ వెంట నడిచి రాజకీయంగా సాధించింది కూడా ఏమీలేదు)…
ఒకవైపు దాసోజు శ్రావణ్ ప్రతి అంశం మీద, అంకెలతో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రెస్‌మీట్లు, ప్రెస్‌నోట్లతో కేటీయార్, హరీష్‌రావులను దాటిపోయాడు… కానీ ఆర్ఎస్ ప్రవీణ్ సామాజిక అంశాల మీద మంచి దృక్పథం, విశ్లేషణ, అవగాహన ఉండీ జస్ట్, ఒకే కేసు చట్రంలో బందీ అయిపోయాడు. కేవలం దొర నిర్దేశించిన ఎజెండాకు పరిమితమైపోయాడు.
మరోవైపు అన్నామలై… తను జనంలో ఉన్నాడు. బీజేపీ అంటేనే సహించని తమిళనాడులో దానికి పీపుల్ యాక్సెప్టెన్స్ తీసుకురావడానికి కష్టపడ్డాడు. కానీ ఓ చతుష్టయానికి తనంటే పడలేదు, బీజేపీ హైకమాండ్‌కు తమిళ రాజకీయాలు అర్థం కావు, సో, బయటపడ్డాడు, జనంలో తను ఆలోచించిన ఓ ఉద్యమాన్ని నిర్మించాలని నిశ్చయించుకుని, తను అక్కర్లేని పార్టీని పక్కకు తోసేసి, సొంతంగా జనం బాట పట్టాడు…
ఫలితం ఏమిటనేది కాలం చెబుతుంది, కానీ తన సంకల్పం జనం, తన దారి జనం, తన లక్ష్యం జనం. ఎవరో చెప్పినట్టు తను ఆడదలుచుకోలేదు. ఐపీఎస్ సర్వీస్ వదిలేసిన ఇద్దరు నాయకుల బాటలు పూర్తి కంట్రాస్టు. ఇంట్రస్టింగు..!! ( ఇక్కడ అన్నామలై తోపు, గ్రేట్ అని చెప్పడం లేదు, ఆర్ఎస్‌పీ తక్కువ కాదు,, కానీ బాటలు, ధోరణులు కంట్రాస్టు అని చెప్పుకోవడం)…
Share this Article