Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాయిబాబా గుడి సర్వమత వేదికా? చాదర్‌ఘాట్ కేసు ఏమంటోంది?

June 25, 2026 by M S R

.

Srini Journalist …. మతాతీత తత్వమా? మనీ గేమా?
1990 కోర్టు తీర్పు వెనుక అసలు నిజం!

AP Endowments మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యల వల్ల షిరిడీ సాయిబాబా హిందూ దేవుడా కాదా అనే చర్చ మరోసారి మొదలైంది.
అసలు దీని నేపథ్యం, ఈ మొత్తం వివాదం ఎక్కడి నుండి మొదలైందో చూడాలంటే ఒకసారి మనం 1990లో హైదరాబాద్ చాదర్‌ఘాట్ సాయిబాబా సంస్థానం విషయంలో జరిగిన ఒక చారిత్రాత్మక వివాదాన్ని నిశితంగా పరిశీలించాలి.

Ads

ఆధ్యాత్మికత అనేది ఒక వ్యాపారంగా మారినప్పుడు, దాన్ని కాపాడుకోవడానికి చట్టపరమైన లోపాలు ఎలా వాడుకున్నారో చెప్పడానికి ఆనాటి కోర్టు కేసే ఒక పక్కా ఉదాహరణ. సాయిబాబా హిందువా, ముస్లిమా, ఆయన దేవుడా, కాదా అనే చర్చలన్నీ కేవలం ప్రజల కళ్లకు కప్పే పొరలు మాత్రమే.
కోర్టు గడప తొక్కిన ఈ కేసు వెనుక ఉన్న ఏకైక పరమార్థం: కోట్లాది రూపాయల హుండీ ఆదాయం ఎవరి చేతుల్లో ఉండాలి?

1990లో దేవాదాయ శాఖ చాదర్‌ఘాట్ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. దానికి కారణం అక్కడ వస్తున్న భారీ ఆదాయం.
ఆ హుండీని ప్రభుత్వం లాక్కోకుండా కాపాడుకోవడానికి ట్రస్ట్ సభ్యులు కోర్టులో ఆడిన చదరంగంలో వాడిన అస్త్రమే: ఇది కేవలం హిందూ ఆలయం కాదు, సర్వమత సంస్థ.

క్రైస్తవ ముసుగు…: ఒక్క ఆధారమైనా ఉందా? ట్రస్ట్ సభ్యులు కోర్టులో తమది సర్వమత సంస్థ అని చెప్పుకోవడానికి క్రైస్తవ మతాన్ని కూడా వాడుకున్నారు. కానీ చాదర్‌ఘాట్ మందిరంలో కానీ, వేరే సాయిబాబా మందిరంలో కనీసం ఒక యేసు క్రీస్తు విగ్రహం గానీ, మేరీ మాత విగ్రహం గానీ ఎందుకు ప్రతిష్ఠించలేదు?

క్రైస్తవ మతానికి సంబంధించిన ఏ ఒక్క ప్రధాన ఆచారం అక్కడ జరగలేదు. కేవలం చట్టం నుండి తప్పించుకోవడానికి క్రైస్తవం అనే పదాన్ని ఒక రక్షణ కవచంగా వాడుకున్నారే తప్ప, అక్కడ ఆ మతానికి ఎటువంటి స్థానం లేదన్నదే పచ్చి నిజం.

ముస్లిం సంప్రదాయాల నాటకం…: సమాధి లేని చోట పూజలేంటి? సాయిబాబా ముస్లిం తత్వంతో బతికారు కాబట్టి ఇది ముస్లింలకు కూడా చెందుతుందని ట్రస్ట్ వాదించింది. ఇక్కడే అసలైన తార్కిక ఆచరణ తప్పింది. ఇస్లాం లేదా సూఫీ సంప్రదాయం ప్రకారం భక్తుల సమాధుల దర్గాల వద్ద ప్రార్థనలు చేస్తారు.

సాయిబాబా అసలైన సమాధి ఉన్నది కేవలం మహారాష్ట్రలోని షిరిడీలో మాత్రమే. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో ఉన్నది కేవలం మట్టి, రాతితో చేసిన ఒక విగ్రహం మాత్రమే.
ముస్లిం మతం విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరి సమాధి లేని చోట, కేవలం విగ్రహం పెట్టి, దానికి హిందూ పూజారులు హారతులు ఇస్తుంటే, దాన్ని ముస్లిం సంప్రదాయం అని ఎలా అంటారు?

రూపం హిందూ.. హుండీ దగ్గరకు వచ్చేసరికి సర్వమతం!… ఆలయ ప్రాంగణంలో వినాయకుడి విగ్రహం ఉంటుంది, దత్తాత్రేయుడి విగ్రహం ఉంటుంది. పూజలు చేసేది హిందూ బ్రాహ్మణులు. చదివేది హిందూ మంత్రాలు, ఇచ్చేది కాకడ హారతులు, కొట్టేది కొబ్బరికాయలు. నిర్మాణం, ఆచారం, విగ్రహాలు అన్నీ నూటికి నూరు శాతం హిందూ సంప్రదాయంలోనే ఉంటాయి.

కానీ, ఎప్పుడైతే ఆ గుడికి వచ్చే కోట్లాది రూపాయల హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అడిగిందో, అప్పుడు మాత్రం ట్రస్టీలకు సడన్‌గా మత సామరస్యం, సర్వమత సమభావన గుర్తుకొచ్చాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం పందొమ్మిది వందల ఎనభై ఏడు ప్రకారం ప్రభుత్వం కేవలం హిందూ ఆలయాల హుండీలను మాత్రమే నియంత్రించగలదు. తమది హిందూ ఆలయం కాదని బోర్డు తిప్పేస్తే, ప్రభుత్వం ఆ హుండీ డబ్బు ముట్టుకోలేదు. ఈ ఒక్క లోపాన్ని వాడుకుని తమ నిధులపై పూర్తి ఆధిపత్యాన్ని నిలుపుకోవడమే ట్రస్ట్ చేసిన పని.

తీర్పులోని తిరకాసు…: గాయత్రీ దేవి ఆలయం సంగతేంటి? ఈ కేసులో మరో ఆసక్తికరమైన నిజం ఉంది. హైకోర్టు రికార్డులను పరిశీలిస్తే.. చాదర్‌ఘాట్ సాయిబాబా సంస్థాన్ కాంప్లెక్స్‌లోని శ్రీ గాయత్రీ దేవి ఆలయంలో వేద పద్ధతుల ప్రకారం బ్రాహ్మణ పూజారులు పూజలు నిర్వహిస్తారని దేవాదాయ శాఖ నిరూపించింది.

కోర్టు కూడా సాయిబాబా మందిరానికి దేవాదాయ చట్టం వర్తించదని పేర్కొంటూనే, గాయత్రీ దేవి ఆలయంపై మాత్రం ప్రభుత్వ దేవాదాయ శాఖకు నియంత్రణ అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఒకే కాంప్లెక్స్ లో ఉన్న ఒక గుడి సర్వమతం, పక్కనే ఉన్న మరో గుడి హిందూ మతం అని వాదించడం వెనుక ఉన్నది కేవలం హుండీ సంరక్షణ వ్యూహమే అని ఈ సాంకేతిక అంశాలు నిరూపించాయి.

నిజాయితీగా మాట్లాడితే, పందొమ్మిది వందల తొంభై కోర్టు కేసు అనేది ఒక మతపరమైన సిద్ధాంతాల పోరాటం కాదు. అది కేవలం ప్రభుత్వ అధికార వర్గానికి, ప్రైవేట్ ట్రస్ట్ బోర్డుకు మధ్య జరిగిన పక్కా పవర్ అండ్ మనీ గేమ్. షిరిడీ ఒక విభిన్నమైన చారిత్రాత్మక క్షేత్రం, బాబా అక్కడ భౌతికంగా జీవించారు కాబట్టి ముస్లింలు, ముస్లిమేతరులు కూడా దాన్ని దర్శిస్తారు.

కానీ దేశవ్యాప్తంగా వెలిసిన చాదర్‌ఘాట్ వంటి వందలాది ప్రైవేట్ మందిరాలు కేవలం షిరిడీ బ్రాండ్ నేమ్, బాబా విగ్రహాన్ని వాడుకుంటూ, పూర్తి హిందూ పూజా విధానాలతో నడుస్తూ, ఆర్థికంగా మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. భక్తుల అమాయకత్వాన్ని, నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి వచ్చే ఆదాయాన్ని కాపాడుకోవడానికి, చట్టపరమైన చిక్కుల నుండి తప్పించుకోవడానికి సర్వమత ముసుగును చాలా తెలివిగా వాడుకున్నారు. భక్తి వెనుక ఉన్న ఈ నగ్న సత్యాన్ని గుర్తించినప్పుడే, మతం పేరిట జరిగే ఆర్థిక వ్యూహాలు సామాన్యుడికి అర్థమవుతాయి.

చివరిగా ఒక కీలకమైన అంశం…: బాబా ఆలయాలకి ముస్లింలు, క్రైస్తవులు వంటి ఇతర మతాల భక్తులు కూడా వస్తారు కాబట్టి దీన్ని కేవలం హిందూ మతానికే పరిమితం చేయలేమనే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. కానీ, ఇదే తార్కిక కోణాన్ని మిగిలిన పవిత్ర స్థలాలకు వర్తింపజేస్తే అసలు గందరగోళం బయటపడుతుంది.

తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ముస్లింలు, క్రైస్తవులు, వివిధ మతాల వారు ఎంతో భక్తితో వస్తుంటారు. మరి ఆ కారణంగా తిరుపతిని హిందూ సంప్రదాయానికి సంబంధం లేనిది అని ప్రకటిస్తామా?
అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ ముస్లిం దర్గాలు ఉన్నాయి, వాటికి వేలాది మంది హిందువులు వెళ్తుంటారు. ఆ మాత్రం చేత అవి ముస్లిం మతానికి సంబంధించినవి కావని చెప్తామా?

ఏ మత కేంద్రానికైనా ఇతర మతాల వారు రావడం అనేది భక్తుల వ్యక్తిగత విశ్వాసం, కానీ ఆలయ పూజా పద్ధతులు, విగ్రహాల ఏర్పాటు మాత్రం పూర్తిగా హిందూ ఆచారాల ప్రకారమే జరుగుతున్నప్పుడు దాన్ని సర్వమత ముసుగుతో కప్పి ఉంచడం కేవలం హుండీ ఆదాయాన్ని రక్షించుకోవడానికి ఆడిన నాటకమే అని స్పష్టమవుతోంది….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాయిబాబా శివస్వరూపుడా? ఇది సనాతన సమర్థనీయమేనా?
  • సాయిబాబాకు ఆనం పొర్లుదండాలు దేనికి? వణికిపోవడం దేనికి?
  • సాయిబాబా గుడి సర్వమత వేదికా? చాదర్‌ఘాట్ కేసు ఏమంటోంది?
  • అక్కడ నేను ఇంకా బతికే ఉంటాను – మనిషిగా కాదు, ఒక విత్తనంగా!
  • Emoji Mathematics – చాటుమాటు చాట్ మూటల మాటలు
  • సాహసి CM విజయ్! బెరుకు లేదు- పెరియార్ భావజాలానికి తిరస్కృతి
  • తుంగభద్రపై ముగ్గురు ముఖ్యమంత్రులతో కేంద్రం కీలక భేటీ
  • బహుళ ప్రశంసల బడ్డీ మదర్ ! – ఎవరు ఈ IAS లక్ష్మీ ప్రియ?
  • పాలకుడు చుక్కలు చూపిస్తే… SBI ఐతేనేం? ఎందుకు దిగిరాదు?
  • ఇళయరాజాతో ఏదో తేడా కొట్టింది! వంశీ హార్మోనియం అందుకున్నాడు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions