Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Faima register marriage – ఆ పటాస్ ప్రవీణ్, ఈ ప్రేమ ప్రవీణ్ వేర్వేరుట!

June 25, 2026 by M S R

.

ఒక వార్త… ‘జబర్దస్త్’ నటి ఫైమా (Faima) వివాహం, జబర్దస్త్ – బిగ్ బాస్ ఫేమ్ ఫైమా ప్రేమ వివాహం. ఫైమా గత కొంతకాలంగా ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ సుదీర్ఘకాలం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

రిజిస్టర్ మ్యారేజ్… కుటుంబ సభ్యులు, పెద్దల నుండి కొన్ని నాటకీయ పరిణామాలు, వ్యతిరేకత ఎదురవడంతో, వీరిద్దరూ హైదరాబాద్‌లోని రిజిస్టార్ ఆఫీస్‌లో సింపుల్‌గా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.

Ads

సోషల్ మీడియాలో పోస్ట్… తమ పెళ్లికి సంబంధించిన వీడియోను ఫైమా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కొందరు తమను విడగొట్టడానికి ప్రయత్నించారని, కానీ తాము అనుకున్నట్లే ఒకటయ్యామని ఆ వీడియోలో ఎమోషనల్ అయ్యారు. ఈ కొత్త జంటకు పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు, జబర్దస్త్ నటులు , అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

…….. ఇదీ ఆ వాార్త. ఎవరో ఫైమా, ఎందుకీ వార్త అంటారా? కాదు, మంచి ఈజ్, ఎనర్జీ ఉన్న ఆర్టిస్టు ఆమె. చాన్నాళ్లుగా ప్రవీణ్ అనే మరో కమెడియన్‌తో ప్రేమ వ్యవహారం మీడియా చర్చల్లో ఉంది… తరువాత ఆ ప్రవీణ్ తనతో ఫైమా బ్రేకప్ చేసుకుందని ఏడ్చాడు, మొత్తుకున్నాడు.

తీరా కట్ చేస్తే… ప్రవీణ్‌తోనే పెళ్లి… అసలు ఆ కమెడియన్ ప్రవీణ్, ఇతనూ ఒకడేనా అని ఎఐ ని అడిగితే, నో, భగ్నహృదయుడు ప్రవీణ్ వేరు, తనను పటాస్ ప్రవీణ్ అంటారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న ప్రవీణ్ నాయక్ వేరు, ఇతనితో ఫైమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే 9 ఏళ్లుగా పరిచయం అట.

అసలు ట్విస్ట్ ఏంటంటే…: గతంలో ఫైమా లవ్‌లో ఉందని వార్తలు వచ్చినప్పుడు, మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ అందరూ ఆమె సహనటుడైన ‘పటాస్ ప్రవీణ్’తోనే ప్రేమలో ఉందంటూ తప్పుగా అర్థం చేసుకుని వార్తలు రాశారుట. ఫైమా కూడా తన పర్సనల్ లైఫ్‌ను సీక్రెట్‌గా ఉంచడం వల్ల ఆ రూమర్స్ అలాగే కొనసాగాయిట.

ఫైమా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ, చాలా ఎమోషనల్ నోట్‌ను రాసుకొచ్చింది. ఆమె పెట్టిన పోస్ట్‌లో ప్రధానంగా ఈ విషయాలను పంచుకుంది:

ఫైమా

వదిలేయడానికి వేల కారణాలున్నా…: “మా ప్రయాణంలో మమ్మల్ని ఎంతోమంది అనుమానించారు, ఎన్నో నిందలు వేశారు, మమ్మల్ని విడదీయడానికి కూడా ప్రయత్నించారు. మా మధ్య చాలా పోరాటాలు జరిగాయి. ఒకరినొకరు వదిలేసుకోవడానికి మాకు వేల కారణాలు కనిపించాయి…”

కానీ ఒకరికోసం ఒకరం నిలబడ్డాం… వాటన్నింటినీ దాటుకుని కలిసి బతకడానికి కేవలం ‘ఒక్క కారణం’ (ప్రేమ) కోసం మేమిద్దరం ఒకరినొకరం ఎంచుకున్నాం” అని పేర్కొంది.

ఎట్టకేలకు ఒక్కటయ్యాం…: “9 ఏళ్ల నిరీక్షణ తర్వాత.. ఎట్టకేలకు ఈరోజు మేము భార్యాభర్తలం అయ్యాం” అంటూ ప్రవీణ్ నాయక్‌తో దిగిన రిజిస్టర్ మ్యారేజ్ ఫొటోలను, పెళ్లి సర్టిఫికెట్‌ను చూపిస్తున్న ఫొటోలను షేర్ చేసింది.

ఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఇద్దరూ చాలా సాదాసీదాగా మెడలో పూలదండలతో కనిపించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, బుల్లితెర సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శుభం… సదరు పటాస్ ప్రవీణ్ శుభకాంక్షలు చెప్పాడా..? తెలియదు..!!

https://www.facebook.com/share/r/1HSTYQp6H4/

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేలంగి వారి ఓ సోషల్ ఫాంటసీ – ఓ పక్కా టైంపాస్ పల్లీబఠానీ!
  • నిజమే – పాస్‌పోర్టు మాత్రమే పౌరసత్వం కాదు – ఇవీ అసలు నిజాలు
  • Faima register marriage – ఆ పటాస్ ప్రవీణ్, ఈ ప్రేమ ప్రవీణ్ వేర్వేరుట!
  • అంతరిక్ష శోధనల్లో కొత్త చరిత్ర – ‘ఒక కాంతి రోజు’ ప్రయాణం
  • తెలంగాణ ప్రయోజనాల్ని ‘తుంగ’లో తొక్కిందెవరు హరీష్ సాబ్..?!
  • ఆ శవం చివరి కోరిక గెలిచింది – ఎట్టకేలకు మార్చురీని వీడింది
  • నిజంగానే NDA నుంచి CBN మళ్లీ బయటికి రావాలనుకున్నాడా?
  • అక్కడ వేటూరి రాసింది తప్పే! అన్వయం కుదరని ఓ శబ్దగారడీ!
  • సాయిబాబా శివస్వరూపుడా? ఇది సనాతన సమర్థనీయమేనా?
  • సాయిబాబాకు ఆనం పొర్లుదండాలు దేనికి? వణికిపోవడం దేనికి?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions