Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హేమిటో మరి… ఆ కురురాజ్య చక్రవర్తికీ ఇన్ని నగలు తొడగలేదేమో…

July 4, 2026 by M S R

.

నిన్న సంపూర్ణ నటుడు ఎస్వీ రంగారావు జయంతి కదా… చాలామంది చాలా కథనాలు రాశారు… నివాళ్లు అర్పించారు… తన నటన ప్రతిభ, తన కోపం, తన వ్యసనాలు గట్రా… అవన్నీ చదువుతుంటే ఓ పాత పోస్టు యాదికొచ్చింది… అఫ్‌కోర్స్ అది ఎస్వీ రంగారావు వేసిన ఓ పాత్ర గురించి… తన వ్యక్తిగతం కాదు…

మాయాబజార్… ఆ సినిమాది ఓ చరిత్ర… అనేక కోణాల్లో… అన్ని పాత్రల్లోకెల్లా జనాన్ని రంజింపచేసింది మాత్రం ఎస్వీరంగారావు పోషించిన ఘటోత్కచుడు పాత్ర… ఘటోత్కచుడిదే ప్రధాన పాత్ర అందులో… తన వాచికం, తన నటన, తన టైమింగు అపూర్వం… సూపర్, తిరుగు లేదు…

Ads

తనకు ఏ పాత్ర ఇచ్చినా దూరిపోతాడు అందులో… పౌరాణికాలు అయితే చెప్పక్కర్లేదు… తన వల్లే మాయాబజార్‌కు మరింత వన్నె… అయితే సదరు కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో గానీ… మహానుభావుడు… మళ్లీ ఆ ఫోటోలు చూస్తుంటే కాస్త నవ్వొచ్చింది… ఎందుకంటే? తను తీసుకున్న క్రియేటివ్ ఫ్రీడమ్ గురించి, ఘటోత్కచుడికి వేసిన వేషం, ఆహార్యం గురించి…

సరదాగా చెప్పుకుందాం ఓసారి… ఘటోత్కచుడు ఎవరు..? భీముడిని మోహించి పెళ్లాడిన ఓ రాక్షస వనిత కొడుకు… దట్టమైన అడవుల్లో ఓ అసుర ప్రాంతానికి ఆమె రాణి… తన కొడుకు భావి రాజు… మరి ఆ బంగారు కిరీటం ఏమిటి..? దానిపై నాగుల బొమ్మలేమిటి..? ఒంటి నిండా ఆ నగలేమిటి..? చెవులకు ఆ భారీ దుద్దులేమిటి..? నెక్‌లెసులు, దండకడియాలు, బ్రేస్‌లెట్లు ఏమిటి..? అంతటి భారీ బరువైన వడ్డాణం ఏమిటి..? అప్పట్లో హస్తినాపుర చక్రవర్తికి కూడా బహుశా ఈ రేంజ్ జువెలరీ మోత ఉండి ఉండదు… గద వరకూ వోకే, అది తన ఆయుధం…

పైగా తనకు జంధ్యం ఏమిటి..? వోకే, హిడింబి తన కొడుకుది క్షత్రియ రక్తమే కాబట్టి జంధ్యాన్ని ధరించమని చెప్పిందనుకుందాం… నెత్తిన ఈకలు మాత్రం ఆప్ట్… మామూలుగా మన సినిమాల్లో రాక్షస జాతి అనగానే ఎంత వీలయితే అంత వికారంగా వేషాలు వేయిస్తారు, కోరలు, జడలు కట్టిన జుట్టు, దేహంపై ఏవేవో ముద్రలు, జంతుకళేబరాల దుస్తులు… కానీ ఇక్కడ ఘటోత్కచుడిని నాగరిక కౌరవ ఆహార్యంలో తీర్చిదిద్దారు…

svr

హేమిటో, ఈ కాస్ట్యూమ్ డిజైనర్ వంశీకులే ఆదిపురుష్ క్రియేటివ్ టీం అనుకుంటా… ఏమో, దర్శకుడు కూడా… అన్నట్టు మరిచిపోయాను… ఈ వేషం జనాదరణ పొందింది కదా, ఇక ఎస్వీ కృష్ణారెడ్డికీ ఇదే ఫిక్స్ కాక తప్పలేదు… తను ఘటోత్కచుడినే హీరోగా చేసి ఓ సోషల్ ఫిక్షన్ సినిమా తీశాడు… అందులో సత్యనారాయణ ఘటోత్కచుడు…

మాయాబజార్‌లో ఎస్వీరంగారావు ఆహార్యాన్నే ఇక్కడ సత్యానారాయణకూ తప్పలేదు… కాకపోతే ఇంకొన్ని నగలు అదనం… యమధర్మరాజు లుక్ మిక్స్ చేశారు… క్రియేటివిటీ మరి..!!  (సరదాగా రాసిందే, ఎవరూ చొక్కాలు, మనోభావాలు చించుకోవాల్సిన పనిలేదని మనవి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హేమిటో మరి… ఆ కురురాజ్య చక్రవర్తికీ ఇన్ని నగలు తొడగలేదేమో…
  • ఆదానీ పరుగుకు కేరళ కొత్త సీఎం బ్రేకులు! కాంగ్రెస్ మార్క్ ‘అడ్డు పుల్లలు’!
  • మీ ఇంట్లో ఓవెన్ ఉందా… అనడిగింది ఆమె ఆ బ్యాంకు మేనేజర్‌ను!
  • ‘పతివ్రత’ ఓ రేంజులో అదరగొట్టింది- అకస్మాత్తుగా మాయమైంది
  • పోడు వేధింపులకు తెర! ఆదివాసీల మెప్పు పొందిన రేవంత్!
  • రావు బహదూర్‌పై కంప్లీట్ డిఫరెంట్ రివ్యూ! 3.5 గంటల Psychological Trauma…!
  • ALPHA – ఆ పాత్రకు ఆలియా అస్సలు నప్పలేదు – అదే మేజర్ మైనస్!!
  • ఒక చిరంజీవి – ఒక ప్రభాస్ – ఒక పవన్ కల్యాణ్ … ఒక మాధవీలత!!
  • ‘‘తింటే తిన్నారు – ఏ గుడిలో దొంగలు లేరు – ఇవన్నీ దొంగ ఏడుపులు సర్’’
  • ఈ సినిమా అర్థం కావాలంటే… మినిమం పీహెచ్‌డీ చేసి ఉండాలి!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions