.
నభా నటేష్: ప్రతిభకు అదృష్టం తోడవ్వకపోతే.. తెరపై మెరిసిన తారకు తప్పని పరీక్ష! సినిమా పరిశ్రమ ఒక మాయా ప్రపంచం. ఇక్కడ ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఎంతటి అందం, అద్భుతమైన నటన, బలమైన నేపథ్యం ఉన్నా.. కనీసం ఒక్క ‘అదృష్టపు పిసరు’ తోడు లేకపోతే, అగ్రస్థానానికి చేరడం ఎంత కష్టమో చెప్పడానికి నభా నటేష్ కెరీరే ఒక గొప్ప ఉదాహరణ.
ఒక్క ‘ఇస్మార్ట్’ మలుపు… ‘నన్ను దోచుకుందువటే’తో తెలుగు తెరకు పరిచయమైన నభా, తనదైన శైలిలో నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా పెంచింది. ఆ సినిమాలో ఆమె ఎనర్జీ, గ్లామర్ యువతను పిచ్చెక్కించాయి. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లడానికి ఆమెకు కావాల్సిన ‘భారీ హిట్’ అప్పుడే దక్కింది. అవకాశాలు క్యూ కడుతున్నాయి, స్టార్‌డమ్ తలుపు తడుతోంది అనుకుంటున్న తరుణంలో.. విధి ఆడిన నాటకం ఆమెను దెబ్బతీసింది.
Ads
అదృష్టాన్ని దూరం చేసిన ప్రమాదం… కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా జరిగిన ఆ రోడ్డు ప్రమాదం నభా జీవితాన్ని, వృత్తిని పూర్తిగా తిప్పింది. శారీరక గాయాల కంటే, కెరీర్ పరంగా ఆమె కోల్పోయిన ఆ రెండేళ్లు చాలా పెద్దవి. ఒక నటిగా ఫామ్‌లో ఉండాల్సిన సమయంలో మంచానికి పరిమితం కావడం అనేది ఒక ఉత్సాహవంతురాలైన నటికి ఎంతటి వేదన కలిగిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ, గ్లామర్ ప్రపంచంలో ‘రెండేళ్ల విరామం’ అంటే ఒక యుగంతో, విషాదయోగంతో సమానం.
తిరుగు ప్రయాణం.. మళ్లీ మొదలైన పోరాటం… కోలుకున్నాక మళ్లీ కెరీర్‌ను పట్టాలెక్కించడం నభాకు ఒక సవాల్‌గా మారింది. కష్టపడి తిరిగి వచ్చినప్పటికీ, పాత వేగాన్ని అందుకోవడం సులభం కాలేదు. ‘డార్లింగ్’ వంటి సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు ‘నాగబంధం’, ‘స్వయంభు’ వంటి ప్రాజెక్టులతో ఆమె మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ప్రతిభ vs అదృష్టం… నభా నటేష్ విషయంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిభకు కొదవలేదు… గ్లామర్ పాత్రలైనా, నటనకు అవకాశం ఉన్న పాత్రలైనా నభా తన వంతు న్యాయం చేస్తోంది. పరిశ్రమలో స్థిరపడాలంటే కేవలం టాలెంట్ మాత్రమే సరిపోదు, సరైన సమయంలో సరైన హిట్ పడాలి. నభా విషయంలో ఆ గ్యాప్‌లో ఒక ప్రమాదం రావడం ఆమె అదృష్టాన్ని పక్కకు నెట్టింది.
సినిమా రంగం ఎప్పుడూ నిలకడగా ఉండదు. ఇక్కడ ఎదిగే ప్రతి మెట్టు వెనుక ప్రతిభ ఎంత ఉందో, అదృష్టం కూడా అంతే ఉండాలి. నభా నటేష్ వంటి నటీమణులు తమ కష్టంతో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నించడం అభినందనీయం. అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. తన ప్రతిభతో నభా మళ్లీ ఆ ‘స్టార్ హీరోయిన్’ హోదాను చేరుకోవాలని ఆశిద్దాం. ఎందుకంటే, ఓటమిని అంగీకరించకుండా తిరిగి పోరాడే వారికే చివరికి విజయం దక్కుతుంది. దక్కాలి, అది న్యాయం!!
Share this Article