.
ఆరేళ్లయింది… రేవంత్ రెడ్డి కేసీయార్‌కు కంట్లో నలుసయ్యాడు… ఎక్కడ దొరుకుతాడా, ఎప్పుడు మూసేద్దామా అని కేసీయార్ ఎదురుచూస్తున్నాడు… రేవంత్ రెడ్డి కూడా ఏమీ తగ్గడం లేదు… తను మల్కాజిరిగి ఎంపీ… అసలు కేటీయార్ ఆ జన్వాడ ఫామ్ హౌజులో ఏం చేస్తున్నాడు..? అది జీవో 111 పరిధిలో ఉందా..? రూల్స్‌కు విరుద్ధంగా నిర్మించబడిందా..? ఏమైనా అక్కరకొచ్చే సీన్లు దొరుకుతాయా అని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు…
పోలీసులు ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వని కాపలా కదా… అందుకని రేవంత్ రెడ్డి ఓ డ్రోన్ ఎగురవేసి కొన్ని సీన్లు చిత్రీకరింపచేశాడు… మీడియాలో కూడా వచ్చింది… రేవంత్ రెడ్డి దొరికాడు కదాని కేసీయార్ కమాన్, బుక్ హిమ్ అన్నాడు… నార్సింగి పోలీసులు కేసు పెట్టారు… రేవంత్ రెడ్డిని అరెస్టు కూడా చేశారు… తరువాత కొన్నాళ్లకు బెయిల్ వచ్చింది, అప్పటిదాకా రేవంత్ రెడ్డి జైలులోనే ఉన్నాడు…
Ads
ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు… దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 2025 మార్చి 19న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది… డ్రోన్ ఎగిరినట్లు పోలీసులు పేర్కొన్న మియాఖాన్‌గడ్డ ప్రాంతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన “నిషిద్ధ ప్రాంతం” (Prohibited Area) కాదని. అలాంటప్పుడు ఆ ఘటనకు సంబంధించి Aircraft Act కింద నమోదు చేసిన నిబంధనలు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది…
అంతేకాకుండా, పోలీసులు నమోదు చేసిన కొన్ని శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు కూడా ఈ ఘటనకు అన్వయించవని హైకోర్టు పేర్కొంది… కేసును కొనసాగించడానికి అవసరమైన చట్టపరమైన ఆధారాలు లేవని గుర్తించిన న్యాయస్థానం, ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది…
గమనించాల్సిన విషయం ఏమిటంటే, రేవంత్ రెడ్డి ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని వాదించాడు. అయితే, హైకోర్టు తన తీర్పులో రాజకీయ ఉద్దేశాలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. చట్టపరమైన లోపాలు, వర్తించని సెక్షన్లు, తగిన ప్రాథమిక ఆధారాల లేమి వంటి కారణాల ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది…

సీన్ కట్ చేస్తే… రేవంత్ రెడ్డి కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు… ఎన్నికల్లో కేసీయార్‌ను మట్టిగరిపించాడు, తను ముఖ్యమంత్రి అయిపోయాడు… దెబ్బకు కేసీయార్ ఫామ్‌హౌజుకు పరిమితమై, పరాభవభారంతో జనానికి మొహం చూపించడం లేదు రెండున్నరేళ్లుగా..! కానీ రేవంత్ రెడ్డి మదిలో నాటి కేసు సలుపుతూనే ఉంది… బెయిల్ మీద బయటికొచ్చాక మీసం తిప్పుతూ ‘ఇక చూసుకొండి, నా తడాఖా ఏమిటో చూపిస్తా’ అన్నాడు గుర్తుంది కదా… పైన ఫోటో అదే…

కానీ జన్వాడ ఫామ్ హౌజులో ఏం జరుగుతున్నదనేది ఓ మిస్టరీ… టైమ్ కోసం వెయిటింగ్… జన్వాడ, మిర్జాగూడ గ్రామాల పరిధిలోని సర్వే నంబర్లు 301 నుంచి 313 వరకు ఉన్న భూముల్లో నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నమోదైంది. తానే ఆ ఆస్తికి యజమానినని బద్వెల్ ప్రదీప్‌రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కోర్టుకు తెలిపాడు… సర్వే నంబర్ 311లో 3.30 ఎకరాల భూమితో పాటు 1,210 చదరపు గజాల్లో నిర్మించిన ఫామ్‌హౌజును రిజిస్టర్డ్ సేల్‌డీడ్ల ద్వారా కొనుగోలు చేసినట్లు వివరించాడు. ఆస్తి ఆయన పేరునే ఉన్నట్లు కోర్టు ఉత్తర్వుల్లో నమోదైంది…

కానీ అదే ప్రదీప్ హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో బ్లిస్ ప్రాజెక్టు పేరిట 153 ఫ్లాట్లు కట్టాడు… నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్న ఆ భవనాలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు..? అసాధారణ రీతిలో అంత దయ ఎవరు చూపారు..? అప్పుడు మున్సిపల్ మంత్రి కేటీయార్… అదంతా రేవంత్ రెడ్డికి తెలుసు… అటు ఫామ్‌హౌజుకూ ఈ బ్లిస్ ప్రాజెక్టుకూ నడుమ క్విట్ ప్రోకో ఉందనుకున్నాడు…

రీసెంటుగా ఆ భవనాలకు ఇచ్చిన రెరా పర్మిషన్ కాలం చెల్లింది… ఎన్వోసీ లేదు, ఇరిగేషన్ అనుమతి లేదు… దీంతో ఇక ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు ఇచ్చింది… హైడ్రా, జీహెచ్ఎంసీ, రెరా, కలెక్టర్… అందరూ రంగంలోకి దిగారు… నోటీసులు జారీ… ఆ భవనాల లావాదేవీలు అక్రమం, చట్టవిరుద్ధం అని రెరా ప్రకటన… ఇక్కడ బ్లిస్‌ను నొక్కితే అక్కడ జన్వాడలో నొప్పి లేస్తుందని తెలుసు… పావులు కదులుతున్నాయి…

అసలు మున్సిపల్ పర్మిషన్లు ఎవరిచ్చారు..? ఎవరు చెబితే ఇచ్చారు..? ఇవీ తవ్వుతున్నారు ఇప్పుడు..? కేటీయార్ దొరుకుతాడా..? ఫార్ములా వన్ కేసులో కేటీయార్ ఓరల్‌గా చెబితే అరవింద్ డబ్బులిచ్చి ఇరుక్కున్నాడు… మరి ఇందులోనూ అంతేనా..? సో, తదుపరి ప్రాసెస్ మీద అందరిలోనూ ఆసక్తి… రేవంత్ రెడ్డి జాగ్రత్తగా కేటీయార్‌ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నాడు… చూడాలిక!! ఐతే అధికారికంగా అటు జన్వాడ తనది కాదు, ఇటు బ్లిస్ ప్రాజెక్టూ తనది కాదు…!!
Share this Article