Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంతమందికి ఉరి ఇదే తొలిసారి! సరైన తీర్పు- ఇప్పటికే లేటైంది!!

July 8, 2026 by M S R

.

Srini Journalist …. డార్క్ సైకాలజీ… ఆ 38 మందికి ఉరిశిక్ష వెనుక కోర్టు విశ్లేషించిన ‘ఉన్మాద మైండ్‌సెట్’!

నిన్న గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిస్తూ 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్షను, 11 మందికి యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే మొదటిసారి. న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయానికి రావడానికి వెనుక నిందితుల సంస్కరణకు లొంగని క్రూరత్వాన్ని, వారి భయంకరమైన ప్రవర్తనా సరళిని పూర్తిగా విశ్లేషించింది.

Ads

ఈ కేసులోని నిందితులు సాధారణ నేరస్థులు కారు. వీరిలో అత్యధికులు డాక్టర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు వంటి ఉన్నత విద్యావంతులు. అయినప్పటికీ, జైలులో గడిపిన ఇన్నేళ్ల కాలంలో వీరి ప్రవర్తనలో ఎలాంటి పశ్చాత్తాపం గానీ, మారాలనే ఆలోచన గానీ కనిపించలేదని జైలు అధికారులు, కౌన్సిలర్ల నివేదికలు స్పష్టం చేశాయి.

చట్టం సాధారణంగా నిందితుల్లో సంస్కరణకు అవకాశం ఉందేమో చూస్తుంది. కానీ వీరు తమ జిహాదీ భావజాలానికి ఎంతగా బానిసలయ్యారంటే, తాము చేసిన 56 మంది అమాయకుల హత్యలను వారు కనీసం ఒక నేరంగా కూడా భావించలేదు.

కోర్టు పరిగణనలోకి తీసుకున్న అత్యంత భయంకరమైన సంఘటన..
2013లో సబర్మతి సెంట్రల్ జైల్లో జరిగిన భూగర్భ సొరంగం ఉదంతం…
నిందితులు తాము భోజనం చేసే స్టీల్ ప్లేట్లు, స్పూన్లు, చిన్నపాటి కత్తులను ఆయుధాలుగా మార్చుకుని, officials కళ్లు గప్పి ఏకంగా 213 అడుగుల పొడవైన సొరంగాన్ని తవ్వారు.
జైలు గోడల మధ్య ఉండి కూడా దేశ న్యాయవ్యవస్థను సవాలు చేస్తూ, బయటకు తప్పించుకుని మళ్లీ విధ్వంసం సృష్టించాలనుకున్న వీరి పట్టుదల, వారి మైండ్‌సెట్ సమాజానికి ఎంత ప్రమాదకరంగా ఉందో వంద శాతం prove అయ్యింది.

అందుకే ట్రయల్ కోర్టు జడ్జి తన తీర్పులో ఒక సంచలన వ్యాఖ్య చేశారు.
“ఈ నిందితులను గనుక సమాజంలోకి వదిలేస్తే, వారు మనుషులతో కలిసి తిరిగే మనుషులు కాలేరు; సమాజాన్ని వేటాడే నరభక్షకుల్లా ప్రవర్తిస్తారు” అని స్పష్టం చేశారు. వీరు బయట తిరిగితే తమ భావజాలాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ, ముఖ్యంగా అమాయక పౌరులను టార్గెట్ చేస్తూనే ఉంటారని కోర్టు నిర్ధారించింది.

చట్టం ముందు నేరస్థుడి విద్యా అర్హతలు, మతం పక్కకు వెళ్లిపోయాయి; సమాజ భద్రతను కాపాడటం కోసం, ఇలాంటి రిఫార్మ్ కాని ఉన్మాద శక్తులను శాశ్వతంగా అంతమొందించడమే ఏకైక మార్గమని న్యాయస్థానం భావించింది…

కానీ, ఇప్పటికే 18 ఏళ్లయింది, ఇంకా సుప్రీంకోర్టు ఉంది… అప్పీళ్లు, ధర్మాసనాలు ఎట్సెట్రా… ఇంకెన్నాళ్లో… ఇలాంటి ధూర్తులకు మనం నిజంగా శిక్ష విధించగలుగుతున్నామా?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇంతమందికి ఉరి ఇదే తొలిసారి! సరైన తీర్పు- ఇప్పటికే లేటైంది!!
  • సబాంగ్ పోర్ట్! చైనా సముద్ర వ్యూహాలకు ఇండియా తెలివైన చెక్!
  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions