.
నిన్నటిదే ఒక వార్త… ఇప్పుడే హీరోయిన్, అప్పుడే షరతులు అని శీర్షిక… పాపం, మీడియా తప్పేమీ లేదు అందులో… మన సినిమా ఇండస్ట్రీలో అసందర్భ ప్రేలాపనలు, మగ పెత్తందారీ పోకడలు, ఆడదాన్ని అంగటి సరుకుగా మాత్రమే చూసేవాళ్లకు కొదువ లేదు కదా… మైక్ దొరికితే చాలు ఏదో కూస్తారు… బహిరంగ వేదికల మీద మాట్లాడుతున్నామనే సోయి కూడా ఉండదు… ఏం తాగి వస్తారో…
అసందర్భ ప్రేలాపి అని ఎందుకన్నానంటే… నిన్న ఓ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ జరిగింది… దాని పేరు లవ్ ఓ లవ్… తమిళ సినిమా డబ్బింగ్… అందులో ఫోక్ సూపర్ స్టార్ నాగదుర్గ ప్రధాన కథానాయిక… మిస్టర్ మిడిల్ క్లాస్ అని ఓ సినిమా వచ్చిందట, దాని నిర్మాత ఎవరో చందు అట…
Ads
తను మాట్లాడుతూ ‘‘మా సినిమా కోసం ఈమెను సంప్రదించాం, బోలెడు కండీషన్లు చెప్పింది, మెయిన్ హీరోయిన్ అయితేనే చేస్తానంది, సైడ్ రోల్స్ చేయనంది, రిజెక్ట్ చేసింది, ఇడుపు కాయితం సినిమా నిర్మాతకు 15 కండీషన్లు పెట్టిందట, ఒకరికంటే ఎక్కువ హీరోయిన్లున్నా తన పాత్రకే ఇంపార్టెన్స్ ఉండాలట’’ ఇలా చెబుతూ పోయాడు…

1) అసందర్భ ప్రేలాపన… అది ఆమె నటించిన తమిళ సినిమా ప్రిరిలీజ్… శుభం పలకరా అంటే ఆమె అలాంటిది, ఇలాంటిది అనే నెగెటివ్ వ్యాఖ్యలు దేనికి అక్కడ… పైగా మా సినిమా రిజెక్ట్ చేసిందనే అక్కసు కడుపులో మసులుతూ ఉన్నట్టుంది… బేకార్ వ్యాఖ్యలు…
2) ఒక సినిమా చేయాలంటే అందులో తన పాత్రకు ప్రయారిటీ ఉండాలని కోరుకోవడంలో తప్పేముంది..? అవును, సైడ్ రోల్స్ చేయను అంటోంది, తప్పేముంది..? ఇతరుల్లాగా ఈ సినిమా మగాళ్ల దగ్గర సాగిలబడను అంటోంది, తప్పేముంది..?

3) తొక్కలో సినిమా చాన్సులు వస్తే రానీ, పోతే పోనీ… అనే ఆత్మాభిమానంతో ఓ తెలుగు నటి కండీషన్లు పెడుతుంది, సో వాట్..? ఆమె టెంపర్‌మెంట్ నిజంగా నచ్చింది… ఆ కండీషన్లు ఇబ్బందికరం కావు గనుకే తమిళంలో మరో సినిమా, తెలుగులో రెండు సినిమాలకు సైన్ చేసింది…
4) బన్నీ వాసు వంటి నిర్మాతే ఆమె చెప్పిన కండీషన్లు అన్నీ అంగీకరించాం, మా సినిమాకు ఆమే కావాలనుకున్నాం… అని ఇడుపు కాయితం ప్రారంభపూజ సమయంలో తనే చెప్పాడు, మరీ ఈ చందులాగా ఏడుస్తూ చెప్పలేదు… మెచ్చి, నచ్చి తీసుకున్నామని ఆనందంగానే చెప్పాడు… సుకుమార్, బన్నీ వాసులే తలూపితే ఈ అనామక దర్శకుడికి వచ్చిన నొప్పి ఏమిటో…

5) సో వాట్..? ఆమె గ్లామర్ రోల్స్ చేయను అంటోంది, ఆమె ఎంచుకున్న బాట అది… ఇండస్ట్రీలో ఉంటే ఉంటాను, లేకపోతే లేదు అంటోంది… ఎవరైనా తార చాన్స్ ఇవ్వమంటే ఈ నిర్మాతలే సవాలక్ష కండీషన్లు (అందులో కమిట్మెంట్లు గట్రా) పెట్టి దోపిడీ చేస్తుంటారు కదా… ఈమె ఉల్టా తనే కండీషన్లు పెడితే అభినందించక ఆ ఏడుపు వ్యాఖ్యలేమిట్రా బాబూ..?! మగ అహం, అందులోనూ సినిమా మగ అహం దెబ్బతిందా..?!
Share this Article