Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!

July 10, 2026 by M S R

.

కాళేశ్వరం సహా కేసీయార్ హయాంలో సాగిన పలు అవినీతి బాగోతాలపై స్పందించి, అస్త్రాలు సంధిస్తూ బీఆర్ఎస్ పెద్ద తలకాయలకు ఊపిరాడకుండా చేస్తున్న కేసీయార్ బిడ్డ మరో బాంబు పేల్చింది… ఇది ఇంకాస్త సీరియస్ బాంబ్… బీఆర్ఎస్ ముఖ్యులు ఉలిక్కిపడటమే కాదు, ఏం స్పందించాలో తెలియని స్థితి…

ఆమె ఏం మాట్లాడుతున్నా… హరీష్ రావును నేరుగానే నిలదీస్తున్నా, హరీష్ రావు ఆమెకు కౌంటర్లు ఇవ్వడం లేదు, పైగా ఆమె వెళ్లేచోటకు తను వెళ్లకుండా అవాయిడ్ చేస్తున్నాడు (ఉదహరణకు రైతు డిస్కమ్ మీద రెగ్యులేటరీ కమిషన్ పబ్లిక్ హియరింగ్)… కేటీయార్ కూడా సైలెంట్… ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా ఏమీ స్పందించకూడదని కేసీయార్ స్ట్రిక్ట్ ఆదేశాలు…

Ads

కానీ ఇప్పటి ఆరోపణ పొలిటికల్‌గానే కాదు… బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న నిధులు 1400 కోట్లు మొత్తం క్విడో ప్రోకో యవ్వారాలతో వచ్చినవేేనని ఆరోపించి, బాంబు బత్తి అంటించింది… అంటే అది పొలిటికల్ అవినీతి… ఆ డబ్బంతా ఏవో అనుచిత అనుమతులకు ప్రతిగా పార్టీకి అందినదేనని ఆమె ఆరోపణ సారాంశం… దీనిపై నిజానికి కేసీయార్ స్పందించాలి, తనే పార్టీ అధ్యక్షుడు, హరీష్‌ను వదిలేస్తే, కేటీయార్ వర్కింగ్ ప్రసిడెంట్ కదా, తనైనా తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన స్థితి ఏర్పడింది!

పైగా ఆ డబ్బు ఆరోపణలకు అమరవీరులను ముందుపెట్టిందామె సెంటిమెంట్‌‌గా… ఎలాగంటే..? ‘‘పదేళ్ల పాలనలో అక్రమ మార్గాల్లో కూడబెట్టిన ఈ 1400 కోట్లను రాజకీయ అవసరాలకు, విలాసాలకు కాకుండా… తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు తక్షణమే పంచిపెట్టాలి’’… అంతేకాదు…

‘‘ఏపీ బడా కంట్రాక్టర్ల నుంచి వసూలైన సొమ్ము, తెలంగాణ వనరులను, ప్రాజెక్టులను ఏపీ కంట్రాక్టర్లకు ఇచ్చి, ప్రతిఫలంగా తీసుకున్న పార్టీ ఫండ్..’’ ఒకవైపు మళ్లీ రకరకాలుగా తెలంగాణ సెంటిమంట పెట్టే ప్రయత్నాల్లో ఉన్న బీఆర్ఎస్‌కు కవిత చేసిన ఏపీ కంట్రాక్టర్ల అక్రమ సొమ్ము, అమరుల కుటుంబాలకు పంపిణీ ప్రస్తావన ఓ షాక్… ఇది బీఆర్ఎస్‌ను పొలిటికల్‌ డిఫెన్సులో పడేసినట్టే ఒకరకంగా…

ఇక్కడ రెండు అంశాలు గుర్తొస్తున్నాయి… నాకు సపోర్ట్ చేయండి, జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి మొత్తం ఎన్నికల ఖర్చును భరిస్తాను అని కేసీయార్ సిద్ధపడినట్టు ఎవరో ప్రసిద్ధ జర్నలిస్టు వెల్లడించాడు కదా… అంటే పార్టీ ఎంత సొమ్ము కూడబెట్టిందనే ప్రశ్న, ఆ సొమ్ము ఎలా వచ్చిందనేది ఇప్పుడు కవిత ఆరోపణలతో జనంలోనూ చర్చనీయాంశం అవుతోంది…

నిజానికి మామూలు సందర్భంలో ఆమె ఈ ఆరోపణ చేస్తే వేరు… కానీ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ (జన్వాడ ఫామ్ హౌజ్ అధికారిక ఓనర్) కు హుసేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో భారీ ప్రాజెక్టుకు క్విడ్ ప్రోకో కింద అనుమతులు ఇచ్చినట్టు రెండురోజులుగా ఓ రాద్దాంతం సాగుతోంది కదా… ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయనేది రేవంత్ రెడ్డి తవ్వుతున్నాడనీ సమాచారం… దాంతో 1400 కోట్ల నిధులపై ఆమె ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది…(క్విడ్ ప్రోకో కథనం రాసిన డెక్కన్ క్రానికల్‌కు కేటీయార్ డిఫమేషన్ కేసుపై లీగల్ నోటీసు పంపించాడు… మరి కవిత మీద కేసు పెడతారా? చూడాలిక)…

చివరగా… రీసెంట్ పరిణామమే… మమత పార్టీకి చెందిన 440 కోట్లను ఈడీ పీఎంఎల్ఏ కింద ఫ్రీజ్ చేసింది… పొలిటికల్ అవినీతితోనే ఈ నిధుల సమకూరినట్టు ఆరోపణలు… అవునూ, కవిత ఈడీని ఏమైనా ఆశ్రయించే చాన్సుందా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!
  • మరో రాజ్యాంగ పోరాటం! ఆ బిల్లును గెలుకుతున్న సీఎం విజయ్!!
  • అసలు బ్లండర్ కేసీయార్‌కూ తెలుసు! అందుకే కాళేశ్వరంపై ద్రోహ నిశ్శబ్దం!!
  • ఐదు పెళ్లిళ్లు – డజను అఫయిర్స్… కానీ చివరకు ఏమయ్యాడు..?!
  • ‘రామాయణ’ లెక్కలు ఎక్కడ దెబ్బతిన్నాయి? అసలు కథలేమిటి?
  • ఓ వెలుగు వెలిగి… అనామకంగా ఓ మారుమూల అజ్ఞాతంలోకి!!
  • అహోబిలం! అడుగడుగునా అడ్డగోలు వసూళ్లతో అయ్యోబిలం!!
  • ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ వివాదం – డెక్కన్ క్రానికల్‌కు KTR పరువునష్టం నోటీసు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions