.
మీకు చిరంజీవి దస్తూరి తెలుసా..? ఎప్పుడైనా చూశారా..? తన సినిమా కెరీర్ మొదట్లో తన ఆప్త స్నేహితులతో సినిమా విషయాలు ఎలా పంచుకునేవాడో తెలుసా..? ప్రత్యేకించి ఒక డాక్టర్‌తో తను అన్ని విషయాలూ ఎంత స్వేచ్ఛగా చెప్పుకునేవాడో తెలుసుకోవాలని ఉందా..?
మిత్రులు, సితార సినిమా మ్యాగజైన్‌లో చాన్నాళ్లు పనిచేసిన మోహన్ గోటేటి కథనం ఒకటి ఇంట్రస్టింగ్ అనిపించింది… అంతేకాదు, అప్పుడెప్పుడో 1978 ప్రాంతంలో… తను ప్రాణం ఖరీదు చేస్తున్న కాలంలో… తను మిత్రుడికి రాసిన లేఖను కూడా షేర్ చేసుకున్నారు… ఆసక్తికరంగా ఉంది…
Ads
చిరంజీవికి ఒక స్నేహితుడు… పేరు సత్యప్రసాద్ అలియాస్ పండరి, భీమవరం… చిన్నప్పటి నుంచీ సాన్నిహిత్యం… ఈరోజుకూ ఆ స్నేహం అలాగే ఉంది… అంతేకాదు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక తన కోరిక మేరకు ఈ డాక్టర్ గారు ఆ పార్టీ వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు… చిరంజీవి పార్టీ కాబట్టే రాజకీయాల్లోకి వచ్చారు…

ఇక్కడ విషయం ఏమిటంటే..? ఈ లేఖ… ఇప్పుడు ఉన్నట్టుగా అప్పట్లో కొత్త సినిమా విశేషాలు లీక్ చేయకూడదనే ఆంక్షలు, షరతులు ఏమీ లేవు కదా… అప్పుడే ఫిలిమ్ యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసిన చిరంజీవి పునాదిరాళ్లు సినిమాలో బుక్ అయ్యాడు… ఇంకా ఇలా చెప్పుకున్నాడు తన స్నేహ వైద్యుడికి రాసిన లేఖలో… (సారాంశం)… (కొన్నిచోట్ల ఆ దస్తూరీ సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి…)
‘‘పునాదిరాళ్లులో బుక్ అయ్యాను, ఆల్రెడీ 8 రీల్స్ షూటింగ్ అయిపోయింది, వెంటనే అన్నపూర్ణ వాళ్లు క్రాంతికుమార్ దర్శకత్వంలో తీసే ప్రాణం ఖరీదులో కూడా చాన్స్ వచ్చింది… నా సరసన రేష్మీ రాయ్ అనే ఓ ఒరియా నటి చేస్తోంది… ఇదీ మూడోవంతు షూటింగ్ అయిపోయింది… ఓ డ్యూయెట్ కూడా ఉంది, చాలామంది నటులున్నారు, కానీ దాదాపుగా నేనే హీరో…

నా స్క్రీన్ పేరు చిరంజీవి… (అప్పటికే శివశంకర వరప్రసాద్ చిరంజీవి అయిపోయాడన్నమాట)… ఇది పెద్ద సంస్థ. శారద, జ్యోతి, కల్పన, ఊర్వశి, ఆమె కథ వంటి సినిమాలు తీసింది… అందులో చాన్స్ రావడం నా లైఫ్‌కు మంచి మలుపు… అనుకున్నట్టుగానే నువ్వు డాక్టర్ అవుతున్నావు, నేను యాక్టర్ అయిపోయాను… షూటింగు కోసం రాజమండ్రి వస్తున్నాను…
నువ్వూ ఓసారి రా, హోటల్ అప్సరకు, తప్పకుండా కలుద్దాం..’’ ఇలా సాగింది లేఖ… ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే..? చిరంజీవి తన రూట్స్ మరిచిపోలేదు, తన పాత స్నేహాల్ని కూడా ఎప్పుడూ మరిచిపోలేదు… ఈ లేఖ అసలు సారాంశం అదే… అభినందించదగిన విషయం, విశేషం…
Share this Article