.
‘హవాయి చప్పల్స్’ వెనుక ఆకాశంలో విలాసాలు: తృణమూల్ కాంగ్రెస్ నిధులపై ED సంచలన నివేదిక
సామాన్య ప్రజల నాయకురాలిగా, ‘హవాయి చప్పల్స్’ ధరిస్తూ నిరాడంబరతకు నిదర్శనంగా పేరు తెచ్చుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ, ఇప్పుడు తీవ్ర ఆర్థిక వివాదంలో చిక్కుకుంది.
పార్టీ నిధుల వినియోగం, విలాసవంతమైన విమానాల కొనుగోలు, విదేశీ లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విడుదల చేసిన ఓ తాజా నివేదిక రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.
Ads
ఏం జరిగింది? – ED ప్రెస్ రిలీజ్‌లోని ముఖ్యాంశాలు
జులై 8, 2026న ED విడుదల చేసిన ప్రకటన ప్రకారం, TMC పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాల్లోని రూ. 440.42 కోట్లను స్తంభింపజేసింది ఈ నిధులపై జరిపిన దర్యాప్తులో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి
నిధుల మళ్లింపు…: పార్టీ ఫండ్ నుండి ‘కేర్ వెల్ ఏవియేషన్’ (Care Well Aviation) అనే సంస్థకు రూ. 160 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించారు.
ఆకాశంలో విలాసాలు…: ఈ నిధులతో ‘ఎంబ్రాయర్ లెగసీ 600’ (Embraer Legacy 600) అనే ప్రైవేట్ జెట్, ‘అగస్టా 109 SP’ (Agusta 109 SP) హెలికాప్టర్‌ను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు.
అద్దె నాటకం…: సొంత పార్టీ నిధులతో కొన్న ఈ విమానాలను, తిరిగి పార్టీకే అద్దెకు ఇవ్వడం ద్వారా కోట్లాది రూపాయల “ఎయిర్‌క్రాఫ్ట్ యూసేజ్” ఫీజులు చెల్లించినట్లు ED అనుమానిస్తోంది.
‘కేమన్ ఐలాండ్స్’ కనెక్షన్
ఈ వ్యవహారంలో అత్యంత వివాదాస్పదమైన అంశం ‘కేమన్ ఐలాండ్స్’. హెలికాప్టర్ కొనుగోలు కోసం 2023లో 1.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 16 కోట్లు) కేమన్ ఐలాండ్స్ నుండి “అన్‌సెక్యూర్డ్ లోన్” రూపంలో వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పన్ను ఎగవేతలకు స్వర్గధామంగా పేరున్న ఈ ప్రాంతం నుండి రాజకీయ పార్టీకి నిధులు అందడంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.
పార్టీ విధానం vs వాస్తవం
“నేను సామాన్యురాలిని, హవాయి చప్పల్స్ నా ఐడెంటిటీ” అని పదే పదే చెప్పుకునే మమతా బెనర్జీ నాయకత్వంలోని పార్టీలో, ఇంత భారీ స్థాయిలో విలాసాలకు, క్విడ్ ప్రోకో బాపతు పార్టీ నిధుల సమీకరణపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. “పేదల కోసం పోరాడుతున్నామనే ముసుగులో, పార్టీ నిధులను ప్రైవేట్ ఆస్తుల కోసం మళ్లించడం ఎంతవరకు సమంజసం?” అని రాజకీయ విశ్లేషకుల ప్రశ్న.
తదుపరి పరిణామాలు
ED ఈ వ్యవహారంపై లోతైన విచారణను కొనసాగిస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ లావాదేవీలను పరిశీలిస్తోంది. మరోవైపు, ఈ ఆరోపణలపై TMC ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇది రాజకీయ కుట్ర అని వారు వాదించే అవకాశం ఉన్నప్పటికీ, ED బయటపెట్టిన డాక్యుమెంటరీ ఆధారాలు పార్టీని ఇరకాటంలో పడేసినట్టే… మమతను కాదు, ఈడీ ప్రధానంగా అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తోంది…
ఈడీ దాడులు చేస్తుంటే, ఐప్యాక్ ఆఫీసుకు తను తన పోలీసు బలగంతో స్వయంగా వెళ్లి మమత ఓ సీఎం హోదాలో కీలక ఫైళ్లు ఎత్తుకువచ్చిన వీడియోలు, ఫోటోలు, వార్తలు గుర్తున్నాయి కదా, ఇవన్నీ బయటపడకూడదనే… కానీ నిజాలు ఆగవు కదా!!
తాజా సమాచారం… 440 కోట్ల నిధులున్న మూడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది కదా… ఇవి గాకుండా పార్టీ నేతలు, సంస్థల పేర్లతో వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న మరో 12 ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు… మొత్తం 1000 కోట్ల నిధులున్నట్టు అంచనా…
నో, నో, కవిత ఆరోపించినా సరే, కేసీయార్- బీఆర్ఎస్ 1400 కోట్ల నిధులపై ఈడీ గానీ సీబీఐ గానీ కన్నెత్తి కూడా చూడవు… కేసీయార్ పై ఈగ కూడా వాలనివ్వరు మోడీషా… అది పక్కా!!
Share this Article