Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లార్డ్స్‌లో రోహిత్ శర్మ చివరి మ్యాచ్? వీడ్కోలు అనివార్యమేనా?

July 17, 2026 by M S R

.

రో-కో రో-కో అని ఒకటే హైప్… ఇంగ్లండ్‌తో ఇండియా వన్డే సీరీస్‌కు ముందు… చాన్నాళ్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం లేదు, గౌతమ్ గంభీర్‌తో విభేదాలు… బీసీసీఐ టెస్టులు, టీ20ల నుంచి రిటైర్‌మెంట్… (ఐపీఎల్ మినహా)… లేదు, వాళ్లిద్దరికీ ఇంకా ఆడే వయస్సుంది, ప్రతిభ ఉంది, ఉత్సాహం ఉంది, ఫిట్‌నెస్ ఉంది అనే అభిమానులు కోకొల్లలు…

కానీ ఇంగ్లండ్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచులో ఇద్దరూ ఫెయిల్… ఆ పాత జోష్ లేదు… రెండో మ్యాచులో రోహిత్ మళ్లీ ఫెయిల్… విరాట్ కోహ్లీ కొంత బెటరే… తను పుంజుకున్న తీరు చూసి సెంచురీ చేస్తాడనుకున్నారు అందరూ… కానీ నిస్సారమైన పిచ్ మీద బాల్ అస్సలు బ్యాటింగుకు అనుకూలంగా లేకపోవడం, ఓ మంచి బాల్, వెరసి కోహ్లీ ఔటయ్యాడు…

Ads

బట్ రోహిత్ మాత్రం ముందు నుంచీ తడబ్యాటే… ఆ పాత రోహిత్ అస్సలు లేదు తనలో… త్వరగా ఔటయి పోయాడు… జట్టులోకి చాన్నాళ్ల తరువాత వచ్చిన ముగ్గురు సీనియర్లలో… బుమ్రా ఆ పాత నైపుణ్యం చూపిస్తున్నాడు… వికెట్లు పెద్దగా పడకపోయినా తన బౌలింగులో వేడి, వాడి తగ్గలేదు… రోహిత్ నిరాశపరిచాడు… కోహ్లీ పర్లేదు…

సో, ఇప్పుడిక మళ్లీ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ మీద భారీగా చర్చ మొదలైంది… లార్డ్స్‌లో జరగబోయే మూడో వన్డే తనకు లాస్ట్ మ్యాచ్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది… తనే కాదు, తన తరువాత నెక్స్ట్ విరాట్ కోహ్లీయే… అసలు ఈ సంవత్సరం వెస్టిండీస్, న్యూజిలాంట్ సీరీస్‌లకు వాళ్లిద్దరినీ సెలెక్ట్ చేస్తారానేది డౌటే ఇప్పుడు… ఇక వరల్డ్ కప్ దాకా ఎందుకు..?

ఎస్, రోహిత్ శర్మ విజయవంతమైన కెప్టెన్… వ్యక్తిగతంగా బోలెడు రికార్డులు… కానీ అవన్నీ గత వైభవం… కొత్త కెప్టెన్లు వచ్చేశారు… రికార్డులు బద్దలైపోతున్నాయి… పాత నీరు తప్పుకోవాల్సిన అనివార్యత వచ్చేసింది…

నిజానికి దీన్ని రెండు కోణాల్లో చూడాలి… ఆడగలిగేవాళ్లు బోలెడు మంది… గల్లీకొకడు ఈ దేశంలో… జూనియర్లతో ప్రయోగాలు చేస్తూ ఉంటే ఆడగలిగేవాడు నిలబతాడు, లేకపోతే పోతారు… ఇంకా ఇంకా సీనియర్లు వేలాడటం దేనికి..? నిజమైన ప్లేయర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రిటైర్ అయిపోవాలి స్వచ్చందంగా… ఎవరో పీకేసేదాకా చూస్తే నామర్దా…

మరో ప్రధాన కోణం… ఆదాయం… పైకి దేశం కోసం ఆడటమే… రోహిత్ కాస్త తక్కువే గానీ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ ఏటా వందల కోట్లు… అనేక కంపెనీలకు బ్రాండ్ ప్రమోషన్లే కాదు, తన ఇన్‌స్టా ఖాతాలో ఏదైనా యాడ్ పోస్ట్ చేస్తే కూడా కోట్లు… ఐపీఎల్‌లో ఆడుతున్నా సరే, ఐసీసీ టోర్నమెంట్లలో ఆడితే ఆ వాల్యూ వేరు… సో, అందుకే ఇలా జట్టులో ఉండాలనే తాపత్రయం… ఆఖరుగా… ఇంకా ఎంత సంపాదించాలి..? సంపాదన ఆశలకు అంతెక్కడ..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions