Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో, నో – త్రీ ఇడియట్స్ హీరో పాత్రకూ ఈ సోనమ్ వాంగ్‌చుక్‌కూ లింకే లేదు !!

July 17, 2026 by M S R

.

‘3 ఇడియట్స్’ సినిమా గుర్తుంది కదా… ఆమీర్ ఖాన్ పోషించాడు… అది చేతన్ భగత్ రాసి ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’ నవల ఆధారంగా నిర్మించబడింది… ఐతే అందులో ఫున్సుక్ వాంగ్డు పాత్ర చాలా పాపులర్…

కొన్నాళ్లుగా ఒకటే ఘోష… ప్రస్తుతం బొద్దింకలకు తోడుగా కొన్నిరోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నాడు కదా, సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా ఆ పాత్ర క్రియేట్ చేయబడింది అని! కొన్ని అలా హైప్ చేయబడతాయి… ఆప్, ఖలిస్థానీలు, జేఎన్‌యూలు, లెఫ్ట్ ఎట్సెట్రా చాలా జాతి వ్యతిరేక బొద్దింకలు ఆ ప్రచారాన్ని మోస్తూ ఉంటాయి కూడా…

Ads

ఇప్పుడు బాలీవుడ్ స్థార్, ఆ చిత్రంలో హీరో పాత్ర పోషించిన ఆమీర్ ఖాన్ ఏమంటున్నాడు అంటే..? ‘‘త్రీ ఇడియట్స్ సినిమాలో నా పాత్ర ‘రాంచో’ (ఫున్సుక్ వాంగ్డు) నిజజీవిత విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా రూపొందించబడిందనేది అపోహ మాత్రమే..’’

లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘లగాన్’ సినిమా ప్రదర్శన అనంతరం జరిగిన చర్చా కార్యక్రమంలో అమీర్ ఖాన్ పాల్గొన్నాడు… ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్‌తో తన పాత్రకు ఉన్న సంబంధం గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ…

“అది నిజం కాదు. ఆ విషయం ఒక అపోహ మాత్రమే. ‘3 ఇడియట్స్’ సినిమా చేస్తున్న సమయంలో మాకు సోనమ్ వాంగ్‌చుక్ గారి గురించి అసలేమీ తెలియదు. మా సినిమా రచయితలు రాజు (రాజ్‌కుమార్ హిరానీ), అభిజాత్ (జోషీ) ఎవరికీ ఆయన గురించి అవగాహన లేదు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న పని చాలా గొప్పది, ఆయనకు గుర్తింపు రావడానికి ఆయన పాత్ర మా సినిమాలో ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను…”

సినిమా పాత్రతో సంబంధం ఉన్నా లేకపోయినా, సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఉద్యమం పట్ల అమీర్ ఖాన్ తన మద్దతును, ఆందోళనను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షపై స్పందిస్తూ, “ఆయన ఆరోగ్యం పట్ల మేమంతా చాలా ఆందోళనగా ఉన్నాము. ఆయన త్వరగా తన దీక్షను విరమించాలని కోరుకుంటున్నాము” అని పేర్కొన్నాడు…

నేపథ్యం: ఎందుకు ఈ నిరసన? నీట్-యూజీ (NEET-UG) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంతో ప్రారంభమైన ఈ ఉద్యమం, ప్రస్తుతం భారత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కోరుతూ ‘కాకరోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో జరుగుతోంది…

  • డిమాండ్లు…: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం 5-పాయింట్ల రోడ్‌మ్యాప్ అమలు.

  • ప్రస్తుత పరిస్థితి…: సుమారు 19 రోజులుగా దీక్ష కొనసాగిస్తుండటంతో సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంది…

  • తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం కంటే, జూలై 20న ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా చేపట్టే ‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో పాల్గొనాలని ఆయన ప్రజలను కోరుతున్నాడు..!!

  •  అన్నట్టు… ప్రకాశ్ రాజ్ వంటి యాంటీ- హిందూ, యాంటీ- నేషన్ యాక్టివిస్టులే ఈ కాక్రోచ్ ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్నారు, తెలుసు కదా!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో, నో – త్రీ ఇడియట్స్ హీరో పాత్రకూ ఈ సోనమ్ వాంగ్‌చుక్‌కూ లింకే లేదు !!
  • ఔను, నిజమే… ఆమె జీవితం ఓ పాఠ్యాంశం ఎందుకు కాకూడదు !!
  • లార్డ్స్‌లో రోహిత్ శర్మ చివరి మ్యాచ్? వీడ్కోలు అనివార్యమేనా?
  • ప్రైవేటు కంపెనీల ‘స్పేస్’లోకి ఇస్రో మేధోవలస ! ఓ నిశిత పరిశీలన !!
  • BRS – a political paradox ! బీఆర్ఎస్ అంటేనే ఓ పేద్ద విరోధాభాసం !
  • సుప్రీం సరేనంది ! మమత మార్క్ ముస్లిం రిజర్వేషన్లకు తెర !!
  • తీస్తా-3 ఓ వార్నింగ్ బెల్..! మేడిగడ్డతో ఆటలాడితే అసలుకే మోసం !!
  • ఆమె మాకొద్దు, మాకసలే వద్దు… శ్రీలీలకు ఏమిటి ఈ దురవస్థ !
  • బుల్‌డోజర్ సర్కారు! ఆ యూనివర్శిటీ 38 బిల్డింగులనూ కూల్చేస్తారట!
  • రాష్ట్రపతి అయ్యాక కూడా… ఆ మహాప్రభు అనుమతిస్తేనే దర్శనం

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions