Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బన్నీకి మళ్లీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఎందుకు రాలేదు ?!

July 19, 2026 by M S R

.

సోషల్ మీడియా కొన్ని గ్రూపులు, పేజీల్లో చర్చ… అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు జాతీయ అవార్డు ఎందుకు రాలేదు..? పుష్ప-2 లో తన నటన అపూర్వం కదా, ఏం తక్కువైంది? ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఇది దక్షిణ సినిమా మీద వివక్ష కాదా?

… నిజానికి ఇవన్నీ నిర్హేతుకమైన, నిరర్థక, మూఢాభిమాన వాదనలు… గతంలో ఏమో గానీ, ఈసారి జాతీయ అవార్డుల ఎంపికలో దక్షిణాది పట్ల వివక్ష ఏమీ లేదు… జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన మమ్ముట్టి దక్షిణాది నటుడు కాదా ఏం? మన తెలుగు ఇండస్ట్రీకి కూడా బోలెడు అవార్డులు దక్కాయి కదా!

Ads

మమ్ముట్టి డెఫినిట్‌గా సూపర్బ్ నటన కనబరిచాడు భ్రమయుగంలో… పుష్ప-2 లో అల్లు అర్జున్ ఓ రొటీన్ కమర్షియల్ హీరో… కానీ భ్రమయుగం సినిమా ఓ ప్రయోగం, ఓ సాహసం… ఆ పాత్రను ఆవాహన చేసుకుని, ఓరకమైన తాదాత్మ్యతతో నటించడం మమ్ముట్టి సాహసం, ప్రతిభ… మన వెగటు, రోత స్టెప్పులు, పంచులు, గ్రాఫిక్ ఫైట్ల ముసలి తోపు స్టార్లతో ఓసారి పోల్చండి మమ్ముట్టిని! 1998 తర్వాత అంటే దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయనకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు మళ్ళీ దక్కడం, అంటే నాలుగోసారి దక్కడం విశేషం.

సేమ్, చందూ ఛాంపియన్ (Chandu Champion) సినిమా భారతదేశపు మొదటి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ (Murlikant Petkar) జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్… ఈ  పాత్రలో నటుడు కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) పరకాయ ప్రవేశం చేశాడు… ఇద్దరికీ సంయుక్తంగా జాతీయ అవార్డు రావడం సరైన ఎంపిక…

కాకపోతే ఆడుజీవితం హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు దక్కాల్సినంత క్రెడిట్ దక్కలేదేమో… ఇక అల్లు అర్జున్ విషయానికి వద్దాం… తను పుష్ప సినిమాకు ఆల్రెడీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కొట్టాడు… మళ్లీ అదే ఫ్రాంచైజీకి, అదే నటుడికి మరోసారి వరుసగా అవార్డు వస్తే అది మరీ అసాధారణం… అల్లు అరవింద్ దేన్నైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలడేమో గానీ, మరీ ఇంత అసాధారణ పురస్కారానికి తన పరపతి సరిపోదు…

నిజానికి భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో (National Film Awards) ఉత్తమ నటుడిగా వరుసగా రెండు సంవత్సరాలు అవార్డును గెలుచుకున్న నటులు లేరని కాదు… వీరిలో ముఖ్యులు…

  • సంజీవ్ కుమార్…: 1970లో ‘దస్తక్’ చిత్రానికి, ఆ తర్వాత 1972లో ‘కోశిష్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా పురస్కారాలు అందుకున్నాడు…

  • ఓం పురి…: 1981లో ‘ఆరోహన్’ చిత్రానికి, 1983లో ‘అర్ధ్ సత్య’ చిత్రానికి అవార్డు పొందాడు…

ఈ ఇద్దరూ “వరుసగా” (consecutive) అంటే పక్కపక్కనే ఉన్న సంవత్సరాల అవార్డులు పొందలేదు… ఒక సంవత్సరం గ్యాప్‌తో అవార్డులు అందుకున్నారు… కాగా, భారతీయ చలనచిత్ర చరిత్రలో చాలామంది నటులు తమ కెరీర్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఉదాహరణకు:

  • అమితాబ్ బచ్చన్…: 4 సార్లు ఉత్తమ నటుడు.

  • కమల్ హాసన్, మమ్ముట్టి, అజయ్ దేవగణ్…: వీరు ముగ్గురూ మూడేసి సార్లు ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. తాజా అవార్డుతో మమ్ముట్టి అమితాబ్‌కు ఈక్వల్…

  • మోహన్‌లాల్, ధనుష్…: వీరు రెండుసార్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వన్డే సిరీస్ చేజేతులా సమర్పయామి ! కొంపముంచిన బౌలింగ్ వైఫల్యం !!
  • ఈ అవార్డు తెలుగు సినిమాకు చాలా ఉపయోగకరం… ఓ భిన్న విశ్లేషణ !
  • అమ్మవారి విగ్రహంతో బరిబాతల చెరువులోకి… అంతుచిక్కని అసాధారణ మిస్టరీ !!
  • సర్! ప్లీజ్ చెప్పండి సర్! నా ‘సర్’ ఏమయ్యింది సర్..?
  • కట్లపాము పెళ్లాం ! ఈసారి మరో కొత్త ఐడియాతో మరో మొగుడు ఖతం !!
  • బన్నీకి మళ్లీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఎందుకు రాలేదు ?!
  • పోసాని మార్క్ వింత విన్యాసం ! సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ !!
  • గగనానికి బాటలు వేస్తూ కొందరు – ‘జంతర్ మంతర్’ గుప్పిట్లో ఇంకొందరు
  • నో నో… ఈ కుందనపు బొమ్మకూ ఆ గణిత మేధావికీ ‘నెత్తుటి సంబంధం’ లేదు !!
  • ఇదేం పైత్యంరా !? లోదుస్తుల చోరీ ఫుటేజ్ చూసి పోలీసులూ విభ్రాంతి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions