Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజకీయులు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు..?

July 20, 2026 by M S R

.

Jagannadh Goud … రాజకీయ నాయకులు అర్జెంటీనా నుంచి ఏమి నేర్చుకోవచ్చు?

నిన్నటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ప్రతిభ నిజానికి ఓడిపోలేదు, వాళ్ల వ్యూహం ఓడించింది. స్పెయిన్ 20 సార్లు గోల్ కోసం ప్రయత్నించినా, 90 నిమిషాల ఆటలో ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు. నా తెలిసినంతవరకు, ఫుట్‌బాల్ చరిత్రలో అన్ని ప్రయత్నాలను అడ్డుకున్న గోల్‌కీపర్‌లు చాలా అరుదు.

Ads

అర్జెంటీనాకు తన బలాలు తనకున్నాయి. కానీ తనకు తెలిసిన బలమే సరిపోతుందని అనుకోవడం తప్పు. తమ వ్యూహమే కరక్ట్ అనుకోవటం కొంప ముంచింది. పరిస్థితులకి తగ్గట్లు ఆడకుండా, తమ వ్యూహం మార్చకుండా గుడ్డిగా తాము అనుకున్న ఒక రొటీన్ ఫిక్స్‌డ్ స్ట్రాటజీ ప్రకారమే వెళ్ళారు. చాలా రాజకీయ పార్టీలు కూడా ఇదే తప్పు చేస్తుంటాయి. పరిస్థితులకి తగ్గట్లు మారకుండా తమకి తెలిసిందే వేదం అనుకుంటారు.

సెమీ ఫైనల్‌లో అర్జెంటీనాపై ఇంగ్లాండ్ కూడా ఇదే తప్పు చేసింది. మొదటి 60 నిమిషాల ఆటను గమనిస్తే, రెండు జట్లు సమవుజ్జీలుగానే ఆడాయి. ఇంగ్లాండ్ ఒక గోల్ చేసినా, ఆట మాత్రం ఇద్దరూ సమానంగా పోరాడినట్లే సాగింది. కానీ ఆ గోల్ చేసిన వెంటనే ఇంగ్లాండ్ తన దూకుడును తగ్గించింది. ఆట ఇంకా 30 నిమిషాలు ఉన్నా దూకుడుగా ఆడే అర్జెంటీనా మీద పూర్తి డిఫెన్స్ ఆడింది. పూర్తిగా డిఫెన్స్‌లో ఉండాలని కోచ్ టచెల్ నిర్ణయించడంతో, చివరికి అదే వారి ఓటమికి కారణమైంది. నా అభిప్రాయం ప్రకారం, ఆ మ్యాచ్‌లో ఫైనల్‌కు చేరాల్సింది ఇంగ్లాండే.

సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేసిన వ్యూహాత్మక తప్పే ఫైనల్‌లో అర్జెంటీనా కూడా చేసింది. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే, కొంతమంది అర్జెంటీనా అభిమానులు కూడా “స్పెయిన్ గోల్ చేసి గెలిస్తే బాగుంటుంది” అనుకునే స్థితికి వచ్చారు. అంతగా వారి వ్యూహం విఫలమైంది.

ఆట ప్రారంభానికి ముందే నేను ఒక మాట చెప్పాను. అర్జెంటీనా ఆటగాళ్లకు ఎల్లో కార్డులు పడతాయి, అవసరమైతే రెడ్ కార్డ్ తీసుకున్నా ప్రత్యర్థిని ఆపడానికి ప్రయత్నిస్తారని. చివరికి అలానే జరిగింది. అర్జెంటీనా చేయాల్సింది తమ సహజ ఆటను ఆడుతూ గోల్స్ చేయడానికి ప్రయత్నించడం. కానీ ప్రత్యర్థిని ఆపడంపైనే ఎక్కువ దృష్టి పెట్టి, ఎవరూ గోల్ చేయకపోతే షూటౌట్‌లో గెలుస్తామని భావించిన వ్యూహాన్ని అనుసరించారు. నా దృష్టిలో అది తప్పు వ్యూహం.

చాలా మంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా ఇలాగే వ్యవహరిస్తాయి. ప్రతి నాయకుడి వెనుక ఒక వ్యూహం ఉంటుంది. వారు చేసే ప్రతి నిర్ణయానికి ఒక ఆలోచన ఉంటుంది. కానీ అది సరైన వ్యూహమా, తప్పు వ్యూహమా అన్నది చివరికి వారికి తెలుస్తుంది. అయితే ప్రజలకు మాత్రం చాలా సందర్భాల్లో ముందే అర్థమవుతుంది. నిజమైన కార్యకర్తల మాట వినాలని అనుకోరు; చెప్పినా పట్టించుకోరు.
సో, ఎవరూ తప్పు కాదు, వాళ్ల వ్యూహం తప్పు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక మెస్సీ తలవంచిన రాత్రి… ఒక యమాల్ తలెత్తిన ఉదయం!
  • ఆ బరాజులు పనికిరానట్టేనా? కాళేశ్వరం తాజా స్థితిపై సాంకేతిక విశ్లేషణ !!
  • ‘పెళ్లాల మార్పిడి’ – సొసైటీయే మారుతోంది – సర్కారు ఏం చేయగలదు..?
  • తిట్టు నేరం కాదా..? ఏది అశ్లీల నేరం..? ఏది కాదు..? వర్గీకరణ ఎలా..?
  • ఇదుగో… కేసీఆర్ క్యాంప్ నుంచి మరో దిక్కుమాలిన బురద ప్రచారం !!
  • అవున్నిజమే… బిగ్‌బాస్ మేకప్ తుడిచేస్తే… ఎవరి బతుకులు వాళ్లవే
  • ఏది మునిగే టైటానిక్? ఏది తస్కిన మేడిగడ్డ? ఎవరి గాచారం ఏంటి?
  • సినీ సంగీత ప్రేమికులా మీరు ? ఈమె గురించి తప్పక చదవాలి !!
  • మోడీ షా బ్లండర్ ! బొద్దింకలపై మొదటి నుంచీ పిరికి వైఫల్యమే..!!
  • రాజకీయులు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions