Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తిట్టు నేరం కాదా..? ఏది అశ్లీల నేరం..? ఏది కాదు..? వర్గీకరణ ఎలా..?

July 21, 2026 by M S R

.

మన కోర్టులు చెప్పే తీర్పులు కొన్ని విస్మయకరంగా ఉంటున్నాయి… కొన్నింటి ప్రభావం ఇప్పుడప్పుడే అంచనా వేయలేం, అవి దీర్ఘకాలికం… బాగా చర్చనీయాంశమైన వాటిల్లో ఒకటి… ఒకవేళ భార్య వేరే వ్యక్తుల ద్వారా సంతానాన్ని కలిగినా, వాళ్లకు జెనెటిక్ ఫాదర్‌గా అఫీషియల్ భర్త మాత్రమే ఉంటాడు అనే తీర్పు… పెళ్లయిన స్త్రీ వేరేవాళ్లతో సంబంధాలు పెట్టుకుంటే నేరమేమీ కాదనే తీర్పు కూడా బాగా చర్చనీయాంశమైంది అప్పట్లో…

రకరకాల తీర్పులపై సొసైటీ భిన్నంగా స్పందించినా, అర్థం చేసుకున్నా… కోర్టు తీర్పులతో ఎవరూ గోక్కోరు కాబట్టి బహిరంగంగా పెద్దగా చర్చనీయాంశాలు కాకుండా పోతాయి… తీర్పులకు మోటివ్స్ అంటగట్టకుండా ఉన్నంతకాలం, తీర్పులపై అభిప్రాయాలు నేరాలు కావు… కానీ న్యాయవాద వృత్తిలో నిపుణులు కూడా నిశ్శబ్దాన్నే పాటిస్తుంటారు… ఎందుకో..!! మళ్లీ ఇదంతా పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు…

Ads

సరే, తాజా వార్తకు వద్దాం… అసభ్య పదజాలం (Profanity), బూతులు (Abuse), వల్గారిటీ (Vulgarity) వంటివి ఎంత అభ్యంతరకరంగా, చెడుగా ఉన్నప్పటికీ, చట్టపరంగా వాటిని అశ్లీలత (Obscenity) కింద పరిగణించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది రీసెంటుగా… తమిళనాడుకు చెందిన మణి అనే వ్యక్తి కేసులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ పంచోలీల ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.

కోర్టు ప్రధాన వ్యాఖ్యలు, నిర్వచనాలు

  • అశ్లీలతకు ఉండే ప్రత్యేక ప్రమాణాలు…: కేవలం ఎవరినైనా తిట్టడం లేదా అసభ్య పదాలు వాడటం వల్ల అవి చట్టరీత్యా అశ్లీల నేరం (Obscene Offence) కావు…

  • చట్టం ప్రకారం అశ్లీలత అంటే…: ఆ పదాలు లేదా చర్యలు విన్నవారిలో లైంగిక ఉద్రేకాన్ని రేకెత్తించేలా, కామప్రేరిత ఆసక్తిని ప్రోత్సహించేలా, వారి నైతిక విలువలను దెబ్బతీసేలా లేదా వారిని నీతిభ్రష్టులుగా మార్చేలా ఉంటేనే వాటిని అశ్లీలంగా పరిగణించవచ్చు…

  • భావోద్వేగ ప్రభావం…: కొన్ని తిట్లు విన్నప్పుడు మనకు తీవ్రమైన అసహ్యం, విరక్తి (Disgust) కలగవచ్చు లేదా షాక్‌కు గురికావచ్చు. అంతమాత్రాన వాటిని నేరంగా ముద్ర వేయలేమని కోర్టు తేల్చిచెప్పింది…

  • బహిరంగ ప్రదేశాల నిబంధన…: బహిరంగ ప్రదేశంలో ఈ రకమైన పదజాలం ఉపయోగించడం వల్ల ఇతరులకు వాస్తవంగా ఇబ్బంది కలిగిందని రుజువు కావాల్సి ఉంటుంది…

కేసు నేపథ్యం (Background)

  • సంఘటన…: తమిళనాడులో 2017 ఆగస్టులో ఒక వ్యవసాయ భూమి వివాదానికి సంబంధించి ఈ గొడవ జరిగింది…

  • న్యాయపరమైన పోరాటం…: ఈ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా, ఒకరినొకరు తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించుకున్నారు… దీనిపై నమోదైన కేసు వివిధ న్యాయస్థానాల ద్వారా సుప్రీంకోర్టుకు చేరింది…

  • అప్పీలు తీర్పు…: ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, నిందితుడు వాడిన పదాలు అభ్యంతరకరమే అయినప్పటికీ, అవి చట్టం నిర్వచించిన ‘అశ్లీలత’ పరిధిలోకి రావని స్పష్టం చేస్తూ అప్పీలును పాక్షికంగా అనుమతించింది…

న్యాయపరమైన విశ్లేషణ

భారతీయ చట్టాల ప్రకారం ‘అబ్సీనిటీ’ లేదా అశ్లీలత అనే పదానికి స్పష్టమైన పరిమితులు ఉన్నాయి… న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా వ్యక్తిగత ఆగ్రహంతో వాడే బూతులను, ఉద్దేశపూర్వకంగా లైంగిక వాంఛలను ప్రేరేపించే అశ్లీల ప్రదర్శనలను లేదా సాహిత్య /వస్తువులను వేర్వేరు కోణాల్లో చూస్తాయని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది… అసభ్యకరమైన తిట్లు చట్టరీత్యా ఇతర నేరాల (ఉదాహరణకు శాంతిభద్రతల భంగం, పరువు నష్టం లేదా బెదిరింపులు) కిందకు రావచ్చునేమో కానీ, కేవలం భాషాప్రయోగం ఆధారంగా వాటిని ‘అశ్లీల నేరం’ అనలేమని కోర్టు హితవు పలికింది…

ఇదీ కేసు నేపథ్యం… కానీ తిట్ల వల్ల దెబ్బతినే మనోభావాలు, కలిగిన అగౌరవం, అవమానం, మానసిక వేదన మాటేమిటి..? నీయమ్మ, నీయక్క, లం- కొడుకా, ముం- కొడుకా, లం-, మాదచ్చో-, బాంచో- వంటి అనేక తిట్లు చాలామంది ఫ్లోలో మరీ ఊతపదాలుగా వాడుతుంటారు… ఇంతకీ ఆ తిట్లు నేరాలా, కాదా..? ఏ తిట్టు అశ్లీల నేరం, ఏ తిట్టు చట్టపరంగా ఆమోదనీయం..? ఎవరు నిర్ధారించాలి..? ప్రామాణికాలు, నిర్వచనాలు, స్టాండర్డ్స్ ఏముంటాయి..? అశ్లీలమో కాదో పక్కనపెడితే తిట్టు నేరం ఎందుకు కాకూడదు..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • క్లియర్ ఎగ్జాంపుల్..! ఇలాంటి కేరక్టర్ల ఎంపిక లోపం యూపీఎస్సీదే..!
  • ఒక మెస్సీ తలవంచిన రాత్రి… ఒక యమాల్ తలెత్తిన ఉదయం!
  • ఆ బరాజులు పనికిరానట్టేనా? కాళేశ్వరం తాజా స్థితిపై సాంకేతిక విశ్లేషణ !!
  • ‘పెళ్లాల మార్పిడి’ – సొసైటీయే మారుతోంది – సర్కారు ఏం చేయగలదు..?
  • తిట్టు నేరం కాదా..? ఏది అశ్లీల నేరం..? ఏది కాదు..? వర్గీకరణ ఎలా..?
  • ఇదుగో… కేసీఆర్ క్యాంప్ నుంచి మరో దిక్కుమాలిన బురద ప్రచారం !!
  • అవున్నిజమే… బిగ్‌బాస్ మేకప్ తుడిచేస్తే… ఎవరి బతుకులు వాళ్లవే
  • ఏది మునిగే టైటానిక్? ఏది తస్కిన మేడిగడ్డ? ఎవరి గాచారం ఏంటి?
  • సినీ సంగీత ప్రేమికులా మీరు ? ఈమె గురించి తప్పక చదవాలి !!
  • మోడీ షా బ్లండర్ ! బొద్దింకలపై మొదటి నుంచీ పిరికి వైఫల్యమే..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions