.
కోడి చెరువును నేను కబ్జా చేసినట్టు చెబితే,, తేలితే నేను తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తా…. అని గంభీరంగా ప్రకటించాడు కదా పవన్ కల్యాణుడు… మాట మీద నిలబడాలి… అసలే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దరించేసి, ఇక తెలంగాణను అన్నిరకాలుగానూ ఉద్దరిస్తాను అని గోకుతున్నాడు కదా… తను అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు కాబట్టి, సనాతన ధర్మ రక్షకుడు కాబట్టి, తన మాట మీద నిలబడాలి… లేకపోతే తనను ఎంకరేజ్ చేస్తున్న మోదీ, చంద్రబాబుల మీద ఒట్టే…
అవును, ఈ కబ్జాలు, ఎఫ్టీఎల్ యవ్వారాలు, కూల్చివేతలు గట్రా వ్యవహారాలు చూస్తున్న హైడ్రా చీఫ్ రంగనాథుడే చెప్పాడు… ఏమనీ అంటే… ‘‘‘2014లో పవన్ కల్యాణ్ జన్వాడ పరిసరాల్లో 10 ఎకరాలను కొన్నాడు… అందులో ఆరు నుంచి ఏడు ఎకరాలు ఫుల్ ట్యాంగ్ లెవల్లో ఉన్నాయి, అంటే అది ప్రైవేటు భూమిగా పరిగణించబడదు…
Ads
అంతేకాదు, అందులో మూడు నుంచి నాలుగు ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, అందుకని దాంతో వివాదం లేదు, కానీ చెరువు పరిధిలో ఫెన్సింగ్ చేయడం చట్టవిరుద్ధం, తదుపరి చర్యలు ఏమిటనేది చట్టప్రకారం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం… కాకపోతే పవన్ కల్యాణ్ అక్కడ ఏ నిర్మాణాలూ చేపట్టలేదు…’’

నో, నో, నేను దాన్ని కొన్నాను, కబ్జా చేయలేదు అని పవన్ కల్యాణ్ సమర్థించుకోచూసినా అది చెల్లదు, తనను ఎవరో మోసగించి కట్టబెట్టారు, నన్నెవడు అడ్డుకునేది, ఏమీ కాదులే అని పవన్ కల్యాణ్ కొనుక్కున్నాడు, సో, అది ఆక్రమణ లేదా అక్రమ కొనుగోలు కిందకు వస్తుంది… 500 కోట్ల ప్రాపర్టీ…
హైడ్రా నోటీసు ఇస్తుందా..? వేచి చూస్తుందా..? అనేది పక్కన పెడితే… ఓ బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మనిషి, ఓ పార్టీ అధినేత, పైగా కేంద్రంలోని మోదీ సర్కారుకు కావల్సిన కేరక్టర్… మరి తను నిజాయితీగా వ్యవహరించాలి కదా… అసలే తెలంగాణ ఏర్పడితే పదీపదకొండు రోజులు నిద్రాహారాలు మాని బాధపడిన ‘ట్రూ తెలంగాణ ప్రేమికుడు’… ఇప్పటికీ తన దిష్టి వ్యాఖ్యలతో తెలంగాణను ప్రేమించేవాడు కదా!!
కానీ ఇక్కడ ఓ చిక్కు… పవన్ కల్యాణుడి అన్న చిరంజీవి అందరికీ కావల్సినవాడు, మోదీకి, చంద్రబాబుకు ఎట్సెట్రా… రేవంత్ రెడ్డికి కూడా..,! అందుకే కదా, మొన్న యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డులో అడగకుండానే చిరంజీవి భార్య అలియాస్ పవన్ కల్యాణ్ వదిన సురేఖకు స్థానం కల్పించాడు… సో, తనేమీ తొందరపడడు…
చివరగా… పోక్సో కేసుల్లో రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరించాలో నీతులు చెప్పిన పవన్ కల్యాణ్‌కు… తన మెడపైనే ఈ కోడిచెరువు కత్తి వేలాడదీసి రేవంత్ రెడ్డి జవాబు చెప్పాడు… పోక్సో కేసుల్లో ఏం చేయాలో తెలంగాణ పోలీసులకు బాగా తెలుసు గానీ, నీ కబ్జా కథేమిటో ముందు తేల్చేయవయ్యా పవన్ కల్యాణూ..!! నువ్వు పదే పదే గోకే తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది!!
Share this Article