Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘యంగెస్ట్- ఫాస్టెస్ట్ ఫిఫ్టీ’ బుడ్డోడు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కాదు… ఎందుకు..?

July 24, 2026 by M S R

.

నిన్న జింబాబ్వేతో ఇండియా టీ20 మ్యాచ్ జరిగింది కదా… సరే, పెద్ద పెద్ద కమర్షియల్ ప్రసార సంస్థలకు చిన్నచూపు… జింబాబ్వే అంటే వాటి దృష్టిలో అనామక జట్టు, గల్లీ లెవల్ జట్టు… కానీ అదీ ఒకప్పుడు సంచలనాలను నమోదు చేసిన ఇంటర్నేషనల్ జట్టే… ఇప్పుడు వెస్టిండీస్, శ్రీలంకలాగే అదీ తన పాత ఇమేజ్ కోల్పోయింది…

వైభవ్ సూర్యవంశీ తన గత మూడు మ్యాచుల్లో పెద్దగా మెరవకపోయినా సరే, స్టిల్, ప్రేక్షకులకు తన ఆట చూడాలన్న బలమైన కోరిక ఉంది… దానికోసమే చానెళ్లు వెతికితే ఎక్కడా ప్రత్యక్ష ప్రసారం లేదు, ఎఐని అడిగితే రెండు యాప్స్, వెబ్‌సైట్ల పేర్లు, చానెళ్ల పేర్లు చెప్పింది, డీడీ స్పోర్ట్స్‌లో చూడొచ్చునని చెప్పింది… అవి మన స్మార్ట్ టీవీల డిష్- బ్రాడ్‌బాండ్ ప్యాకేజీల్లో రావు…

Ads

అదేదో వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఈ మ్యాచుకు 29 రూపాయలు కట్టు అన్నాడు… అదేదో అనామక జట్టుకు మన ఖాతా నుంచి (యూపీఐ అయినా సరే) డబ్బు లావాదేవీ ఎందుకులే అనుకుని చాలామంది వెనక్కి తగ్గారు… కొందరు ఆ డబ్బు కట్టారు, తీరా చూస్తే వెంటనే వైభవ్ ఔట్… ఉసూరుమన్నారు.., బట్, ఫాస్టెస్టె హాఫ్ సెంచరీ చేసిన తొలి యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు, అది గతంలో సచిన్ పేరిట ఉండేది… (కానీ సచిన్ ఫేస్ చేసిన జట్ల రేంజ్ వేరు)…

నిజానికి జింబాబ్వే బౌలర్లు బాగా బౌల్ చేశారు, అది బౌలింగుకు అనువైన పిచ్ కూడా… అభిషేక్ ఫ్లాప్… శ్రేయస్, తిలక్, ఇషాన్ కూడా స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయారు… ఆ పిచ్‌పై కూడా 19 బాల్స్‌లో 50 అలవోకగా కొట్టాడు వైభవ్… ప్రస్తుతం టీ20కు తగిన ధోరణి అది… జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించడానికి టెస్ట్ మ్యాచ్ కాదు, ఎక్కువ టైమ్, బాల్స్ ఉండటానికి వన్డే మ్యాచ్ కాదు… మొదటి బంతి నుంచీ దూకుడే గెలుపో ఓటమో జానేదేవ్… ఆ కోణంలో వైభవ్ దూకుడు కరెక్టు… (ఇది తనకు అలవాటైన పిచ్, గ్రౌండ్… అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో తను 80 బంతుల్లో 175 రన్స్ బాదాడు…)

కానీ తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాలేదు… అదీ ఇక్కడ చెప్పుకోవాల్సింది… ఎందుకంటే..? మయాంక్ యాదవ్… బౌలింగుకు అనుకూలంగా ఉన్న పిచ్ మీద బాగా బౌల్ చేశాడు… రెండు కీలక వికెట్లు మొదట్లోనే తీశాడు… 4 ఓవర్లలో కేవలం 18 రన్స్… అందులో 14 డాట్ బాల్స్… అందుకని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మయాంక్‌నే వరించింది… (మయాంక్ యాదవ్, అశోక్ శర్మ ఇద్దరి బర్త్ డే ఒకటే… ఒకేరోజు పుట్టారు 17.6.2002… ఒకే మ్యాచులో తొలి బంతిని పంచుకున్నారు… మయాంక్ పాత కాపే, అశోక్ డెబ్యూ మ్యాచ్…) సో, వరుసగా విఫలమవుతున్న సర్పంచ్ సాబ్‌కు ఇది తొలి గెలుపు!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అదే గ్లోబరీనా! – కీలెరిగి వాత పెట్టడంలో రేవంత్ తరువాతే ఎవరైనా?
  • ‘యంగెస్ట్- ఫాస్టెస్ట్ ఫిఫ్టీ’ బుడ్డోడు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కాదు… ఎందుకు..?
  • మరక మంచిదే… ఇదీ ఓ పాఠం… ఆదమరిస్తే మరింత ప్రమాదం…
  • నీట్ ఒక్కటే కాదు ! అసలు వైద్య విద్య సమస్యల లోతుల్లోకి వెళ్లేవారేరీ !
  • రూమ్ రెంటుకూ తిప్పలు పడే స్థితి నుంచి… జాతీయ అవార్డు గ్రహీత దాకా…
  • మోదీ ప్రతిష్ట నానాటికీ పలుచన – బీజేపీకి ఇవన్నీ అశుభ సూచికలే !
  • అక్షరసత్యం ! “ఇండస్ట్రీని పెంట పెంట చేసి పడేశారు”..!
  • వితండ- తొండి వాదన ! మళ్లీ మళ్లీ కేసీయార్ అదే శుష్కవాదం !
  • Sorry Vijay, You Failed – టీవీకే పార్టీ బ్లాక్ బస్టర్… జననాయకన్ డిజాస్టర్..!
  • రెండు చిత్రాలు – రెండు అపురూప జ్ఞాపకాలు… కాలం రాసిన కథలు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions