Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదే హైడ్రా – అదే ఆర్మీ – రెండు వేర్వేరు భిన్న వార్తలు !!

July 24, 2026 by M S R

.

ఈ కేసుల్లోని మెరిట్స్, డీమెరిట్స్ గురించి కాదు… రెండు పరస్పరం కంట్రాస్టుగా అనిపించే రెండు వార్తలకు మీడియాలో దక్కిన ప్రయారిటీ గురించి…! ఆశ్చర్యం కూడా కలిగింది…

నిన్న ఏదో కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి హైడ్రా రంగనాథ్‌ అరెస్టుకు, అవసరమైతే ఆర్మీని ఆదేశిస్తామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది… అసాధారణం… ఆర్మీని హైకోర్టు ఆదేశించగలదా అనే ప్రశ్నను- చర్చను పక్కన పెడితే… వార్త మాత్రం ఇంపార్టెంటే… దానికి సరైన ప్రాధాన్యం దక్కాల్సిందే… పలు పత్రికలు ఫస్ట్ పేజీలో కవర్ చేశాయి కూడా…

Ads

https://newsmeter.in/top-stories/will-not-hesitate-to-order-your-arrest-telangana-hc-warns-hydraa-chief-ranganath-for-defying-judicial-directions-772233

హైడ్రా

అదే మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో కుత్బుల్లాపూర్ మండలంలోని, ఓ చోట తమ ఆర్మీ స్థలాన్ని ఎవరో ఆక్రమించుకుని ఓ జీ+2 బిల్డింగ్ కడుతున్నారని, మీరు చర్యలు తీసుకుని, ఆర్మీ స్థలాన్ని కాపాడాలని ఆ ఆర్మీయే అదే హైడ్రా రంగనాథ్‌ను కోరిందని మరో వార్త కనిపించింది… పూర్తి కంట్రాస్టు…

https://newsmeter.in/hydraa/indian-army-seeks-hydraas-help-to-stop-encroachment-on-defence-land-in-hyderabad-772253

హైడ్రా

అయితే ఈ వార్తకు పత్రికల్లో సరైన ప్రాధాన్యం దక్కలేదు అనిపించింది… ఒకటీరెండు పత్రికలయితే మరీ సిటీ పేజీల్లో పబ్లిష్ చేసినట్టు కనిపించింది… ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ జైసింగ్ హైడ్రా రంగనాథ్‌ను కలిసి ఈ విజ్ఞప్తిని సమర్పించారు… వెంటనే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి, తనకు రిపోర్ట్ చేయాలని అప్పటికప్పుడు రంగనాథ్ తన సిబ్బందిని ఆదేశించాడు… ఇదంతా వార్త సారాంశం…

ఏ ఆర్మీని రంగంలోకి దింపుతామని న్యాయవ్యవస్థ చెబుతున్నదో అదే ఆర్మీ అదే హైడ్రా రంగనాథ్‌ను తమ భూమి రక్షణ కోసం ఆశ్రయించడం నిజంగా ఇంట్రస్టింగ్ న్యూసే… రెండూ అసాధారణాలే… అందుకే వాటికి దక్కిన ప్రయారిటీ తేడాలే కొంత ఆశ్యర్యం అనిపించాయి!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!
  • యథా కేసీయార్- తథా హరీష్ రావు… పక్కా యాంటీ దళిత్ పాలసీ…
  • ప్యారడైజ్‌ మూవీలో సవారీ కులదేవత, ఆ ఉగ్రశక్తి ఎవరో తెలుసా..?
  • మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?
  • సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!
  • తిను, తినను… ఇదేం తెలుగు భాషరా మీ మొహాలు మండా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions