.
దాసోహం… దాసోహం… అచ్చు వ్యవసాయ చట్టాల రద్దులాగే… చేతులెత్తేసిన మోదీ… ఇక చాలించు మహాప్రభో… చాలు… ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… రాజ్యం, మోదీ ఓటమి…
.
క్లియర్… ఢిల్లీని ముట్టడించండి, కేంద్రం తప్పక దిగి వస్తుంది, ఏదడిగితే అది చేస్తుంది… వావ్, మోదీ… మంచి మార్గం చూపించావు అసాంఘిక శక్తులకు…
.
ఇక రాను రాను ఇదే పంథా… ఎవడికి ఏ డిమాండ్ నెరవేరాలన్నా వెంటనే సంప్రదించండి… కేజ్రీవాల్, సీజేపీ, ఏ విద్యార్థుల పేర్లతోనో అరాచకం క్రియేట్ చేయండి…. విక్టరీ పక్కా… ఛ… బలమైన రాజ్యం మోకరిల్లింది… మోదీ ప్రతిష్ట పాతాళానికి… ఇండియన్ జేమ్స్‌బాండ్ సన్యాసం స్వీకరించడం బెటర్…
.
యోగీ ఆదిత్యనాథ్ మాత్రమే కరెక్టు ఈ దేశానికి… నాట్ మోదీ… నాటెటాల్ మోదీ!! ప్రతి జాతీయవాది బయటకు వెల్లడించలేకపోయినా లోలోపల మథనపడుతున్నది ఇదే…
.
ఎవడో అన్నాడు కదా, మోదీ భయపడుతున్నాడు పిరికి అని… నిరూపించాడు మోదీ !! ఎస్, పిరికి..!!
.
ఇంకెవడూ మొదలెట్టలేదా… ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే మోదీ అని..!!
.
నిన్నటిదాకా ఓ అనామకుడు, ఎవడికీ తెలియనివాడు, ఎక్కడో ఏదో దేశంలో బతికేవాడు…. ఢిల్లీ వీథుల్లో సైరన్ మోగిస్తే… అడ్డుకోలేక, అదుపు చేయలేక, వెనుక చేరిన యాంటీ నేషన్ శక్తుల్ని నియంత్రించలేక… చివరకు చేతులెత్తేసిన ది గ్రేట్ నేషన్… ది గ్రేట్ మోదీ… చివరకు తన పదవికే ఎసరు అని భయపడ్డాడా..? ఎంత దౌర్బల్యం!!
.
ఈ దేశం ఎవడికీ తలవంచదు అని గర్వంగా ఇన్నాళ్లూ అభిమానంతో, గర్వంతో విర్రవీగిన ప్రతి ఒక్కడూ తలదించుకునేలా చేసింది ఈ ప్రభుత్వం..!! ఎస్, జంతర్ మంతర్‌లో ఇప్పుడు నరకాసురులే దీపావళి చేసుకుంటున్నారు..!!
.
Ads
మోదీని సమర్థిస్తూ ఎవరెన్ని నెరేటివ్స్ క్రియేట్ చేసి, ప్రసారం చేసినా… ఈ ప్రాథమిక వ్యతిరేకత తగ్గదు… ఇంకా పెరుగుతుంది… గుజ్జూల పాలనకు రోజులు దగ్గర పడ్డట్టే అనిపిస్తోంది…
.
ఇది యువత విజయం… ఇది విద్యార్థుల విజయం… అని ముద్రలు వేయకండి… చాలా శక్తులు పనిచేశాయి, అవన్నీ ఇప్పుడు పండుగ చేసుకుంటున్నాయి… ఇండియా తలదించడం సులభం అనే ధీమా వచ్చేసింది వాటికి…!!
.
ఈరోజు బొద్దింకలు, రేపు చిట్టెలుకలు, లేదంటే పందికొక్కులు… ఇక్కడ ప్రధాన్ రాజీనామా కాదు ఇష్యూ… ప్రధాని తలదించుకోవడమే విషాదం..!!
Share this Article