.
ఎక్కడో ఓ వార్త కనిపించింది… బాగుంది… దేనికి సంబంధించినదీ అంటే..? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అప్లాజ్ అందుకుంటున్న శ్రీగౌరీప్రియ గురించి! నో డౌట్, చెన్నై లవ్ స్టోరీ సినిమా కథాకథనాల గురించిన విశ్లేషణలు, రొటీన్ సమీక్షల్ని పక్కన పెడితే… ఆమె బాగా నటించింది… ఈ తెలుగమ్మాయి, ఈ మిస్ హైదరాబాద్ ఆ పాత్రను ఆవాహన చేసుకుంది, మంచి పాత్రలు పడితే ఇంకా రాణిస్తుంది… కానీ..?
ఒక్కసారి మరో హైదరాబాదీ అమ్మాయి వైష్ణవి చైతన్య గురించి ఇక్కడ చెప్పుకోవాలి… అదే సినిమా టీమ్ నుంచి మూడేళ్ల క్రితం బేబీ సినిమా వచ్చింది… అందులో వైష్ణవి నటనకు కూడా ప్రస్తుతం గౌరీప్రియకు దక్కినంత అప్లాజ్ దక్కింది… పాపులర్ అయిపోయింది…
Ads
తెలుగు అమ్మాయిలకు మంచి పాత్రలు ఇస్తే ఎందుకు దున్నేయరు అనే వాదనకు వీళ్లిద్దరూ సమాధానం… అంతకుముందు చిన్న చిన్న రోల్స్, యూట్యూబ్ వీడియోలు చేసుకునే వైష్ణవి మంచి పేరు తెచ్చుకోగా, ఇప్పుడు గౌరీప్రియ కూడా సేమ్… ఆ రోల్స్‌లో వేరేవాళ్లు చేస్తే ఇంత పర్ఫామ్ చేయకపోయేవాళ్లా అనే ప్రశ్న అప్రస్తుతం, అక్కర్లేదు కూడా… వాళ్లు సూటయ్యారు…
చెన్నై లవ్ స్టోరీలో భగ్న ప్రేమికురాలిగా, తాగుబోతుగా, ఆఫీస్‌లో ఓ ఉద్యోగిగా, స్నేహితుల మధ్య ముక్కోపిగా ఇలా రకరకాల షేడ్స్ గొప్పగా పండించింది గౌరీప్రియ… నిజం చెప్పాలంటే కొన్నిచోట్ల కిరణ్ అబ్బవరం వెలవెలపోగా, గౌరీప్రియ డామినేట్ చేసింది… తనకు దక్కుతున్న ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఆమె… సక్సెస్ మీట్, థియేటర్ విజిట్స్‌లో కూడా ఎమోషన్‌కు గురవుతోంది… సహజం…

అయితే… తన బేబీ సక్సెస్ తరువాత వైష్ణవి చైతన్య పాత్రల ఎంపికలో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేదు… అగ్ర నిర్మాత ఎవరో ఆఫర్ చేశారని లవ్ మీ ఇఫ్ యు డేర్ ఒప్పుకుంది… ఏమో, అంతకుముందే ఒప్పందాలు కుదిరాయి కాబట్టి చేసిందేమో తెలియదు… అదేమో దారుణంగా డిజాస్టర్… బేబీ సక్సెస్ తరువత ఈ సినిమా కథ విషయంలో, తన పాత్ర విషయంలో సినిమా టీమ్‌తో సానుకూల సంప్రదింపులు జరిపితే బాగుండేది…
తరువాత సిద్ధూ జొన్నలగడ్డతో జాక్ చేసింది. అదీ నేనేం తక్కువ అన్నట్టుగా ఢమాల్ అనేసింది… సో, మూడు సంవత్సరాల్లో వైష్ణవి నటించింది రెండు సినిమాలే చేస్తే ఆ రెండూ ఆమె రేంజ్‌ను పడేశాయి… సరే, ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో చేస్తున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ విడుదలకు రెడీ అవుతోంది…
పాత్రల ఎంపిక ఎంత ముఖ్యమో చెప్పేందుకు ఈమే కాదు, శ్రీలీల అనుభవాలూ ఓ ఉదాహరణే… శ్రీ గౌరీ ప్రియ ఇకపై ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి… ఏ మాత్రం కాంబోల ఉచ్చులో పడినా అసలుకే మోసం వస్తుంది… మరొకటీ చెప్పుకోవాలి…

ఇదే చెన్నై లవ్ స్టోరీ టీమ్‌లో ఎస్కేఎన్ ఆమధ్య బహిరంగంగానే ఇకపై అసలు తెలుగమ్మాయిల్ని ఎంకరేజ్ చేయకూడదని తనూ, సాయి రాజేష్ నిర్ణయించుకున్నామని అన్నాడు… దానిపైనా విమర్శలొచ్చాయి… సరే, ఆయనకు ఇలాంటి శుష్క వ్యాఖ్యానాలు సహజమే గానీ, ఆ వ్యాఖ్యలు వైష్ణవిని ఉద్దేశించినవే అంటుంటారు… ఎక్కడో తేడా కొట్టింది… పారితోషికం కావచ్చు, పాత్రల స్వభావం కావచ్చు, మరేమైనా కావచ్చు…
ఐనా అదే టీమ్‌కు మళ్లీ గౌరీప్రియ అనే తెలుగమ్మాయే దిక్కయింది… ఆ టీమ్ ఓ సక్సెస్ అందించింది కదానే మొహమాటం కూడా అక్కర్లేదు… గౌరీప్రియ తనకు పాత్ర స్వభావం, కథ నచ్చితేనే చేయాలి… అలా సాయిపల్లవి తన పాత్రల ప్రాధాన్యానికి, కథలకు ఇంపార్టెన్స్ ఇచ్చింది కాబట్టే ఇప్పుడు 4 వేల కోట్ల రామాయణం ప్రాజెక్టులో ఉంది… అర్థమైంది కదా..!!
Share this Article