Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్చ్… చివరకు ఈ అనంత జ్ఞాన శ్రీరాముడూ చెప్పేవాడయ్యాడు !!

July 29, 2026 by M S R

.

ఒక పారిశ్రామికవేత్త వేల కోట్ల ఖర్చు పెట్టి ఓ ఫ్యాక్టరీ పెట్టాడు… నిత్య జీవితంలో అవసరమైన టూత్ పేస్టు, సబ్బు, టాల్కమ్ పౌడర్ ఎట్సెట్రా ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి వదిలాడు… థూ, ఇదే టూత్ పేస్టురా, దీన్ని సబ్బు అంటారా అని= డబ్బు పెట్టి వాటిని కొన్న వినియోగదారుడు తన అభిప్రాయం చెప్పాడు అనుకొండి, అది తప్పా, ఒప్పా..?

ఖచ్చితంగా ఒప్పే… ఇంకెవరూ డబ్బు పోసి, వాటిని కొని మోసపోకూడదనే సామాజిక బాధ్యత, మరికొందరి డబ్బును ఆదా చేయడం.,. వాడు నాణ్యత పెంచుతాడా లేదానేది వాడి ఖర్మ… వాడి దందా అది, ప్రజల ఆకాంక్షలకు మేరకు మారడమా లేదానేది వాడిష్టం… అంతేతప్ప, వాడు మస్తు ఖర్చు పెట్టాడు, వందల మంది ఉపాధికి ఆధారం అనే వాదనలు అబ్సర్డ్… వాటికి విలువ లేదు… వినియోగదారుడి సంతృప్తి అల్టిమేట్… ఇక అసలు విషయానికి వద్దాం…

Ads

అనంత శ్రీరాముడికి అనంత జ్ఞానముందనేది మన భ్రమ మాత్రమే, అది సంకుచితం, పరిమితం అని రీసెంటుగా చాలాసార్లు తనను తానే రుజువు చేసుకుంటున్నాడు పాపం… అదేదో పిచ్చి టీవీషోలో గెంతులు వేస్తూ, ఎగురుతూ, దూకుతూ కనిపించినప్పుడే ఈయనకేదో తేడా కొట్టింది పాపం అనిపించింది… తాజా తన అనంతాజ్ఞానాన్ని మరోసారి చాటుకున్నాడు…

ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ మీట్‌ జరిగింది… తను ఏమంటాడంటే..? ‘‘ఇదే మూవీని ఇదే స్క్రీన్ ప్లేతో వచ్చి ఉంటే తమిళంలో టెర్రిఫిక్, మలయాళంలో మేజిక్, హిందీలో హిస్టారిక్ అని పొడుగుతారు…  కానీ తెలుగులో మాత్రం పాండెమిక్ అనేస్తారు, కెమెరా లెన్స్ ముందుకు వచ్చినప్పుడు కాస్త సెన్స్ తో ఉండాలి, ఒకవేళ రివ్యూ చెప్పాలనుకుంటే టికెట్ డబ్బులకు బాధ్యతగా ఇంట్లో వాళ్లకు చెప్పాలి తప్ప బయట వాళ్లకు కాదు..’’

ఆఫ్టరాల్, మార్కెట్‌లోకి వచ్చే టూత్ పిక్ మీద కూడా వినియోగదారుడు తన అభిప్రాయం చెబుతాడు… అలాంటిది అడ్డగోలు టికెట్ రేట్లతో, నిలువు దోపిడీకి నిదర్శనంగా మారిన థియేటర్‌కు వచ్చి బోలెడు డబ్బు ఖర్చు పెట్టాక… బరాబర్ తన అభిప్రాయం చెబుతాడు వినియోగదారుడు కమ్ ప్రేక్షకుడు… అది మరింత మంది డబ్బు ఆదా చేయడం…

అవునూ, ఏదో అన్నారు తమరు.., లెన్స్ ముందుకు వస్తే సెన్స్ ఉండాలా..? మరి కామన్ సెన్స్ సంగతేమిటి..? కామన్ మ్యాన్ సెన్స్ సంగతేమిటి..? ప్రేక్షకుడు డబ్బు కష్టపడితే వచ్చింది, అదేమీ అప్పనంగా వచ్చిపడేది కాదు… ఇంత అర్థం చేసుకునే జ్ఞానసంపద ఉందో లేదో తెలియదు గానీ… నాలుక మీద అదుపు ముఖ్యమనేదీ కామన్ సెన్స్ పాయింటే…

రివ్యూ అనే పేరే అక్కర్లేదు… మౌత్ టాక్ ఉంటుంది, సోషల్ మీడియాలో అభిప్రాయాలు పోస్ట్ చేస్తారు… రకరకాలు… ప్రేక్షకుల పట్ల బాధ్యత, వినయం, కృతజ్ఞత, ప్రేక్షకుడి తీర్పు పట్ల గౌరవం ఉన్నవాళ్లు ఈ శుష్క వ్యాఖ్యలు, డొల్ల వాదనలకు దిగరు… ఒకవేళ రివ్యూ చెప్పాలనుకుంటే, టికెట్ డబ్బులకు బాధ్యతగా ఇంట్లో వాళ్లకు చెప్పాలట… అవునా, చెవిలో గుసగుసగా చెప్పాలా..? మీర ఇలా తయారయ్యావేం అనంతం…!?

ఎస్… తమిళంలో టెర్రిఫిక్, మలయాళంలో మేజిక్, హిందీలో హిస్టారిక్ అని చెబుతాడు ప్రేక్షకుడు, సో వాట్..? అది తన అభిప్రాయం, ఆ స్థాయికి నువ్వు ఎదుగు, పిచ్చి కూతల్నే పాటలుగా జనంలోకి వదలడం కాదు… ప్రేక్షకుడు ఇలా అభిప్రాయపడాలి, ఇలా అభిప్రాయపడకూడదు అని చెప్పిన సినిమా సెలబ్రిటీ చరిత్రలో లేడు, ఎక్సెప్ట్ అనంత శ్రీరామ్…

ఇదంతా అయినవాళ్లు ఆకుల్లో కానివాళ్లకు కంచాల్లో అన్నట్టుందంటాడు… పరాయి భాషవాడు అయిన వాడు ఎలా అయ్యాడు..? సొంత భాషవాడు కానివాడు ఎలా అయ్యాడు..? ఈమధ్య తమరూ పెగ్గేసి వేదిక ఎక్కుతున్నారా మాస్టారూ..?!

ప్రేక్షకుడికి సినిమా చూడటం వచ్చు, నచ్చకపోతే థూత్కరించడం వచ్చు, నచ్చితే నెత్తిన మోయడం వచ్చు, మరీ అనంతాజ్ఞాన శ్రీరాముడి నీతిబోధ వినాల్సిన దురవస్థులో మాత్రం ప్రేక్షకుడు లేడు… అది మాత్రం పక్కా!! ఈ కథనం బాగా కటువుగా ఉన్నట్టు అనిపిస్తోందా..? నిజం ఇలాగే నిష్ఠురంగా ఉంటుంది పాపం!!

అన్నట్టు, అనంతుడా... రిలీజు కూడా కాకముందే ఆహా, ఓహో, సూపర్, బంపర్, బస్టర్ అని పెయిడ్ రివ్యూలు వదులుతూ ఉంటారు నిర్మాతలు... మరి వాళ్లనేమందాం..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భక్తి తప్పు కాదు – ఇదుగో ఇలాంటి మూఢ భక్తే ‘మోక్షమార్గం’!
  • ప్చ్… చివరకు ఈ అనంత జ్ఞాన శ్రీరాముడూ చెప్పేవాడయ్యాడు !!
  • హైడ్రా ! తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ రాజకీయ విభాగమా ?!
  • ఇదంతా తెలంగాణ అస్థిత్వ సమస్యా? బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ సమస్యా!?
  • బొద్దింకల పార్టీ ! మీకు తెలియని ఒక అంతర్జాతీయ పొలిటికల్ మిస్టరీ !!
  • అసలు సమస్య ‘నీట్’ను దాటి… మన వైద్య వ్యవస్థలోనే ‘రోగాలు’
  • మోదీ జీ, మీ మంత్రిదే కాదు, నా రాజీనామా ఆమోదించండి మరి !!
  • 9 ఏళ్ల తేడాకే ఏడుస్తున్నారు – ఇదుగో ఇక్కడ 19 ఏళ్ల ఏజ్ గ్యాప్ !!
  • ఈ సోషల్ మీడియా సంస్థ ఏకంగా మోదీ వీడియోనే పీకిపారేసింది!
  • దేవుళ్లు ఎక్కడో పైలోకంలో విడిగా ఉండరు – మనుషుల్లోనే ఉంటారు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions