Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథ, సంకల్పం మంచివి! కథ చెప్పే విధానం తెలియక డిజాస్టర్!!

July 30, 2026 by M S R

.
ఒక సినిమా సక్సెస్ కావాలంటే..? ఏం ఉండాలి? ఎలా తీయాలి? అనే ఫార్ములా ఎవడికీ తెలియదు, తెలిస్తే ఈ ఫ్లాపులు, డిజాస్టర్లు ఎందుకుంటాయి..? కానీ ఎలా తీయకూడదో మాత్రం తెలిసి ఉండాలి… కథ చెప్పే విధానం తెలియకపోతే, తెలిసినా మార్కెటింగ్ తెలియకపోతే… అడ్డంగా బోల్తా కొట్టడం గ్యారంటీ… దానికి పర్‌ఫెక్ట్ ఉదాహరణ … ”ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ (The India Story: Slow Poison in Progress)…

ఈ మాట అనడానికి కారణం ఉంది… ఇది జీ స్టూడియోస్ నిర్మించిన సినిమా… 30 కోట్ల దాకా ఖర్చు పెట్టారు… కథ సొసైటీకి ఉపయోగపడేదే… శ్రేయాస్ తల్పాడే, కాజల్ అగర్వాల్ నటించారు… కాజల్ అంటే తమిళం, తెలుగు భాషల్లో చిరపరిచిత నటి…

కథేమిటంటే..? మనం వ్యవసాయానికి వాడుతున్న అనేకానేక రసాయనాలు మన జీవితాల్ని ఎలా కబళిస్తున్నాయనేదే కథ… ఎరువులతోపాటు పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్‌సెక్టిసైడ్స్, వీడిసైడ్స్, హెర్బిసైడ్స్… వాట్ నాట్..? ఎడాపెడా వాడుతున్నాం మనం…

Ads

దాని ప్రభావంతో రైతుకుటుంబాలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నాయి, సమాజం కూడా… కేన్సర్ కేసులు బాగా పెరగడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి… రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాల్లో అప్పులు… ఆ అప్పులకు ప్రధాన కారణాల్లో వైద్యం ఖర్చులు… కేస్కేడింగ్ ఎఫెక్ట్… ఇదొక విషవలయం… సరిగ్గా ఈ సబ్జెక్టుతోనే ఈ సినిమా నిర్మించారు…

kajal

గుడ్, మంచి సంకల్పం, దీన్ని అడ్డుకోవడానికి ఢిల్లీ స్థాయిలో అగ్రి కెమికల్స్ మాఫియా విపరీతంగా ప్రయత్నించింది… (ఇక్కడే మరో విషయం చెప్పుకోవాలి… అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన కలుపు మందు పారాక్వాట్ డైక్లోరైడ్ (Paraquat Dichloride) నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం ఈమధ్యే నోటిఫికేషన్ జారీ చేసింది… అదీ కొన్ని రాష్ట్రాలు వాటంతటవే నిషేధం విధించాక కళ్లు తెరిచి)

ఈ మందు తాగి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు… తక్కువ పరిమాణంలో శరీరంలోకి చేరినా ప్రాణాంతకం, విరుగుడు (Antidote)  కూడా లేదు… అదీ కారణం… ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పటికే దీనిని నిషేధించాయి. మనకు మాత్రం ఇన్ని సంవత్సరాలు పట్టింది… కారణం, అదే అగ్రికెమికల్ మాఫియా….

కాజల్ నటించిన ది ఇండియా స్టోరీలోని కంటెంట్, డేటా, గణాంకాలు శాస్త్రీయంగా లేవని, ఇవి భారతీయ వ్యవసాయాన్ని, రైతులకు,  డెయిరీ/ పౌల్ట్రీ పరిశ్రమలకు చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయని వారి వాదన. వీరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి ఫిర్యాదు చేసి, సినిమా విడుదలపై స్టే విధించాలని కోరారు. సరే, ఆ బోర్డు పట్టించుకోలేదు, అది వేరే సంగతి…

the india story

అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్… 6 రోజుల్లో కేవలం కోటి రూపాయల వసూళ్లు, నెట్ 90 లక్షలు… తెలుగు, తమిళం డబ్ చేశామన్నారు, ఏమైందో తెలియదు… జీ స్టూడియోస్ తీసిన సినిమా వేరే ఏ దేశంలోనూ రిలీజ్ చేయలేదు… వెరసి బొక్కబోర్లా… ఎందుకు..? కథ చెప్పే విధానం తెలియకపోవడం! ఎలాగంటే..?

1. బలహీనమైన కోర్టు రూమ్ డ్రామా (Underwhelming Screenplay), 2. అతి నాటకీయత- సాగతీత (Melodrama & Slow Pace). 3. వ్యవస్థను ప్రశ్నించకపోవడం (Systemic Issues Missed). 4. కేవలం నామమాత్రంగా కార్పొరేట్ సంస్థలను బ్లేమ్ చేసి, చివర్లో సరైన పరిష్కారం చూపించకుండానే సినిమాను ముగించడం. 5. ప్రచారం లోపం, తక్కువ ఆడియన్స్ (Poor Marketing)…

సినిమా మొదటి భాగం విపరీతమైన సమాచారంతో కూడిన వాట్సాప్ ఫార్వర్డ్ సందేశంలా సాగింది. సెకండ్ హాఫ్‌లో ఒక్కసారిగా లీగల్, ఎమోషనల్ డ్రామాగా మారి, చూసే ప్రేక్షకుడికి రెండు వేర్వేరు సినిమాలు చూసిన అనుభూతిని కలిగిస్తుంది…. ఇదీ ఓ మంచి సంకల్పం తెరపైకి చేరి, ప్రేక్షకుల్ని సబ్జెక్టులో ఇన్వాల్వ్ చేయలేకపోవడం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కథ, సంకల్పం మంచివి! కథ చెప్పే విధానం తెలియక డిజాస్టర్!!
  • మరో వారసుడి నిరాశాపూరిత ఎంట్రీ – మోహన్‌ బాబునూ వాడుకోలేదు !!
  • డీఎంకే స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్‌కే విజయ్ రెడీ! ఇలా మొదలైంది!!
  • ప్రియాంక వ్యంగ్య వ్యాఖ్యలు తప్పు! మేధస్సును అవమానించడమే!!
  • ‘అవతార్’ మార్క్ హై గ్రాఫిక్స్ – ‘ఆది పురుషుడు’ రక్షింపబడ్డాడు !!
  • నడుమ వాళ్లేం తప్పు చేశారు..? ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏమీ కారు..!!
  • చెరపకురా పాకీ… నువ్వే చెడేవు! అటు బెలూచ్- ఇటు పీఓకే..!!
  • హరీష్ భయ్… నో గురుదక్షిణ, నో నిర్లక్ష్యం – ఇది సిన్సియర్ ఎఫర్ట్ !!
  • మిస్టర్ క్లీన్ ! మీడియాకన్నా చరిత్ర బాగా అర్థం చేసుకుంది !!
  • “రూమ్ నం. 39… మూడేళ్లుగా ఎవరికీ అర్థం కాని రహస్యం!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions