.
Ashok Pothraj …. #GhostTrain ఇప్పుడు తెలుగులో… వ్యూస్ కోసం మొదలైన ప్రయాణం… తన ప్రాణాల మీదకు వస్తే ఏం జరిగింది..?
హారర్ సినిమాలు అంటే జంప్ స్కేర్స్ మాత్రమే అనుకునేవాళ్లకు Ghost Train ఒక మంచి సర్‌ప్రైజ్. కేవలం గంటన్నర నిడివితో మొదలైన ఈ కొరియన్ థ్రిల్లర్ 2024లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై అప్పుడే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ తో అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుడిని తన ప్రపంచంలోకి లాక్కెళ్తుంది.
Ads
హారర్, సూపర్ నేచురల్ కథలతో యూట్యూబ్ వీడియోలు చేసే ఓ యువతి… వ్యూస్ రావడం లేదనే నిరాశలో, దెయ్యాల కథలకు పేరొందిన ఓ రైల్వే స్టేషన్‌కు వెళ్తుంది. అక్కడ స్టేషన్ మాస్టర్ చెప్పిన నాలుగు భయానక కథలు విన్న తర్వాత… నిజమైన పీడకల మొదలవుతుంది.

సినిమా అసలు బలం దాని వాతావరణం. చీకటి రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు, నిశ్శబ్దాన్ని చీల్చే రైలు శబ్దాలు, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని ఉత్కంఠ ప్రేక్షకుడిని సీటుకు కట్టిపడేస్తాయి. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు చివరి వరకు సస్పెన్స్‌ను నిలబెట్టడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు.
అయితే ఈ సినిమా కేవలం దెయ్యాల కథ కాదు. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం ఎంతటి ప్రమాదానికైనా సిద్ధపడే నేటి తరం మనస్తత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంది. వైరల్ కావాలనే తపన మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందో అద్దంలా చూపిస్తుంది.
ట్విస్టులు ఊహించని విధంగా వస్తాయి. చివరి ఇరవై నిమిషాలు అయితే ఒక్క క్షణం కూడా దృష్టి మళ్లనివ్వవు.
హారర్ సినిమాలు ఇష్టపడేవారు, కొరియన్ థ్రిల్లర్స్ అభిమానులు ఈ Ghost Train తప్పకుండా ఎక్కాల్సిన రైలు బండి…
Share this Article