Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణపై ఇదీ ‘పెద్దన్న’ ప్రేమ ! పెద్ద దొర చెప్పినట్టే అడుగులు !!

August 3, 2026 by M S R

.

అన్నా, నువ్వు పెద్దన్న, అంతే పెద్ద మనసుతో మా రాష్ట్ర అభివృద్ధికి సహకరించు అనగానే… సరే, తమ్ముడూ, అలాగే, నేనున్నా నీవెంట, గో ఎహెడ్ అనడానికి మోదీ రాజనీతిజ్ఙుడు ఏమీ కాదు… జస్ట్, ఏ పొలిటిషయన్… అని తనే నిరూపించుకుంటున్నాడు…

రేవంత్ రెడ్డి ఎంతసేపూ డెవలప్‌మెంట్ యాంగిల్‌లో… రాష్ట్ర- కేంద్ర సమన్వయం అంటాడు, సహకారం అంటాడు, రాజకీయాలు వేరు- అభివృద్ధి వేరు అంటాడు, ఫెడరల్ స్పిరిట్ అంటాడు… ఎన్ని అన్నా సరే, మోదీ తనను కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగానే చూస్తాడు… అది క్లియర్… ఎందుకంటే, మోదీ కేవలం ఓ రాజకీయ నాయకుడు మాత్రమే…

Ads

ఇదిలా కాదని రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకుల్ని, కేంద్రంలో చక్రాలు తిప్పుతామనే భ్రమల్లో ఉన్న కిషన్ రెడ్డి వంటి నాయకుల్ని గోకుతూ బజారుకు లాగడం మొదలుపెట్టాడు… జనంలో పలుచన చేస్తే తప్ప దిగిరారని అనుకున్నాడు…

కానీ కిషన్ రెడ్డి ఓ షో చేశాడు, మెట్రోపై కేంద్ర మంత్రులతో అపాయింట్‌మెంట్లు అన్నాడు, ఫోటోలు దిగారు… మెట్రో ఫస్ట్, సెకండ్ ఫేజులపై ముందుకెళ్లు, నీకెందుకు, మేమున్నాం కదా అనిపించాడు… అంతా పైపైనే, ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెన్సీ అన్నారు… తీరా ఏమైంది..?



మెట్రో

ఏమీ కాలేదు, కాదు కూడా… పెద్ద దొర ప్రభావంలో ఉండే రాష్ట్ర బీజేపీ, రాబోెయే ఎన్నికల్లో చిన్న దొర జెండా మోయాలనుకునే రాష్ట్ర బీజేపీ పడనిస్తుందా..? నివ్వలేదు… అందుకే మెట్రో మొత్తం ఎక్కడికక్కడ స్టాప్… అడుగు కదలడం లేదు ఫైళ్లు…

మీ 13,600 కోట్లు మీరే సేకరించుకొండి అంటుంది కేంద్రం, రాష్ట్ర తన ప్రతినిధిగా జయేష్ రంజన్‌ను ప్రకటించినా కేంద్రం తన ప్రతినిధి ఎవరో చెప్పలేదు… మొత్తానికి ఓ శూన్య స్థితి… పోనీ, ఎన్వోసీ ఇవ్వరా బాబూ అనడిగితే అదీ పట్టించుకోదు కేంద్రం…

ఉద్దేశం చాలా క్లియర్… మెట్రో కదలకూడదు… బీఆర్ఎస్ చెప్పినట్టు నడవాలి… తెలంగాణకు సంబంధించిన ఏ అంశమైనా సరే కేవలం పార్టీ, రాజకీయాల కోణంలో మాత్రమే చూడాలి… ఇదీ ది గ్రేట్ రాజనీతిజ్ఞ మోదీ యవ్వారం..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణపై ఇదీ ‘పెద్దన్న’ ప్రేమ ! పెద్ద దొర చెప్పినట్టే అడుగులు !!
  • మళ్లీ హృతిక్ – కంగనా పంచాయితీ – వీళ్ల పాత కథ తెలుసా మీకు !
  • హీరోయిన్ల రెమ్యునరేషన్లలో పాత రికార్డులన్నీ బద్దలు ! ఈమె టాప్ !!
  • ఎవరి తప్పో, ఎవరి పొరపాటో – నవ్వులపాలైంది మాత్రం పత్రికే !!
  • ఆడు జీవితం ! ఇది దుబయ్ వెట్టిచాకిరీ కథ కాదు – మన పంజాబ్‌లోనే !!
  • ఇండియన్ సినిమా మునుపెన్నడూ ఎరుగని అత్యంత భారీ పందెం !!
  • GenZ – ఇది జంతర్‌మంతర్ బ్యాచ్ కాదు – దేశం తలెత్తుకునే టార్చ్ బేరర్స్ !!
  • ‘పొంతన’ కుదరని ‘గుణాలు ! అన్నీ బాగున్నా ఇన్ని విడాకులేమిటి మరి !?
  • మోక్షమార్గానికి ముందే ‘సైజ్ చెకింగ్ గ్రిల్స్’… అది దాటితేనే మోక్షం!!
  • ఎడాపెడా ఎయిర్‌పోర్టులు ! కొన్నింటికి విమానాల్లేవు- ప్రయాణికుల్లేరు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions