Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇక్కడ ఒక్క బొద్దింక కూడా మాట్లాడదు ! ఎందుకో మీకు తెలుసా !?

August 3, 2026 by M S R

.

బొద్దింకల పార్టీ వెనుక కుట్రలున్నాయి… అది స్పాంటేనియస్‌గా విద్యార్థుల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలు కావు… పర్‌ఫెక్ట్ ప్లాన్… అందుకే ఆ ఆందోళనల్లోకి వెంటనే రకరకాల యాంటీ ఇండియా, యాంటీ హిందూ ఎజెండాలతో అసాంఘిక శక్తులు చొరబడ్డాయి… అందులో దాదాపు 3 వేల మంది దాకా నేరచరితులున్నారు… విధ్వంసానికి ప్లాన్ చేశారు…

అంతేకాదు… జైషే ఉగ్రవాదులు కూడా పోలీస్ దుస్తుల్లో అందులో ప్రవేశించి కల్లోలం క్రియేట్ చేయాలని అనుకున్నారు… కలకత్తాలో అరెస్టయిన ఉగ్రవాది చెప్పిందే అది… ప్లాన్ ప్రకారమే ఆప్, కాంగ్రెస్ ఎంటరయ్యాయి… ఎస్, లీకేజీలపై కఠిన చట్టం, మంత్రి రాజీనామా అనంతరం సీజేపీ ఏకంగా రైతులతో కలిసి ఉద్యమాలకు సన్నాహాలు, ప్రత్యేక పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు……….. ఇవన్నీ నిజాలే, కానీ అర్బన్ నక్సల్ భావజాలమున్నవాళ్లకు ఇవన్నీ చెబితే జీర్ణం కావు…

Ads

పోనీ, ఇంకొకటి చెప్పుకుందాం… జార్ఖండ్‌లో విద్యార్థులు (వీళ్లు అసాంఘిక శక్తులు కారు, ఉగ్రవాద మద్దతుదారులు చొరబడలేదు…) జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) 14వ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్,  JSSC పరీక్షల్లో జరిగిన భారీ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు…

రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వేదికగా విద్యార్థులు ఈ ఆందోళనలు కొనసాగిస్తున్నారు… ఇక్కడ హింస లేదు, విధ్వంసం లేదు, విద్యార్థులు ఎలాంటి హింసకు తావు లేకుండా, పూర్తిగా శాంతియుతంగా త్రివర్ణ పతాకాలు, రాజ్యాంగ ప్రతులతో నిరసనలు తెలుపుతున్నారు. “న్యాయం కావాలి”, “వందేమాతరం” వంటి నినాదాలతో వారు ఆందోళన చేస్తున్న మాట వాస్తవం… సీబీఐ (CBI) విచారణ జరిపించాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు.

జాతీయ మీడియాలో ఇతర ప్రాంతాల హై-ప్రొఫైల్ వార్తలకు ఇస్తున్న ప్రాధాన్యత, రాంచీలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు ముడిపడిన ఈ ఉద్యమానికి ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది నిజం కూడా… ఎందుకంటే, ఇది జంతర్ మంతర్ సీజేపీ ఆందోళనలాగా ప్రిప్లాన్‌డ్ కుట్ర కాదు కాబట్టి…

ఇండియా టుడేతో పాటు పలు వేదికలపై జాతీయ మీడియా పాత్రపై, ప్రధాన రాజకీయ నాయకుల జార్ఖండ్ మౌనంపై చర్చలు జరిగాయి… ఎందుకు, అక్కడ ఉన్నది జేఎంఎం, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, ఎవరూ గొంతెత్తరు… జంతర్ మంతర్‌కూ రాంచీకి నడుమ తేడా అర్థమైంది కదా…

జార్ఖండ్ ఆందోళన

జార్ఖండ్ సర్కార్ ఈ అంశంపై సీఐడీ (CID) విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి… పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూసిన ప్రైవేట్ ఏజెన్సీ (TSR Data Processing) నిర్వాహకులు, కొందరు జేపీఎస్సీ అధికారులను సీఐడీ అరెస్టు చేసింది… ఓఎంఆర్ (OMR) షీట్ల ట్యాంపరింగ్ బయటపడింది…

ఉదాహరణకు, కొద్దిపాటి ప్రశ్నలు మాత్రమే అటెంప్ట్ చేసి, అత్యంత తక్కువ మార్కులు రావాల్సిన అభ్యర్థులు కూడా సరిగ్గా అనూహ్య రీతిలో ఎక్కువ మార్కులు పొంది, అర్హత సాధించినట్లు (సమన్ సౌరభ్ వంటి ఉదంతాలు) సీఐడీ విచారణలో తేలడంతో ఈ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రద్దు చేసే దిశగా పరిణామాలు జరుగుతున్నాయి.

ఈ కుంభకోణం కారణంగా అప్పటి JPSC చైర్మన్ ఎల్. ఖియాంగ్తే రాజీనామా చేయడం, ఆయన నివాసంలో సోదాలు జరగడం తదుపరి పరిణామాలు… అక్కడ విద్యామంత్రి రాజీనామా చేయడు, సీజేపీ మద్దతు అంటుంది గానీ రంగంలోకి రాదు, ఎందుకంటే..? అక్కడున్నది నాన్ – బీజేపీ ప్రభుత్వం కాబట్టి… అది దేశాన్ని అస్థిరత్వం పాలుచేసే ప్రిప్లాన్‌డ్ కుట్రలో ఆ రాష్ట్రం లేదు కాబట్టి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇక్కడ ఒక్క బొద్దింక కూడా మాట్లాడదు ! ఎందుకో మీకు తెలుసా !?
  • గంజి వంపేద్దాం ! ఇప్పుడు WHO చెప్పిందే మన బామ్మలూ చెప్పారు !!
  • తెలంగాణపై ఇదీ ‘పెద్దన్న’ ప్రేమ ! పెద్ద దొర చెప్పినట్టే అడుగులు !!
  • మళ్లీ హృతిక్ – కంగనా పంచాయితీ – వీళ్ల పాత కథ తెలుసా మీకు !
  • హీరోయిన్ల రెమ్యునరేషన్లలో పాత రికార్డులన్నీ బద్దలు ! ఈమె టాప్ !!
  • ఎవరి తప్పో, ఎవరి పొరపాటో – నవ్వులపాలైంది మాత్రం పత్రికే !!
  • ఆడు జీవితం ! ఇది దుబయ్ వెట్టిచాకిరీ కథ కాదు – మన పంజాబ్‌లోనే !!
  • ఇండియన్ సినిమా మునుపెన్నడూ ఎరుగని అత్యంత భారీ పందెం !!
  • GenZ – ఇది జంతర్‌మంతర్ బ్యాచ్ కాదు – దేశం తలెత్తుకునే టార్చ్ బేరర్స్ !!
  • ‘పొంతన’ కుదరని ‘గుణాలు ! అన్నీ బాగున్నా ఇన్ని విడాకులేమిటి మరి !?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions