.
మద్యం కంపెనీలకు షాక్.., అమ్మకాలపై నిషేధం… ఆ బ్రాండ్ల ప్రియుల్లో అసంతృప్తి… మొన్నటి నుంచీ ఒకటే సొద… లొడలొడ రొద… జరిగేది ఒకటి- సోకాల్డ్ మీడియా రాసేది మరొకటి… కనీసం క్రాస్ చెక్ కూడా ఉండదు… విషయం ఏమిటంటే..?
భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) దేశీయ మార్కెట్‌లోని కొన్ని ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్ల నిర్దిష్ట ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం విధించింది. ఇది వాస్తవం… ఆగండి, ఇంకా చదవాలి… నాణ్యత ప్రమాణాల ఉల్లంఘన, కృత్రిమ సువాసనల (ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్) వాడకం వంటి కారణాలతో ఈ చర్య తీసుకుంది…
Ads
ఈ నిషేధానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు… కారణం: మద్యం తయారీలో సహజమైన పద్ధతిలో మాల్ట్, మొలాసిస్ లేదా ద్రాక్షను ఉపయోగించి కాలక్రమేణా పులియబెట్టడం (Maturation) ద్వారా రావాల్సిన వాసన, రుచిని కాకుండా… తయారీదారులు షార్ట్‌కట్‌గా న్యూట్రల్ ఆల్కహాల్‌కు బయటి నుంచి కృత్రిమ విస్కీ లేదా రమ్ ఫ్లేవర్లను కలుపుతున్నట్లు FSSAI ల్యాబ్ పరీక్షల్లో తేలింది.

తప్పుడు లేబులింగ్…: ఉదాహరణకు ‘ఓల్డ్ మాంక్’ రమ్ ఒక వేరియంట్‌పై ‘7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్’ అని ముద్రించినప్పటికీ, అందులో పాత రమ్ స్పిరిట్ 5 శాతానికంటే తక్కువే ఉందని, మిగతాదంతా ఫ్లేవర్ కలిపిన సాధారణ స్పిరిట్ మాత్రమేనని FSSAI గుర్తించింది. ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే అవుతుందని స్పష్టం చేసింది…
ప్రభావితమైన కొన్ని ప్రధాన బ్రాండ్లు: డయాజియో (యునైటెడ్ స్పిరిట్స్): యాంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీ, మెక్‌డొవెల్స్ నంబర్-1 రమ్ తదితర కొన్ని వేరియంట్లు.
ఇన్‌బ్రూ బేవరేజెస్: బ్యాగ్‌పైపర్ డిలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డిలక్స్ XXX రమ్.
మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్: ఓల్డ్ మాంక్ రమ్‌కు చెందిన కొన్ని ప్రత్యేక వేరియంట్లు.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) విధించిన నిషేధం లేదా ఆదేశాలు కేవలం ఆయా కంపెనీల ప్రస్తుత స్టాక్ (మార్కెట్‌లో ఉన్న లేదా పాత లేబులింగ్ ఉన్న సరుకు) పైనే వర్తిస్తాయి తప్ప, ఆ సంస్థల మొత్తం ఉత్పత్తి (Production) మీద కాదు.
-
ఉత్పత్తికి అంతరాయం లేదు…: కంపెనీలు తమ ఫ్యాక్టరీలలో ప్రొడక్షన్‌ను పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదు. ఉత్పత్తి యథావిధిగా కొనసాగించవచ్చు.
-
సరైన లేబులింగ్‌తో అనుమతి…: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం సరిదిద్దబడిన లేబుల్స్‌తో (Corrected/Proper Labelling) లేదా నిబంధనలకు లోబడి కొత్త సరుకును మార్కెట్‌లోకి విడుదల చేసుకోవడానికి పూర్తి వెసులుబాటు ఉంది.
-
నిషేధం దేనికోసం?…: పాత లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేబులింగ్, తప్పుదారి పట్టించే సమాచారం ఉన్న నిర్దిష్ట బ్యాచ్‌ల ఉత్పత్తులను మాత్రమే మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవడం లేదా వెనక్కి తీసుకోవడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం…
మొత్తంగా చెప్పాలంటే, ఇది “మొత్తం బ్యాన్” కాదు, కేవలం లేబులింగ్ లోపాలున్న నిర్దిష్ట ఉత్పత్తులపై తీసుకున్న దిద్దుబాటు చర్య (Corrective Action) మాత్రమే. నిబంధనలను సరిదిద్దుకుని యథావిధిగా వ్యాపారం చేసుకోవచ్చు….
Share this Article