Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయోధ్య, శబరిమల, తిరుమల – ముంబై సిద్దివినాయకుడి గుడిలోనూ..!!

August 6, 2026 by M S R

.

అయోధ్య విరాళాలపై ఏకంగా పార్లమెంటును స్థంభింపజేస్తూ… పార్లమెంటు ఎదుట అపహాస్యపు ప్రదర్శనలు కూడా చేస్తున్నది కదా ప్రతిపక్షం… కానీ శబరిమల నెయ్యి, బంగారం గురించి మాత్రం పల్తెత్తు మాట అనరు… ఎందుకంటే, అది లెఫ్ట్ నిర్వాకం కాబట్టి… అంతెందుకు..?

ఇదే కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ కలిసి పాలించిన మహారాష్ట్రలో, అదీ ముంబై నడిబొడ్డున సిద్ది వినాయక ఆలయంలో జరిగే చోరీల గురించీ కిమ్మనరు… ఎవరో కాదు, ఇప్పుడు ఈ కూటమితో సఖ్యతతో ఉంటున్న ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపణలు చేస్తున్నాడు… ఏటా 18 కోట్ల దాకా హుండీ విరాళాలు పక్కదారి పడుతున్నాయని!

Ads

ముంబైలోని ఈ సిద్ది వినాయక ఆలయం చాలా ఫేమస్… బాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు కూడా దర్శించుకునే గుడి… కాకపోతే తిరుమలలో ఉన్నట్టుగా వ్యాపారాత్మక పోకడలు పెద్దగా ఉండవు గుళ్లో…

సిద్ది వినాయక

రెండు రోజుల క్రితం ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశాడు… ఆయన ఆరోపణలకు ముందే మహారాష్ట్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆలయ ట్రస్టు నుంచి సమగ్ర ఆర్థిక నివేదికను కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది… విరాళాల బాక్సుల నుంచి డబ్బు అపహరిస్తున్నట్లు ఆలయ అధికారులు గుర్తించిన తర్వాత మార్చి 20న ఈ దొంగతనం వ్యవహారం వెలుగులోకి వచ్చింది…

ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం నిందితులందరూ బెయిల్‌పై బయట ఉన్నారు… దీనిపై ట్రస్టు అధ్యక్షుడు సర్వాంకర్ మాట్లాడుతూ.. విరాళాల సేకరణలో తేడాలను గమనించిన తర్వాత మొదట ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది ట్రస్టీలేనని పేర్కొన్నారు…

ఇది ఏనాటి నుంచో సాగుతున్న వ్యవహారం… ఈ ఫడ్నవీస్ ప్రభుత్వానికి ముందు అక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమే ప్రభుత్వంలో ఉంది… 2019 నుంచి 2022 దాకా… తరువాత శివసేన నుంచి వేరుపడి, దాన్ని సొంతం చేసుకున్న షిండే ప్రభుత్వం… 2024లో బీజేపీ, శివసేన ప్రభుత్వం… ఎన్నేళ్లుగానో సాగుతున్న హుండీ నిధుల అక్రమాలకు మరి ఎవరిని బాధ్యుల్ని చేయాలి..?

అయోధ్య చందా చోరీ రచ్చ చేయడం వల్ల బీజేపీని బదనాం చేయాలని, అయోధ్య తాలూకు క్రెడిట్‌ను బీజేపీ నుంచి కత్తిరించాలని విపక్షం ప్లాన్… అంతకుముందు కేదారనాథ్ బంగారాన్ని కూడా దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి… సో, తిరుమల, అయోధ్య, శబరిమల, సిద్దివినాయక… ఏ గుడి చూసినా అక్రమార్కులు ఉంటారు… కానీ సెలెక్టివ్‌గా పొలిటికల్ టార్గెట్లతో గాయిగత్తర చేయడం మాత్రం విశేషం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయోధ్య, శబరిమల, తిరుమల – ముంబై సిద్దివినాయకుడి గుడిలోనూ..!!
  • దురంధర్ సినిమాలో చూపించింది ఈమెనే ! ఆ త్యాగానికి అశోకచక్ర !!
  • ‘‘భావి తరాలు రీల్స్‌ బందీలు – ‘రిథమ్’ తప్పిన అల్గా‘రిథమ్ బతుకులు’’
  • క్షుద్రపూజలు సరే – మరి ప్రేతాత్మలు..? పితృకర్మలు..? (నాలుగో భాగం)
  • క్షుద్రోపాసన ! నెత్తురు, మద్యం, ఎముకలు, పుర్రెలు ! (మూడో భాగం)
  • దుష్టశక్తి కాష్మోరాలు !! అసలు క్షుద్ర పూజలు అంటే ఏమిటి..? (రెండో భాగం)
  • హరీష్ క్షుద్ర పూజలు – దుష్ట శక్తులపై మళ్లీ ఆసక్తికర చర్చ !! (మొదటి భాగం)
  • ఇక నా జీవితానికి క్యాలెండర్ అవసరం లేదు… గడియారం చాలు…
  • ప్రధాని వీడియో పీకిపారేస్తేనే నొప్పి తెలిసింది- చురుకు పుట్టింది !!
  • కల్తీకి ‘పాలు’పడ్డవాడెవడినీ వదల్లేదు – ఎవరికీ మింగుడుపడడు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions