.
కొందరు ఉంటారు… సీజేపీ ఆందోళనలను ఊతం చేసుకుని, దేశంలో అల్లర్లకు, భారీ ఉగ్రవాద చర్యలకు కుట్రలు జరిగాయనే నిజాల్ని అస్సలు అంగీకరించరు… గతంలో ఢిల్లీలో రైతు ఆందోళనల పేరిట సాగిన విధ్వంసానికి మద్దతుగా నిలిచిన ఆప్, తన రాజకీయ సంకుచిత వైఖరితో దేశానికి నష్టం కలిగించడానికి కూడా రెడీ…
తాజాగా ఓ పరిణామం పక్కాగా ఆప్ విచ్ఛిన్నకర ధోరణికి సాక్ష్యం… ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం, 2026 ఆగస్టు 7న అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లర్‌ను తొలగించి, డిఐజి బోర్డర్ రేంజ్ హర్మన్‌బీర్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
Ads
ఇది ఏవో పరిపాలన కారణాలతో జరిగిన బదిలీ కాదు… ఆ గుర్‌ప్రీత్ సింగ్‌కు వేరే దగ్గర పోస్టింగ్ కూడా ఇవ్వలేదు… తను చేసిన పాపం ఏమిటయ్యా అంటే..? ఐఎస్ఐ మద్దతుగల ఉగ్రవాద ముఠా, జంతర్ మంతర్ నిరసనలతో దానికి ఉన్న సంబంధాలపై భుల్లర్ మీడియాకు వివరించడమే…
(యూపీలో దొరికిన ఉగ్రవాదులు కూడా ఇవే కుట్రల్ని వెల్లడించారు…) ఇలా మీడియాకు చెప్పిన కొద్ది రోజులకే ఈ పోలీస్ కమిషనర్ బదిలీ జరిగింది. ప్రణాళికాబద్ధమైన పెట్రోల్ బాంబు దాడి కుట్రకు సంబంధం ఉన్న అనుమానితులను అరెస్టు చేసినట్లు భుల్లర్ ప్రకటించాడు. కొంతమంది అనుమానితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలకు హాజరయ్యారని కూడా ఆయన తెలిపాడు…
జంతర్ మంతర్ దగ్గర ఉగ్ర కుట్రల్ని బయటపెట్టడమే ఆయన చేసిన నేరం, అది కేజ్రీవాల్‌కు అస్సలు నచ్చలేదు, నచ్చదు కూడా… భుల్లర్ వ్యాఖ్యలకు సంబంధించిన, ఎంపిక చేసిన భాగాలను మాత్రమే ఎడిట్ చేసి ప్రసారం చేసిన క్లిప్పులు, అసలైన నిరసనకారులకు, అరెస్టు అయిన ఉగ్రవాద అనుమానితులకు సంబంధం ఉన్నట్లుగా ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగించాయని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంటోంది.
ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీ, భుల్లర్ బదిలీ జరిగిన ఆకస్మిక సమయాన్ని ప్రశ్నించాయి. ఈ కేసుకు సంబంధించి ఆయన వెల్లడించిన విషయాలు అధికార నాయకత్వానికి ఇబ్బంది కలిగించాయా అని వారు నిలదీశారు…
Share this Article